గ్రామాల్లో పొలాలు ఉన్న రైతుల్లో చాలా మంది సంప్రదాయ పంటలను పండిస్తారు. వరి, మొక్కజొన్న, పత్తిలాంటి పంటలనే ఎక్కువగా సాగు చేస్తుటారు. కానీ వాణిజ్య పంటలు (Commercial crops) పండిస్తే.. అద్భుతమైన లాభాలు వస్తాయి. వాణిజ్య పంటల్లోనే చాల ఆప్షన్స్ ఉన్నాయి. అందులో మహోగని చెట్టు ఒకటి. ఈ చెట్లను పండిస్తే.. మీరు కోటీశ్వరులు కావచ్చు. దీర్ఘకాలిగా పెట్టుబడిగా (Business Ideas) చూస్తే.. భారీ మొత్తంలో ఆదాయాన్ని ఆర్జించవచ్చు.
మహోగని చెట్ల (Mahogany trees farming) ను కొండ ప్రాంతాలు, ఎప్పుడూ నీరు ఉండే ప్రాంతాల్లో పెంచకూడదు. ఎందుకంటే దీని వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లలేవు. పైపైనే ఉంటాయి. ఎప్పుడైనా బలమైన గాలులు వీస్తే.. చెట్లు పడిపోతాయి. ఈ ప్రాంతాలు కాకుండా.. ఇంకెక్కడైనా వీటిని సాగు చేయవచ్చు. మహోగనీ మొక్కలను ఎక్కువ నీరు అవసరం ఉండదు. కరువు ప్రాంతాల్లో కూడా బాగా పెరుగుతుంది. ఈ చెట్లు 40 నుంచి 200 అడుగుల వరకు పెరుగుతాయి. మనదేశంలో మాత్రం 60 అడుగుల కంటే ఎక్కువ ఎత్తుకు పెరగవు. ఈ మొక్కలను పెంచే నేల pH స్థాయి సాధారణంగా ఉండాలి. మరీ ఎక్కువగా ఉండకూడదు. మరీ తక్కువగా ఉండకూడదు.
Business Idea For Women: మహిళల కోసం బెస్ట్ బిజినెస్ ఐడియా .. కిచెన్ నుంచే లక్షల ఆదాయం.. ఎలా అంటే?
మహోగని చెట్టు (Mahogany tree Price)ఎంతో విలువైనది. ఎందుకంటే దీని చెక్క చాలా బలంగా ఉంటుంది. ఓడలు, విలువైన ఫర్నిచర్, ప్లైవుడ్, అలంకరణలు, శిల్పాల తయారీలో వినియోగిస్తారు. దీని కలప 50 °C ఉష్ణోగ్రతను కూడా తట్టుకోగలదు. వర్షం పడినా.. నీటిలో నానినా.. చెక్కు చెదరదు. అందుకే పలు పాశ్చాత్య దేశాల్లో ఈ చెట్టు కలపతోనే ఇళ్లు కట్టుకుంటారు. ఈ చెట్టు ఆకులను క్యాన్సర్, రక్తపోటు, ఉబ్బసం వంటి అనేక వ్యాధుల చికిత్సలో వాడే మందుల తయారీలో వినియోగిస్తారు. విత్తనాలు, పువ్వులను శారీరక శక్తిని పెంచే ఔషధాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. అంతేకాదు మహోగని ఆకులు, గింజల నూనెను దోమల నివారణకు వాడుతారు. ఇన్ని ఉపయోగాలున్నాయి గనుకే.. ఈ చెట్టుకు ఎంతో విలువ ఉంది. విత్తనాలు కూడా చాలా ఖరీదైనవి. 1 కిలోల మహోగని విత్తనాలు మార్కెట్లో సుమారు రూ. 1000కు లభిస్తున్నాయి.
ఒక మహోగని చెట్టు పూర్తిగా ఎదిగి.. కోతకు వచ్చేందుకు దాదాపు 12 సంవత్సరాలు పట్టవచ్చు. మరీ అన్నేళ్లు పడుతుందా? అని చాలా మంది నిరుత్సాహానికి గురవచ్చు. ఐతే తక్కువ సమయంలోనే ఆదాయం కావాలనుకునేవారికి ఇది నచ్చకపోవచ్చు. కానీ దీర్ఘకాలిక పెట్టుబడులను పెట్టాలనుకునే వారికి మాత్రం చక్కటి అవకాశం. పొలంలో మొక్కలను వేసి వదిలేస్తే చాలు. అవే పెరుగుతాయి. అప్పుడప్పుడూ వెళ్లి చూస్తుండాలి. అంతే.. దీని కోసం పెద్దగా సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఈ పంటను పెంచుతూనే.. మీ పనులను మీరు చేసుకోవచ్చు.
Savings Account: ఈ బ్యాంక్లో అకౌంట్ ఉన్న వారికి శుభవార్త.. ఈరోజు నుంచి..
బాగా ఏపుగా పెరిగిన మహోగని చెట్టును 20-30 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. మీ వద్ద 500 చెట్లు ఉండి.. ఒక్కో దానిని కనీసం రూ.20వేలకు విక్రయించారని అనుకున్నా...కోటి రూపాయల వరకు ఈజీగా ఆదాయం వస్తుంది. ఒక ఎకరంలో మహోగని చెట్లను నాటేందుకు దాదాపు లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చువుతుంది. పెద్ద మొత్తంలో సాగు చేస్తే.. లాభాలు భారీగా ఉంటాయి.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Business, Business Ideas, Farmers