Business ideas: మీరు ఏదైనా సొంత వ్యాపారం చెయ్యాలని నిర్ణయించుకొని... ఏది చెయ్యాలో అర్థం కాక ఇబ్బంది పడుతున్నట్లైతే... ఓసారి ఈ వ్యాపారంపై ఫోకస్ పెట్టవచ్చు. ఎందుకంటే ఇది ప్రారంభించడం తేలిక. పైగా దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. అదీకాక ఇందులో మంచి లాభాలు వస్తాయి. వ్యాపారం ఏంటంటే... డైరీ ఫామ్ (Dairy Farm). పాలు, పాల ఉత్పత్తులకు ఇండియాలో ఎంతో డిమాండ్ ఉంది. ఇదో పెద్ద మార్కెట్. మీరు రూ.5 లక్షల పెట్టుబడి పెడితే... నెలకు రూ.70,000 సంపాదించగలరు. అందువల్ల చిన్న వ్యాపారం ప్రారంభించి... భారీ లాభాలు పొందాలి అనుకునేవారికి ఇదో సరైన ఆప్షన్ అవుతుంది.
ప్రధానమంత్రి ముద్ర యోజన (PMMY) అనే కేంద్ర పథకం ఒకటి ఉంది. దీని కింద ముద్ర రుణాలు ఇస్తుంది కేంద్రం. ఇందులో 3 రకాలు ఉన్నాయి. అవి శిశు, కిషోర, తరుణ్. శిశు లోన్ అనేది రూ.50,000లోపు ఉంటుంది. కిశోర అనేది రూ.50,000 దాటి రూ.5 లక్షల లోపు ఉంటుంది. ఇక తరుణ్ లోన్ రూ.5 లక్షలు దాటి రూ.10 లక్షల లోపు ఉంటుంది.
ఈ వ్యాపారం ప్రారంభించడానికి ఎంత డబ్బు కావాలి?
మీరు ప్లేవర్డ్ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తయారు చెయ్యాలి అనుకోవచ్చు. ఇందుకు మొత్తం రూ.16.5 లక్షలు పెట్టుబడి అవసరం అవుతుంది. ఇందులో మీరు సొంతంగా రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే... మిగతా డబ్బును కేంద్రం ముద్ర రుణం కింద ఇస్తుంది. బ్యాంకులేమో... రూ.7.5 లక్షల దాకా టెర్మ్ లోన్, రూ.4 లక్షల దాకా వర్కింగ్ క్యాపిటల్ ఇస్తాయి. అలా మీకు అవసరమైన రుణం పొందవచ్చు.
స్థలం ఎంత కావాలి?
ఈ వ్యాపారం కోసం మీకు 1000 చదరపు అడుగుల స్థలం కావాలి. ఇందులో 500 చదరపు అడుగులను ప్రాసెసింగ్ ఏరియాగా ఉంచుకోవాలి. 150 చదరపు అడుగుల స్థలాన్ని రిఫ్రిజిరేషన్ రూంగా ఉంచుకోవాలి. 150 చదరపు అడుగుల స్థలం... వాషింగ్ ఏరియాగా ఉండాలి. 100 చదరపు అడుగుల స్థలం... ఆఫీస్ ఏరియాగా ఉండాలి. 100 చదరపు అడుగుల్లో వాషింగ్ రూమ్స్ ఏర్పాటుచేసుకోవాలి.
ఏయే యంత్రాలు కావాలి?
మీకు ప్యాకింగ్ యంత్రం, క్రీమ్ సెపరేటర్, ఆటోక్లేవ్, బాటిల్స్, రిఫ్రిజిరేటర్, డీప్ ఫ్రీజర్, కాన్ కూలర్, కాపర్ బాటమ్ హీటింగ్ పాత్రలు, స్టెయిన్ లెస్ స్టీల్ స్టోరింగ్ పాత్రలు, ప్లాస్టిక్ ట్రే, డిస్పెన్సర్, స్లాట్ కన్వేయర్స్ అవసరం.
రా మెటీరియల్ ఖర్చులు ఎంత?
ప్రతి నెలా మీరు 12,500 లీటర్ల పాలు, 1000 కేజీల పంచదార, 200 కేజీల ఫ్లేవర్లు, 625 కేజీల మసాలాలు అంటే ఉప్పు లాంటివి. వీటన్నింటికీ కలిపి మీకు రూ.4 లక్షల దాకా అవుతుంది.
ఎంత ఆదాయం వస్తుంది?
మీరు 75 లీటర్ల ఫ్లేవర్డ్ మిల్క్, 36,000 లీటర్ల పెరుగు, 90,000 లీటర్ల వెన్న, 4,500 కేజీల నెయ్యిని అమ్మితే... మీకు సంవత్సరానికి రూ.82.5 లక్షలు వస్తుంది.
ఎంత లాభం వస్తుంది?
మీకు వచ్చే రూ.872.5 లక్షల్లో... మీకు ఏడాదికి అయ్యే ఖర్చు రూ.74.40 లక్షల దాకా ఉంటుంది. ఇందులో మీరు తీసుకున్న లోనుకు 14 శాతం వడ్డీ కూడా కలిపే ఉంది. ఈ ఖర్చు తీసేయగా మీకు ఏడాదికి రూ.8.10 లక్షలు లాభంగా వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.