హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ides: రైతును లక్షాధికారి చేసే చెట్టు.. హెక్టారు భూమితో రూ.5లక్షల ఆదాయం

Business Ides: రైతును లక్షాధికారి చేసే చెట్టు.. హెక్టారు భూమితో రూ.5లక్షల ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Idea: ఒక హెక్టారు భూమిలో 250 చెట్ల వరకు నాటవచ్చు. 1 హెక్టారులో భూమిలో పాప్లర్ చెట్లను పెంచడం వల్ల రూ.5 లక్షల వరకు ఈజీగా సంపాదించవచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మన దేశం వ్యవసాయ (Agriculture) ఆధారిత దేశం. ఇక్కడి జనాభాలో దాదాపు 60శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతుల కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు బతకలేని వాడే వ్యవసాయం చేసే వాడని అనేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కంప్యూటర్‌ల ముందు కూర్చొని సాఫ్ట్‌వేర్ జాబ్ (Software Job) చేసే వారు కూడా... పొలం బాట పడుతున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివిన కారు కూడా.. వ్యవసాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. విభిన్న పంటలు పండిస్తూ.. లక్షల్లో, కోట్లల్లో సంపాదిస్తున్నారు. రైతులకు భారీగా ఆదాయం తెచ్చే పంటలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ పంట గురించి ఇవాళ తెలుసుకుందాం. పాప్లర్ చెట్ల (Poplar Trees) పెంపకంతో మీరు భారీగా ఆదాయం పొందవచ్చు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ చెట్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

  Business Idea: ఇంట్లో నుంచే బిజినెస్ చేయాలనుందా? అయితే.. నెలకు రూ.20 వేలు వచ్చే ఈ వ్యాపారంపై ఓ లుక్కేయండి

  పాప్లర్ చెట్ల (Poplar Tree Cultivation) ను భారతదేశంతో పాటు ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో సాగు చేస్తారు. ఆసియా, ఉత్తర అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాలలో పాప్లర్ చెట్లు పెరుగుతాయి. ఈ చెట్టును కాగితం, లైట్ ప్లైవుడ్, చాప్ స్టిక్స్, చెక్క పెట్టెలు, అగ్గిపుల్లలు మొదలైన వాటి తయారీకి ఉపయోగిస్తారు. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మంచి రేటు కూడా లభిస్తోంది.

  Gold Price Down: బంగారం రేటు ఢమాల్... పండుగ సీజన్ ముందు మంచి ఛాన్స్

  పాప్లర్ చెట్లను కాటన్ వుడ్ (Cottonwood)అని కూడా పిలుస్తారు. వీటి సాగుకు 5°C నుంచి 45°C ఉష్ణోగ్రత అవసరం. సూర్యకాంతి ఎక్కువగా ఉన్న చోట బాగా పెరుగుతుంది. నేల pH విలువ 6 నుంచి 8.5 pH మధ్య ఉండాలి. ఒక చెట్టుకు మరొక చెట్టుకు మధ్య దూరం 12 నుండి 15 అడుగుల వరకు ఉండాలి. ఈ చెట్లు భూమి నుంచి 80 అడుగుల ఎత్తులో పెరుగుతాయి. అంత భారీగా ఉంటాయి. నాటిన తర్వాత ఐదేళ్లకు కోతకు వస్తాయి. కేవలం చెట్ల మీదనే ఆధారపడకుండా.. వాటి మధ్య అంతర పంటలు కూడా వేసుకోవచ్చు. చెరకు, పసుపు, బంగాళదుంప, కొత్తిమీర, టమోటా మొదలైన వాటిని పండించవచ్చు. ఈ పంటలతో కూడా మీకు ఆదాయం వస్తుంది. హిమపాతం ఎక్కువగా ఉండే హిమాచల్, జమ్మూకాశ్మీర్ వంటి ప్రాంతాల్లో పాప్లర్ చెట్లను సాగు చేయడం సాధ్యం కాదు.

  ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో చాలా మంది రైతుల ఈ చెట్లను పెంచుతున్నారు. చెట్ల మధ్య ఇతర పంటలను కూడా పండిస్తున్నారు. పాప్లర్ చెట్ల ద్వారా చెరకు కంటే ఎక్కువ ఆదాయం వస్తోందని చెబుతున్నారు. పాప్లర్ చెట్ల మొక్కలను విక్రయించే సంస్థలు చాలానే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో సంప్రదించి.. మొక్కలను కొనుగోలు చేయవచ్చు. పాప్లర్ చెట్ల కలపకు మార్కెట్‌లో మంచి రేటు లభిస్తోది. ఈ చెట్ల కలప ధర క్వింటాల్‌కు 700-800 రూపాయలకు విక్రయిస్తున్నారు. ఒక్క చెట్టు దుంగను 2000 రూపాయల వరకు అమ్ముకోవచ్చు. ఒక హెక్టారు భూమిలో 250 చెట్ల వరకు నాటవచ్చు. 1 హెక్టారులో భూమిలో పాప్లర్ చెట్లను పెంచడం వల్ల రూ.5 లక్షల వరకు ఈజీగా సంపాదించవచ్చు.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agriculture, Business, Business Ideas, Farmers

  ఉత్తమ కథలు