హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: రైతులను లక్షాధికారులను చేసే 3 రకాల ఆకులు.. వీటితో ఊహించనంత ఆదాయం

Business Ideas: రైతులను లక్షాధికారులను చేసే 3 రకాల ఆకులు.. వీటితో ఊహించనంత ఆదాయం

Business Ideas: మనదేశంలో అనేక రకాల ఆకుల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ ఆకులు వేర్వేరు చోట్ల అవసరమవుతాయి. కొన్ని రకాల ఆకులు పూజలు, శుభకార్యాల్లో అవసరమైతే.. మరికొన్నింటిని ఆహారంలో వినియోగిస్తారు.

Business Ideas: మనదేశంలో అనేక రకాల ఆకుల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ ఆకులు వేర్వేరు చోట్ల అవసరమవుతాయి. కొన్ని రకాల ఆకులు పూజలు, శుభకార్యాల్లో అవసరమైతే.. మరికొన్నింటిని ఆహారంలో వినియోగిస్తారు.

Business Ideas: మనదేశంలో అనేక రకాల ఆకుల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ ఆకులు వేర్వేరు చోట్ల అవసరమవుతాయి. కొన్ని రకాల ఆకులు పూజలు, శుభకార్యాల్లో అవసరమైతే.. మరికొన్నింటిని ఆహారంలో వినియోగిస్తారు.

  ఈ కాలంలో ఎక్కువ మంది ఉద్యోగం కంటే వ్యాపారం (Business) గురించే ఆలోచిస్తుంటారు. ఏదో కంపెనీలో ఉద్యోగం చేసేకన్నా.. సొంతంగా బిజినెస్ చేయాలని కలలు కంటుంటారు. మంచి లాభాలు తీసుకొచ్చే వ్యాపారాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇవాళ మనం ఆకుల (Leaves Business) గురించి తెలుసుకుందాం. మనదేశంలో అనేక రకాల ఆకుల వ్యాపారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ ఆకులు వేర్వేరు చోట్ల అవసరమవుతాయి. కొన్ని రకాల ఆకులు పూజలు, శుభకార్యాల్లో అవసరమైతే.. మరికొన్నింటిని ఆహారంలో వినియోగిస్తారు. అందులో ప్రధానమైనవి అరటి, తమలపాకు. ఈ రెండు కాకుండా.. మరో ఆకు కూడా ఉంది. అదే సాఖూ ఆకు. వీటికి కూడా మార్కెట్లో కూడా పెద్ద డిమాండ్ (Business Ideas) ఉంటుంది. దక్షిణ భారతదేశంలో అరటి ఆకులకు డిమాండ్ చాలా ఎక్కువ. ఇది కాకుండా ఉత్తర, తూర్పు భారతదేశంలో తమలపాకులకు మంచి గిరాకీ ఉంది. మరోవైపు కొండ ప్రాంతాలలో అరటి ఆకుల మాదిరిగానే సాఖూ ఆకులను ఉపయోగిస్తారు. ఈ మూడు రకాల ఆకులను పండించడం ద్వారా రైతులకు బాగా ఆదాయం వస్తుంది.

  అరటి ఆకులు (Banana Leaves):

  సాధారణంగా పండ్ల కోసం అరటి చెట్లను నాటుతారు. ఆ పండ్లను అమ్మితే.. రైతులకు మంచి ఆదాయం వస్తుంది. కానీ అరటి పళ్లతో పాటు అరటి ఆకు కూడా గొప్ప ఆదాయ వనరు. అరటి ఆకులను సాధారణంగా దక్షిణ భారతదేశంలోని ఇళ్లల్లో ప్రత్యేక సందర్భాలలో ఆహారం వడ్డించడానికి ఉపయోగిస్తారు. కొన్ని హోటల్స్‌లో కూడా వీటిని వినియోగిస్తారు. అందువల్ల వీటికి డిమాండ్ బాగానే ఉంటుంది. మీకు అరటి తోను పెడితే.. అరటి పండ్లతో పాటు ఆకుల నుంచి కూడా ఆదాయం వస్తుంది. తద్వారా రెట్టింపు లాభాలను పొందుతారు.

  Farmers : పెద్ద రైతులకు షాక్.. చిన్న రైతుల నుంచే ధాన్యం కొనుగోలు : CACP సంచలన ప్రతిపాదన

  తమలపాకులు (Betel leaves):

  ఇది వాణిజ్య పంట. తమలపాకులను మనదేశంలో దాదాపు ప్రతిచోటా ఉపయోగిస్తారు. ఉత్తర, తూర్పు భారతదేశంలో దీనికి డిమాండ్ గరిష్ట స్థాయిలో ఉంది. దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కువగా వినియోగిస్తారు. పూజలు, శుభాకార్యాల్లో తమలపాకుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. అన్నింటికీ మించి పాన్‌ షాప్‌లో తమలపాకులు ఉండాల్సిందే. పలు రకాల పాన్‌లలో వీటిని ఉపయోగిస్తారు. తమలపాటకు సాగు కాస్త కష్టమే. కానీ ఒకసారి తోట పెరిగితే మాత్రం..మీ రాత మారినట్లే. భారీగా లాభాలు వస్తాయి.

  Petrol Diesel : పెరిగిన ఇంధన డిమాండ్.. ముడి చమురు ధరల షాక్.. పెట్రో బాదుడు తప్పదు!

  సాఖూ ఆకులు (Sakhu Leaves):

  ఈ చెట్టు పర్వతాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి ఉత్తర భారతదేశ రాష్ట్రాల్లో ఎక్కువగా పండిస్తారు. దీని ఆకులు చాలా పెద్దగా ఉంటాయి. వీటిని కూడా అరటి ఆకుల్లానే వివాహాల్లో ఆహారం వడ్డించేందుకు, ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తారు. సాకు చెట్ల ఆకులే కాదు, కలప కూడా చాలా ఖరీదైనది. ఒకవేళ మీరు సాఖూ చెట్లను సాగు చేస్తే.. ఇటు కలప నుంచి, అటు ఆకుల నుంచి.. రెండు మార్గాల్లోనూ సంపాదించవచ్చు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agriculture, Business, Business Ideas, Farmer

  ఉత్తమ కథలు