BUSINESS IDEAS HOW TO MAKE MONEY FROM GRILLED SANDWICH BUSINESS EARN 1 LAKH PER MONTH MK
Business Ideas: నెలకు రూ.1 లక్ష తగ్గకుండా సంపాదించే మార్గం...తేలిగ్గా తీసిపారేయకండి..
(ప్రతీకాత్మక చిత్రం)
Business Ideas: కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం యువత ఉపాధి కోసం ఎన్నో కొత్త పథకాలను, రుణాలు పొందే మార్గాలు అందుబాటులో పెడుతోంది. వాటిని సక్రమంగా వినియోగిస్తే లాభాల పంట మీ సొంతం...
Business Ideas: ఫుడ్ బిజినెస్ లో లాభం అనేది చాలా వస్తుంది. అనేది మనందరికీ తెలిసిన విషయమే అయితే ఇప్పటికే పలు మోడల్స్ బిజినెస్ లతో ఎంతో మంది ఆదాయం పొందుతున్నారు. ఇలాంటి సమయంలో మనం వినూత్నంగా ఆలోచిస్తేనే ఆదాయం పొందగలం మరి అలాంటి కొత్త బిజినెస్ గురించి తెలుసుకుందాం. పిల్లలు, పెద్దలు, యువత అనే తేడా లేకుండా ఈ మధ్య కాలంలో బేకరీ ఐటెమ్స్ చాలా ఇష్టంగా తింటున్నారు. ముఖ్యంగా సాయంకాలం పిల్లలను బయటకు తీసుకెళ్లే కల్చర్ బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రిల్డ్ సాండ్ విచ్ బిజినెస్ అయితే చక్కటి ఆదాయం సంపాదించుకునే అవకాశం ఉంది. గ్రిల్డ్ సాండ్విచ్ బిజినెస్ ద్వారా మనకు నెల నెల చక్కటి ఆదాయం వస్తుంది. ముందుగా గ్రిల్డ్ సాండ్విచ్ బిజినెస్ ఏర్పాటుకు కావాల్సింది. ఒక కమర్షియల్ స్పేస్లో షాపు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే స్టెయిన్ లెస్ట్ స్టీల్ తో తయారు చేసిన టీ కౌంటర్ స్టాల్ కొనుగోలు చేయాలి. దీని ఖరీదు రూ.10 వేల నుంచి ప్రారంభమై రూ. 70 వేల దాకా ఉంటుంది. అలాగే స్టెయిన్ లెస్ స్టీల్ డబుల్ సాండ్ విచ్ గ్రిల్లర్ కొనుగోలు చేయాలి. దీని ఖరీదు రూ. 10 వేల నుంచి రూ.25 వేల దాకా ఉంటుంది. మీ పెట్టుబడిని బట్టి వీటిని ఎంపిక చేసుకోవాలి. అలాగే ఇతర సామాగ్రి, టేబుళ్లు, కుర్చీలకు రూ.5 వేలు ఖర్చు అవుతాయి.
ఇక గ్రిల్డ్ సాండ్విచ్ తయారీ ద్వారా లాభం ఎలా పొందవచ్చో చూద్దాం. సాండ్విచ్ తయారీలో మీకు కావాల్సింది. ఫ్రెష్ సాండ్విచ్ బ్రెడ్ ప్యాకెట్(800 గ్రా), ఒకే ప్యాకెట్ కు అయ్యే ఖర్చు రూ.50 దాకా ఉంటుంది. ఇందులో 20 నుంచి 24 స్లైసులు ఉంటాయి. వేస్టేజ్ తీసి వేసినా ఒక్కో ప్యాకెట్ తో 10 సాండ్విచ్ లు తయారు చేయవచ్చు. ఒక్కో వెజ్ గ్రిల్ సాండ్ విచ్ ఖరీదు రూ.30 దాకా వసూలు చేయవచ్చు. అంటే ఒక బ్రెడ్ ప్యాకెట్ తో రూ.300 దాకా సంపాదించవచ్చు.
ఒక సాండ్విచ్ తయారీకి ఒక టమాట, ఒక కీరా, ఒక చీజ్ స్లైస్, మయనేజ్, టొమాటో సాస్ కావాల్సి ఉంటుంది. చీజ్ సాండ్ విచ్ అయితే ధర పెరుగుతుంది. అలాగే నాన్ వెజ్ సాండ్విచ్ తయారీకి ఎగ్, చికెన్ వాడవచ్చు. ఇక ధర ప్రకారం చూస్తే వెజ్ సాండ్ విచ్ ధర రూ.30, ఎగ్ సాండ్ విచ్ ధర రూ.40, చికెన్ సాండ్విచ్ ధర రూ.50 గా నిర్ణయిస్తే రీజనబుల్ గా ఉంటుంది. అయితే మీరు ఎంపిక చేసుకున్న కమర్షియల్ ఏరియాను బట్టి సాండ్విచ్ ధరలు 10 నుంచి 20 శాతం పెంచుకునే వీలుంది.
లాభం పొందండిలా...
రోజుకు 50 వెజ్ సాండ్ విచ్, 50 ఎగ్, 50 చికెన్ సాండ్ విచ్లు అమ్మకం జరిపినా, మనకు రోజుకు రూ.6000 దాకా ఆదాయం పొందవచ్చు. సరుకులు, కరెంటు చార్జీలు పోయినప్పటికీ మనకు సుమారు రూ.4500 దాకా లాభం వస్తుంది. ప్రతీనెల 30 రోజుల లెక్కన రూ.135000 సంపాదించవచ్చు. అద్దె, వర్కర్స్ చార్జీలు ఇతరత్రా ఖర్చులు రూ.35000 దాకా పోయినప్పటికీ మనకు నెలకు రూ.1 లక్ష రూపాయల దాకా ఆదాయం వస్తుంది.
బిజినెస్ టిప్...
గ్రిల్డ్ సాండ్విచ్ బిజినెస్ ద్వారా ఆర్డర్లు పొందాలంటే హోం డెలివరీ ఆప్షన్ పెట్టుకుంటే మరింత లాభదాయకంగా ఉంటుంది. అలాగే స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ యాప్స్ తో ఒప్పందాలు చేసుకుంటే మీకు ఆర్డర్లు నిరంతరం వస్తుంటాయి.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.