Home /News /business /

BUSINESS IDEAS EARN RUPEES 8 LAKH IN JUST 4 MONTHS BY DOING THIS BUSINESS HERE IS THE FULL DETAILS NK

Business Ideas: లాభసాటి వ్యవసాయం... 4 నెలల్లో రూ.8 లక్షల ఆదాయం

లాభసాటి వ్యవసాయం... 4 నెలల్లో రూ.8 లక్షల ఆదాయం (ప్రతీకాత్మక చిత్రం)

లాభసాటి వ్యవసాయం... 4 నెలల్లో రూ.8 లక్షల ఆదాయం (ప్రతీకాత్మక చిత్రం)

Business Ideas: మనం ఆలోచించాలే గానీ మన చుట్టూ చాలా రకాల వ్యాపారాలు ఉంటాయి. వాటిలో కొన్ని అధిక లాభాలు ఇస్తాయి. అలాంటి ఓ వ్యాపారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

    మనలో చాలా మంది వ్యవసాయాన్ని వ్యాపారంలా చూడరు. ఒక్కసారి చూడటం మొదలుపెడితే... ఎలా లాభాలు రాబట్టాలి అనే కాన్సెప్ట్ తెరపైకి వస్తుంది. మల్టీ నేషనల్ కంపెనీలు, FMCG కంపెనీలు ఇలా ఆలోచిస్తూ... రైతులతో కాంట్రాక్టులు కుదుర్చుకొని... దేశవ్యాప్తంగా లక్షల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి. ఇలాంటి వ్యాపారాల్లో గుజరాత్, మహారాష్ట్ర రైతులు బాగా లాభపడుతున్నారు. ఇప్పుడు మనం చెప్పుకునేది వ్యాపారం లాంటి వ్యవసాయం గురించే. మీకు ఏ ఉద్యోగమూ లేక... తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే ఏదైనా వ్యాపారం చెయ్యాలని ఉంటే... ఈ ఐడియా మీకు ఉపయోగపడవచ్చు. వ్యవసాయం అనగానే... నష్టాలు, కష్టాలే అనే ఆలోచన నుంచి... వ్యవసాయమే లాభాల పంట పండిస్తుంది అనే ఆలోచనలు రావాలి. అందుకు కీర దోసకాయ సాగు (cucumber farming) మీకు డబ్బు ఎలా సంపాదించాలో (How to earn money) చెబుతుంది. అదెలాగో చూద్దాం.

    ఇప్పుడు సాగు చేపడితే లక్షల సంపాదన:
    కీర దోసకాయ సాగును మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రారంభిస్తే... మే లాదే జూన్ నాటికి కీర దోసకాయలు చేతికొస్తాయి. పంటకాలం 60 నుంచి 80 రోజులు ఉంటుంది. ఎండాకాలంలో కీర దోసకాయలకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది. ఒకవేళ పంట చేతికి వచ్చే సరికి వానాకాలం వచ్చినా... డైటింగ్ చేసేవారు వాటిని ఎప్పుడూ వాడుతూనే ఉంటారు. కాబట్టి వాటికి ఏడాదంతా డిమాండ్ ఉంటుంది. కీర దోసకాయ పంట... ఎలాంటి నేలలోనైనా పండుతుంది. నీరు ఉండే నేలలు, ఇసుక నేలలు మరింత బాగుంటాయి. నేలలో పొటాషియం pH 5.5 నుంచి 6.8 ఉంటే... ఈ సాగు చేపట్టేందుకు ఎంతో మంచిది. నదులు, సరస్సుల ఒడ్డున కూడా కీర దోసకాయల సాగు బాగుంటుంది.


    రైతు మాట ఇదీ:
    ఉత్తరప్రదేశ్‌కి చెందిన రైతు దుర్గా ప్రసాద్... కీర దోసకాయ పంట ద్వారా లక్షలు సంపాదిస్తున్నాడు. ఆయన లాభాల కోసమే ఈ పంటను వేసినట్లు చెప్పాడు. జస్ట్ 4 నెలల్లో అతను రూ.8 లక్షలు సంపాదించాడు. నెదర్లాండ్స్ నుంచి తెప్పించిన కీర దోసకాయ విత్తనాల (netherlands cucumber seeds)ను తన పొలంలో నాటాడు. ఇలా నెదర్లాండ్స్ నుంచి విత్తనాలను ఆర్డర్ చేసిన తొలి రైతు తానే అని అతను చెబుతున్నాడు. నెదర్లాండ్స్ రకం కీర దోసకాయల్లో గింజలు ఉండవు. అందువల్ల వాటికి హోటళ్లు, రెస్టారెంట్లలో విపరీతమైన డిమాండ్ ఉంది.




    దుర్గాప్రసాద్... ఉద్యానవన శాఖ నుంచి రూ.18 లక్షల లోన్ తీసుకున్నాడు. తన తోటలో... ప్రత్యేక నెట్ హౌస్ నిర్మించాడు. రూ.18 లక్షలకు తోడుగా... తన సొంత జేబు లోంచీ రూ.6 లక్షలు ఖర్చు పెట్టాడు. విత్తనాలు తెప్పించడానికి రూ.72,000 అయ్యింది. వాటిని నాటాక... 4 నెలల్లో సాగు చేసి... రూ.8లక్షలకు అమ్మాడు. త్వరలోనే అప్పు తీర్చేసి... పూర్తిగా లాభాలు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాడు.



    ఇది కూడా చదవండి: Neem Benefits: వేప ఆకులతో ఈ ప్రయోజనాలు తెలుసుకొని తీరాల్సిందే...

    భారీ లాభాలు ఎలా వస్తున్నాయి?
    సాధారణ దోసకాయల కంటే... నెదర్లాండ్స్ నుంచి తెప్పించే కీర దోసకాయల సాగులో దిగుబడి రెట్టింపు వస్తోంది. దేశీయ దోసకాయల ధర కేజీ రూ.20 మాత్రమే. అదే నెదర్లాండ్స్ కీర దోసకాయ అయితే ధర కేజీ రూ.40 నుంచి రూ.45 ఉంటోంది. ఏడాది మొత్తం దీనికి డిమాండ్ ఉంటోంది. సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేసుకొని... మార్కెటింగ్‌ను పెంచుకోవచ్చు.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Business Ideas

    తదుపరి వార్తలు