BUSINESS IDEAS HOME BUSINESS HUGE INCOME EVERY MONTH EVK
Business Ideas: ఇంట్లో కూర్చునే వ్యాపారం.. ప్రతినెలా భారీగా ఆదాయం
(ప్రతీకాత్మక చిత్రం)
New Business Idea | ఈ రోజుల్లో చాలా మంది యువత ఉద్యోగాల కన్నా సొంత వ్యాపారానికే మొగ్గు చూప్తున్నారు. జాబ్ కోసం ఎదురుచూడకుండా.. చిన్న వ్యాపారమైనా చేసుకుంటే బావుంటుందని ఆలోచిస్తున్నారు. మీరు కూడా బిజినెస్ చేసేందుకు అడుగులు వేస్తున్నారా? మీలాంటి వారి కోసమే ఈ ఐడియా.
ఈ రోజుల్లో చాలా మంది యువత ఉద్యోగాల కన్నా సొంత వ్యాపారానికే మొగ్గు చూప్తున్నారు. జాబ్ కోసం ఎదురుచూడకుండా.. చిన్న వ్యాపారమైనా చేసుకుంటే బావుంటుందని ఆలోచిస్తున్నారు. మీరు కూడా బిజినెస్ చేసేందుకు అడుగులు వేస్తున్నారా? మీలాంటి వారి కోసమే ఈ ఐడియా. ఆలు చిప్స్ వ్యాపారం (Potato Chips Business) బాగా లాభసాటిగా ఉంటుంది. తక్కువ పెట్టుబడితోనే ప్రారంభించవచ్చు. ఎంచక్కా ఇంటి దగ్గర ఉంటూనే చిప్స్ వ్యాపారం (Chips Business) చేయవచ్చు. చిప్స్‌ను చిరుతిండిగా ఎంతో మంది ఇష్టంగా లాగిస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు చాలా ఇష్టమైన స్నాక్ ఇది. అందుకే మార్కెట్లో ఆలు చిప్స్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఏడాదంతా కొనుగోళ్లు జరుగుతుంటాయి.
ఆలూ చిప్స్ తయారీకి భారీగా పెట్టుబడి అవసరం లేదు. కేవలం 850 రూపాయల యంత్రాన్ని కొనుగోలు చేసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆ తర్వాత ఇందులో ఎక్కువ పెట్టుబడి పెట్టి.. మరింతగా విస్తరించవచ్చు. అప్పుడు ఆదాయం కూడా పెరుగుతుంది. ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించాలన్నా.. యంత్రాలు, పరిరాలకు కనీసం రూ. 10,000-15,000 ఖర్చు అవుతుందని అంచనా. కానీ మనం ఇక్కడ చెప్పుకుంటున్న యంత్రం ధర రూ.850 మాత్రమే. అంతే కాకుండా ముడిసరుకు కోసం మరికొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. తొలిదశలో రూ.100-200లకే ముడిసరుకు లభిస్తుంది. మీరు ఈ యంత్రాన్ని ఆన్లైన్లో సులభంగా పొందవచ్చు. ఏదైనా టేబుల్‌పై ఉంచడం ద్వారా చిప్స్‌ని ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ స్థలాన్ని తీసుకోదు. విద్యుత్ కూడా అవసరం లేదు. చేతితో సులభంగా ఆపరేట్ చేయవచ్చు. స్త్రీలు, చిన్న పిల్లలు కూడా దీనితో చిప్స్ తయారు చేయవచ్చు.
ఈ రోజుల్లో చిప్స్ తినే ట్రెండ్ బాగా పెరిగింది. అందుకే హాట్ చిప్స్ అమ్మే దుకాణాలను గిరాకీ ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ఒక బండి లేదా చిన్న గదిలో ఈ వ్యాపారం ప్రారంభించవచ్చు. దుకాణం ఓపెన్ చేసి.. చిప్స్ తయారు చేయవచ్చు. వాటిని చిన్నచిన్న ప్యాకెట్లలో నింపి.. అక్కడే విక్రయించవచ్చు. చుట్టుపక్కల ఉన్న కిరాణా దుకాణాలకు కూడా సరఫరా చేయవచ్చు. అలా క్రమంగా మీ వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ వెళ్లాలి. అప్పుడే ఆదాయం పెరుగుతుంది. ఎంత నెట్వర్క్ పెరిగే అంత రాబడి వస్తుంది.
బంగాళాదుంప చిప్స్ ద్వారా అధిక ఆదాయం వస్తుంది. ముడిసరుకుపై ఖర్చు చేసిన డబ్బుకు 7-8 రెట్లు సంపాదించవచ్చు. 10 కిలోల బంగాళాదుంపలతో చేసిన చిప్స్‌ను ఒక్క రోజులో అమ్మితే.. 1000 రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. రుచితో పాటు శుభ్రత పాటిస్తే.. కస్టమర్లు రిపీటెడ్‌గా వస్తుంటారు. అలా కస్టమర్లను ఆకట్టుకున్న తర్వాత.. మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరించవచ్చు. మీ దుకాణం వద్ద విక్రయించడంతో పాటు ఇతర కిరాణా షాపులకు కూడా అమ్ముకోవచ్చు. అప్పుడు మరింత ఆదాయం వస్తుంది. రోజుకు రూ.2వేల నుంచి 3 వేల వరకు కూడా సంపాదించుకోవచ్చు.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.