BUSINESS IDEAS GET 4 LAKHS INCOME BY INVESTING 50 THOUSAND ON LEMON GRASS CROP SK
Business ideas: రూ.50వేల పెట్టుబడితో రూ.4 లక్షల ఆదాయం.. ఈ పంటతో రైతులకు లాభాలే లాభాలు
ప్రతీకాత్మక చిత్రం
Business Ideas: ఈ పంటకు ఎరువులు కూడా అవసరం లేదు. అడవి జంతవులు నాశనం చేస్తాయన్న భయం కూడా లేదు. అంతేకాదు ఒక్కసారి నాటితే.. నాలుగైదు సంవత్సరాల వరకు ఆదాయం వస్తూనే ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులు సంప్రదాయ పంటలనే పండిస్తున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, కూరగాయలు.. చాల చోట్ల ఇలాంటి పంటలే కనిపిస్తాయి. ఎక్కువ మంది అవే పంటలను పండించడం వల్ల మార్కెట్లో ఒక్కోసారి గిట్టుబాటు ధర కూడా లభించదు. అందుకే ఇలాంటి పంటలకు బదులు.. వాణిజ్య పంటలను పండిస్తే మంచి లాభాలు ఉంటాయి. కొందరు తెలివిగా ఇలాంటి పంటలే పండిస్తారు. వాటిలో ఒకటి లెమన్ గ్రాస్ (Lemon Grass). తక్కువ పెట్టుబడితో.. తక్కువ రిస్క్‌తో.. ఈ పంటను పండించవచ్చు. ఒక హెక్టారు భూమిలో రూ.50 వేల పెట్టుబడి పెడితే.. ప్రతి ఏటా గరిష్టంగా రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఈ పంట గురించి ప్రధాని నరేంద్ర మోదీ కూడా 'మన్ కీ బాత్ (Mann ki baat)'లో ప్రస్తావించడం గమనార్హం. ఈ వ్యవసాయంతో రైతులు సాధికారత సాధించడమే కాకుండా దేశ ప్రగతికి దోహదపడుతున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
నిమ్మగడ్డి నుంచి తీసిన నూనెకు (Lemon grass oil) మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఈ నూనెను సౌందర్య సాధనాలు, సబ్బులు, నూనెలతో పాటు పలు రకాల ఔషధాల్లో వినియోగిస్తారు. అందుకే దీనికి మార్కెట్లో డిమాండ్ ఉంది. మంచి ధర కూడా లభిస్తోంది. అన్ని రకాల భూముల్లోనూ నిమ్మగడ్డి పండుతుంది. నీరు పెద్దగా అవసరం ఉండదు కాబట్టి.. కరువు ప్రభావిత ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు. నిమ్మగడ్డి పంటకు ఎరువులు కూడా అవసరం లేదు. అడవి జంతవులు నాశనం చేస్తాయన్న భయం కూడా లేదు. అంతేకాదు ఒక్కసారి నాటితే.. నాలుగైదు సంవత్సరాల వరకు ఆదాయం వస్తూనే ఉంటుంది. మెయింటెనెన్స్ కూడా పెద్దగా అసవరం పడదు. అందుకే నిమ్మగడ్డి సాగును లాభదాయకమైన పంటగా చాలా మంది రైతులు చెబుతుంటారు.
నిమ్మ గడ్డి విత్తనాలు నాటడానికి మంచి సమయం ఫిబ్రవరి నుంచి జూలై. ఇందుకోసం మార్చి ఏప్రిల్ మధ్య బెడ్స్ సిద్ధం చేసుకోవాలి. 60 సెంమీ., 60 సెం.మీ. గ్యాప్‌తో విత్తనాలను నాటుకోవాలి. ఒక ఎకరాకు రెండు కిలోల వరకు విత్తనాలు అవసరమవుతాయి. ఒక్కసారి నాటితే చాలు.. దాదాపు నాలుగేళ్ల వరకు పంట ఉంటుంది. ఏడాదికి మూడు నాలుగు సార్లు కోసుకోవచ్చు. గడ్డిని నాటిన తర్వాత మూడు నాలుగు నెలల్లోనే కట్ చేసుకోవచ్చు. నిమ్మ గడ్డి సువాసన వస్తుంది. దీని నుంచి నూనె తీస్తారు. లేదంటే మీ మార్కెట్‌కు అనుగుణంగా కట్టలు కట్టి కూడా విక్రయించవచ్చు. నిమ్మ గడ్డిని తెంచి నలిపి .. వాసన చూడాలి. వాటిన నుంచి మంచి సువాసన వస్తుందంటే.. మీ పంట కోతకు వచ్చినట్లే..!
ఒక హెక్టారు నిమ్మగడ్డి నుంచి మొదటి కోతలోనే 50-60 లీటర్ల లెమన్ గ్రాస్ ఆయిల్ పొందవచ్చు. ఒక లీటర్ నూనె కనీసం వెయ్యి నుంచి 1500 రూపాయల వరకు ఉంటుంది. రెండో కోత నుంచి నూనె ఉత్పత్తి పెరుగుతుంది. ఇలా ఎకరం భూమి నుంచి ఏటా నాలుగు కోతల చొప్పు.. ప్రతి సంవత్సరం 250 నుంచి 300 లీటర్ల వరకు నూనెను ఉత్పత్తి చేయవచ్చు. మార్కెట్లో రేటును బట్టి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఐతే నిమ్మగడ్డి పంటను వేసే ముందు దానిని మార్కెటింగ్ చేసుకోగలమా లేదా ఆలోచించుకోవాలి. ఆ తర్వాతే పంటను పండించడం ఉత్తమం.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.