భారత్ వ్యవసాయ (Agriculture) ఆధారిత దేశం. మన దేశంలో 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటీవలి కాలంలో వ్యవసాయానికి ప్రాధాన్యత పెరిగింది. ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారు కూడా జాబ్‌ని వదిలేసి.. వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఉన్న ఊళ్లోనే సాగుపని చేస్తూ.. భారీగా ఆదాయ పొందుతున్నారు. మరి ఏ పంట వేస్తే అధిక లాభాలు వస్తాయి? సంప్రదాయ పంటలు కాకుండా.. వాణిజ్య పంటలు పడిస్తే.. ఎక్కువ లాభం వస్తుంది. అలాంటి వాటిలో వెదురు సాగు ఒకటి. వెదురు (Bamboo Crop)కు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. మార్కెట్లో మంచి ధర కూడా వస్తుండడంతో.. రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు.
మీరు ఏదైనా నర్సరీలో వెదురు మొక్కలను కొనుగోలు చేసి మీ పొలంలో నాటవచ్చు. ఒక హెక్టారు భూమిలో 625 వరకు వెదురు మొక్కలను పెంచవచ్చు. వెదురు సాగుకు ఇసుక నేలలు పనికి రావు. 2 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పుతో గుంతలు తవ్వి.. వెదురును నాటుకోవాలి. ఆ తర్వాత పశువుల పేడను ఎరువువగా వేయాల్సి ఉంటుంది. .నాటిన వెంటనే మొక్కకు నీరు పోయాలి. ఒక నెలపాటు ప్రతిరోజూ నీరందించాలి. 6 నెలల తర్వాత ఒక వారానికి ఒకసారి ఇస్తే సరిపోతుంది. మూడు నెలల్లో మొక్క పెరగడం ప్రారంభమవుతుంది. కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. అప్పుడే వెదురు కాండం చాలా పొడవు పెరుగుతుంది. నాటిన 3-4 సంవత్సరాలలో ఇవి కోతకు వస్తాయి.
Business Idea: మార్కెట్‌లో ఫుల్ డిమాండ్.. రైతులను కోటీశ్వరులు చేసే చెట్టు..
వెదురు పెంపకానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా 50శాతం రాయితీని అందిస్తున్నాయి. వెదురు పండను గ్రీన్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. ఈ పంటకు మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. వీటిని కాగితం తయారీత పాటు అనేక అలంకరణ వస్తువులకు కూడా ఉపయోగిస్తారు. ఇతర పంటలతో పోలిస్తే వెదురు పెంపకం చాలా సురక్షితమైనదని నిపుణులు చెప్పే మాట. మన దేశంలో చాలా తక్కువ మంది రైతులు మాత్రమే వెదురును పండిస్తున్నారు. ఇప్పుడిప్పుడే దీనిపై రైతులు అడుగులు వేస్తున్నారు. మీరు కూడా ఈ పంటను పండిస్తే మంచి లాభాలు పొందవచ్చు.
వెదురు చెట్లు ఏ సీజన్‌లోనూ పాడవవు. ప్రతికూల వాతావరణాన్ని కూడా తట్టుకుంటాయి. ఇది 40 సంవత్సరాల వరకు ఉంటుంది. కోత తర్వాత కూడా మళ్లీ పెరుగుతుంది. వెదురు కలపను అమ్మడం ద్వారా మీరు సంవత్సరానికి 4-5 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. వెదురు పంటను ఒకసారి నాటితే.. దాని నుంచి చాలా ఏళ్ల పాటు ఆదాయం వస్తుంది. వెదురు సాగుతో పాటు నువ్వులు, మినుములు, గోధుమలు, బార్లీ, ఆవాలను అంతర పంటంగా వేసుకోవచ్చు. తద్వారా అదనపు ఆదాయం కూడా పొందవచ్చు.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ పంటను వేసేముందు, వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Business, Business Ideas, Farmers