Business Ideas: ఈ బిజినెస్‌తో రోజుకు రూ.5000 సంపాదించుకోండిలా...?

మాంసాహార ప్రియుల్లో మాత్రం చికెన్ పట్ల మమకారం తగ్గదనే చెప్పాలి. కొత్తగా ఎన్ని చికెన్ సెంటర్లు వెలిసినా...జనం మాత్రం తమ ఆహారంలో చికెన్ వినియోగం తగ్గించడం లేదు. దీన్నే అద్భుత వ్యాపార అవకాశంగా మలుచుకోవచ్చు.

Krishna Adithya | news18-telugu
Updated: February 21, 2020, 2:40 PM IST
Business Ideas: ఈ బిజినెస్‌తో రోజుకు రూ.5000 సంపాదించుకోండిలా...?
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
Business Ideas: యువత ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి బాటపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా వినూత్న ఆలోచనలతో యువతరం డబ్బు సంపాదించేందుకు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. అయితే ఫుడ్ బిజినెస్ రంగంలో ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలోనూ ఫుడ్ బిజినెస్ లాభాల పంట పండిస్తోంది. సరిగ్గా అలాంటి వ్యాపారం గురించే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మాంసాహార ప్రియులను దృష్టిలో ఉంచుకొని పెద్ద ఎత్తుల లాభాలు తెచ్చి పెట్టే వ్యాపారం ఏదైనా ఉందంటే అది చికెన్ సెంటర్ వ్యాపారం అనే చెప్పాలి. నిజానికి మాంసాహారంలో అత్యంత పౌష్టిక విలువలు కలిగి ఉండి, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉన్న మాంసాహారం చికెన్ అనే చెప్పాలి. మాంసాహారంలో మటన్, పిష్, బీఫ్, పోర్క్ కన్నా చికెన్ ధర చాలా తక్కువ, మటన్ కేజీ ధర 500 నుంచి 600 వరకూ పలుకుతుంటే...చికెన్ మాత్రం కేజీ ధర..సుమారు రూ.150 వరకూ ఉంటుంది. సీజన్ ను బట్టి హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. అయితే మాంసాహార ప్రియుల్లో మాత్రం చికెన్ పట్ల మమకారం తగ్గదనే చెప్పాలి. కొత్తగా ఎన్ని చికెన్ సెంటర్లు వెలిసినా...జనం మాత్రం తమ ఆహారంలో చికెన్ వినియోగం తగ్గించడం లేదు. దీన్నే అద్భుత వ్యాపార అవకాశంగా మలుచుకోవచ్చు. చికెన్ షాపు ఏర్పాటు చేయాలంటే ముందుగా మనకు 10X10 షాపు మంచి మార్కెట్ ప్లేసులో ఏర్పాటు చేసుకోవాలి. అయితే ఈ మధ్య కొత్తగా ఏర్పాటు చేస్తున్న కాలనీల్లో రెసిడెన్షియల్ ఏరియాల్లో సైతం కిరాణా దుకాణాలతో సమానంగా చికెన్ షాపులు వెలుస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో షాపు అద్దె తక్కువగా ఉండే అవకాశం ఉండే చాన్స్ ఉంది. ఇక చికెన్ షాపులో పనిచేసేందుకు ఒక వ్యక్తిని పనిలో పెట్టుకోవాలి. అతడికి నెల జీతం ఇచ్చేలా మాట్లాడుకోవాలి. అలాగే చికెన్ షాపు ఏర్పాటు చేసేందుకు ఇతరత్రా సామాగ్రి కొనుగోలు చేసుకోవాలి.

చికెన్ షాపులో లాభం పొందండిలా...
సాధారణంగా చికెన్ రేటును పౌల్ట్రీ సమాఖ్య నిర్ణయిస్తుంది. దాన్ని బట్టి కేజీ చికెన్ ధర రూ.80 నుంచి రూ. 120 మధ్య కదులాడుతుంది. హోల్ సేల్ గా మనం షాప్ కోసం కొనుగోలు చేస్తాం కాబట్టి మార్కెట్ రేటు కన్నా ఇది తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక కేజీ చికెన్ రూ.90గా నిర్ణయించుకుంటే, లాభం ఎలా పొందవచ్చో చూద్దాం...లైవ్ కోడి బరువు 2 నుంచి 4 కేజీల వరకూ ఉంటుంది. ఒక లైవ్ కోడి 2.50 కేజీల బరువుంటే...దాని ధర రూ.225 వరకూ ఉండే చాన్స్ ఉంది. అందులో అర కేజీ వరకూ వేస్టేజ్ పోతుంది. అంటే మనకు ఇందులో రెండు కేజీల చికెన్ మిగులుతుంది. అయితే కేజీ చికెన్ మార్కెట్లో రూ. 180 కి అమ్మితే రెండు కేజీల చికెన్ కు రూ.360 వరకూ వస్తాయి. లైవ్ కోడి ధర 225 కాబట్టి, పెట్టుబడి వ్యయంగా తీసివేస్తే...మనకు రూ.135 మిగిలే చాన్స్ ఉంది. అంటే కేజీ చికెన్ మీద రూ.65 లాభం వస్తుంది. రోజుకి 25 కేజీల చికెన్ అమ్మితే మనకు రూ.1600 ఆదాయం లభిస్తుంది. అంటే రోజంతా కలిపి సుమారు 40 మంది కస్టమర్లు వస్తే చాలు మీకు సరిపోతుంది.

బిజినెస్ టిప్స్...
- చికెన్ వ్యాపారంలో శుభ్రత ప్రధానమైనది. శుభ్రత పాటిస్తే కస్టమర్లు ఆటోమేటిగ్గా చికెన్ కొనేందుకు ఆసక్తి చూపిస్తారు.


- ఎలక్ట్రానిక్ కాటా వాడాలి. అప్పుడు కస్టమర్ కు మీపై నమ్మకం కలుగుతుంది.
- అలాగే చికెన్ షాపులో మీకు కోడి గుడ్లు కూడా లెగ్ పీసులు సెపరేట్ గా అమ్ముకుంటే సైతం ఆదాయం పొందవచ్చు.- మసాలా ప్యాకెట్లు, అల్లం వెల్లుల్లి పేస్టు కూడా అమ్ముకుంటే...మీకు ఆదాయం మరింత కలిసి వచ్చే అవకాశం ఉంది.
- డోర్ డెలివరీ, రెస్టారెంట్లు, కేటరింగ్ సర్వీసు వారితో ఒప్పందం కుదుర్చుకుంటే మీ వ్యాపారం మూడు పూవులు ఆరుకాయలుగా నడిచే అవకాశం ఉంది.
First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు