Business Ideas: చిన్న వ్యాపారం... మంచి లాభాలు... ఇది చేస్తే... మీపై ప్రశంసల జల్లే...

చిన్న వ్యాపారం... మంచి లాభాలు... ఇది చేస్తే... మీపై ప్రశంసల జల్లే... (ప్రతీకాత్మక చిత్రం)

Business Ideas: మనం దేశంలో ఈమధ్య కాలంలో బాగా వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారం ఇది. పోటీ చాలా తక్కువ. లాభాలు చాలా ఎక్కువ. నష్టం వచ్చే అవకాశాలే లేవు. అలా ఎలాగో తెలుసుకుందాం.

 • Share this:
  Business Ideas: మన చుట్టూ ఉన్న కాలుష్యం పెరిగిపోతోంది కదా... అందువల్ల ఈ రోజుల్లో యువత... కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉండే అన్ని అవకాశాల్నీ వాడేసుకుంటున్నారు. అలాంటి వారికి మీరు ఇవ్వగలిగే అద్భుతమైన బహుమానం కంపోస్ట్. సో... మీరు కంపోస్ట్ వ్యాపారం ప్రారంభిస్తే... తక్కువ ఖర్చుతోనే మొదలుపెట్టవచ్చు. పోటీ కూడా తక్కువే ఉంటుంది. యువత ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. సమాజానికి మీరు మేలు చేస్తున్నవారు అవుతారు. ఎందుకంటే... వేస్ట్ పదార్థాలతోనే... కంపోస్ట్ తయారవుతుంది. దాన్ని మొక్కలకు ఎరువుగా వేస్తే... మొక్కలు, చెట్లు బాగా పెరుగుతాయి. తద్వారా మీరు వేస్ట్‌ని తగ్గిస్తూ... పర్యావరణాన్ని కాపాడుతున్నట్లు అవుతుంది. ఈ వ్యాపారం పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  Compost:
  ఈ కంపోస్ట్ అనేది... కూరగాయల నుంచి వచ్చే తుక్కు, కొబ్బరి పీచు, చెట్ల నుంచి రాలిన ఆకులు, కొబ్బరి బోండాలు, కుళ్లిపోయిన కూరగాయలు వంటి వాటితోనే తయారవుతుంది. దీన్ని ఎలా తయారుచెయ్యాలో... యూట్యూబ్‌లో వందల కొద్దీ వీడియోలు ఉన్నాయి. వాటిని చూస్తే... మీకు ఐడియా వస్తుంది. ప్రభుత్వం కూడా ఈ వ్యాపారం ఎలా చెయ్యాలో మీకు ట్రైనింగ్ ఇస్తుంది. కాబట్టి అది మీకు సమస్య కాదు.

  Plan your business:
  మీరు ఈ వ్యాపారం ప్రారంభించేముందు... ఎంత పెట్టుబడి పెట్టగలరో ప్లాన్ వేసుకోండి. కంపోస్ట్ కోసం మీరు హోటల్స్ నుంచి వ్యర్థాలను సేకరించవచ్చు. అలాగే కొబ్బరితోటలు, కొబ్బరి బోండాలు అమ్మేవారి నుంచి తుక్కును సేకరించవచ్చు. అడవుల్లో రాలిన ఆకులు, రకరకాల కాయల వంటివి కూడా కంపోస్ట్ అవుతాయి. మీకు ఏవైనా డౌట్లు ఉంటే... రైతుల నుంచి సలహాలు తీసుకోవచ్చు. వారికి అన్నీ తెలుసు.

  Land:
  ఈ వ్యాపారానికి స్థలం బాగా కావాలి. మీకు ఎక్కడైతే కంపోస్ట్ వ్యర్థాలు లభించగలవో... అక్కడికి దగ్గర్లోనే స్థలం ఉండాలి. స్థలాన్ని అద్దెకు తీసుకోవచ్చు. మీరు ఆ స్థలంలో 2 లేదా 3 భారీ గొయ్యిలు తియ్యాల్సి ఉంటుంది. ఈ గోతుల్లో మీరు తెచ్చే వ్యర్థాలను వేసేయాలి. అవి అందులోనే మాగి... డీకంపోజ్ అవుతాయి. అవే కంపోస్టుగా మారతాయి.

  Sources for Organic Waste:
  కంపోస్ట్ కోసం వ్యర్థాలు మీకు చాలా తక్కువ ధరకే లభిస్తాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇళ్లు, స్కూళ్లు, మాల్స్, ఇలా ప్రతి చోట... వాళ్లు పారేసే చెత్తలో... కూరగాయల చెత్తను వేరేగా ఉంచమని చెబితే... మీకోసం ఉంచుతారు. దానికి మీరు ఎంతో కొత్త చెల్లించి సేకరించవచ్చు. తద్వారా వారికీ కొంత డబ్బు వస్తుంది. మీకూ తక్కువ ధరకే ముడి పదార్థం లభించినట్లు అవుతుంది. ఇక తుక్కును రీసైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణానికీ మేలు చేసినట్లు అవుతుంది. రోజూ ఈ తుక్కును సేకరించుకునేలా మీరు ఏర్పాట్లు చేసుకోవాలి.

  కంపోస్టులో ఎరువులతో పనిలేకుండా... సేంద్రియ పదార్థాలతోనే కంపోస్ట్ తయారుచెయ్యవచ్చు. ఆర్గానిక్ కంపోస్టుకు ఈ రోజుల్లో చాలా డిమాండ్ ఉంది. అమెజాన్, ఈబే, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లతో మీరు టై-అప్ అవ్వడం ద్వారా మీ కంపోస్టును ఆల్ ఇండియా మొత్తం అమ్ముకోవచ్చు. మీరు మంచి నాణ్యమైన కంపోస్టును తయారుచేస్తే... మీకు ఆర్డర్లు మళ్లీ మళ్లీ వస్తాయి.

  ఈ-కామర్స్ సైట్లలో కంపోస్ట్ అమ్మకం (image credit - Amazon)


  రిజిస్ట్రేషన్ ఇలా:
  ముందుగా మీ సేవ కేంద్రానికి వెళ్లి... రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కంపెనీ పేరు చెప్పాలి. ఆ పేరు పై మీకు ఓ ప్యాన్ కార్డ్ ఇస్తారు. నలుగురు కంటే ఎక్కువ సిబ్బందితో వ్యాపారం చేయాలనుకుంటే... లేబర్ సర్టిఫికెట్ పొందాలి. ఈ మీ సేవ కేంద్రం ద్వారా మీ వ్యాపారానికి సంబంధించి పూర్తి వివరాలు పొందవచ్చు. అలాగే... ఎంత ఖర్చవుతుంది, ఎలా ప్రారంభించాలి, యంత్రాలు ఎలా పొందాలి, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలేంటి... వంటి వివరాలు అన్నీ ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ కంపోస్ట్ వ్యాపారాలను ప్రభుత్వాలు సబ్సిడీలు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నాయి.

  ముద్ర రుణాలు:
  మీకు కేంద్రప్రభుత్వం ముద్ర స్కీ్మ్ ద్వారా... రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకూ లోన్ ఇస్తోంది. దాన్ని పొంది వ్యాపారం ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో చేయగలిగే మంచి వ్యాపారం ఇది అవుతుంది.

  లాభాలు:
  ప్రస్తుతం రిటైల్ షాపుల్లో కంపోస్ట్ కేజీ రూ.40 దాకా ఉంటోంది. అదే ఆన్‌లైన్‌ ఈ కామర్స్ సైట్లలో కేజీ రూ.60 దాకా ఉంటోంది. అందువల్ల మీకు అయ్యే ఖర్చు, మీరు ఇచ్చే నాణ్యత అన్నీ లెక్కలోకి తీసుకొని మీరు ధరను నిర్ణయించుకోవచ్చు. ఒక్కసారి మీ కంపోస్టుకు మంచి పేరు వస్తే... ఆటోమేటిక్‌గా మీరు ధరను పెంచినా... అదే కావాలని కస్టమర్లు కోరతారు. ఇలా మీరు రోజూ కనీసం 50 కేజీల కంపోస్ట్ అమ్మినా... రూ.2000 ఆదాయం వస్తుంది. ఆ లెక్కన నెలకు రూ.60వేల ఆదాయం వస్తుంది. అందులో మీ ఖర్చులు రూ.20వేలు అనుకొని తీసేస్తే... మీకు రూ.40 వేలు లాభం ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కొన్ని కంపెనీలు నెల నెలా లక్షల్లో లాభాలు పొందుతున్నాయి. ఖర్చులు పెద్దగా లేకపోవడమే అందుకు కారణం.

  ఇది కూడా చదవండి: Business Ideas: చిన్న వ్యాపారం... ఎక్కువ లాభాలు... సమాజంలో మంచి పేరు

  మీ వ్యాపారం అభివృద్ధి చెందాక... కొబ్బరి పీచుతో చేసే... కోకోపీట్ (cocopeat) కూడా ప్రారంభించవచ్చు. దానికి కూడా విపరీతమైన డిమాండ్ ఉంది.
  Published by:Krishna Kumar N
  First published: