BUSINESS IDEAS EARN MONTH INCOME 1 LAKH RUPEES FROM HOME BASED BUSINESS MK
Business Ideas: ఇంటి దగ్గరే మహిళలు నెలకు రూ.1 లక్ష సంపాదించే అవకాశం...
ప్రతీకాత్మకచిత్రం
ప్రస్తుత రోజుల్లో అందరూ పర్యావరణ హితంగా ఉండే వస్తువులు వాడుతున్నారు. దీంతో ఇప్పుడు ఫ్యాబ్రిక్ జ్యూట్ బ్యాగ్స్ (జనపనార)కు మంచి డిమాండ్ ఏర్పడింది. పర్యావరణ హితం కావడంతో ఈ బ్యాగ్స్ కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు.
ప్రస్తుతం మహిళలు కుటుంబ బాధ్యతలు అంటే కేవలం వంట పని, ఇంటి పని మాత్రమే కాదు. డబ్బు సంపాదనతో కుటుంబాన్ని నడిపించే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాంటి మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం అందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్ కు అనుగుణంగా, మహిళలు కలిసి పనిచేస్తూ సులభంగా మంచి ఆదాయం సంపాదించుకునే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ ఐడియా ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పాలిథీన్ సంచులపై నిషేధం విధించింది. దీంతో ఇప్పుడు ఫ్యాబ్రిక్ జ్యూట్ బ్యాగ్స్ (జనపనార బ్యాగ్స్)కు మంచి డిమాండ్ ఏర్పడింది. పర్యావరణ హితం కావడంతో ఈ బ్యాగ్స్ కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ బ్యాగ్స్ తయారీ ద్వారా మంచి ఆదాయం పొందే వీలుంది. ఫ్యాబ్రిక్ జ్యూట్ బ్యాగ్స్ తయారీ ముఖ్యంగా మహిళలు కలిసి చేసేందుకు ఎంతో తోడ్పడుతుంది. ముఖ్యంగా ఫ్యాబ్రిక్ జ్యూట్ బ్యాగ్స్ తయారీకి ఒక యూనిట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే శిక్షణ పొందితే మరింత సులువు అవుతుంది. ఆంధ్రా బ్యాంక్ గ్రామీణాభివృద్ధి సంస్థ (https://www.andhrabank.in/Telugu/AgriRsetisTelugu.aspx)లో మహిళలకు జ్యూట్ బ్యాగ్స్ తయారీ శిక్షణా కార్యక్రమ సర్టిఫికేట్, టూల్ కిట్స్ పంపిణీ చేస్తున్నారు.
ఈ పరిశ్రమ ద్వారా మీరు ఉపాధి పొందడం మాత్రమే కాదు ఇంకో ఐదారుగురు ఆడవాళ్ళకు కూడా పని కల్పించవచ్చు. జ్యూట్ తో తయారు అయిన హాండ్ బ్యాగ్స్ ,సూట్ కేసులు ,షాపింగ్ బ్యాగ్స్ ఫొల్డర్స్ ప్రోషేషనల్ బ్యాగ్స్, విండో కర్టెన్స్ కూడా తయారు చేయవచ్చు. సాధారణంగా ఉన్న వాటి పైన కాలంకారి ఆప్టిక్ వర్క్ ,పెయింటింగ్ ప్రింట్లు డిజైన్ చేయించి వాడవచ్చు. కాలేజీ స్టూడెంట్స్ తీసుకుపోయో బ్యాక్ పాక్స్ పైన చక్కని ఫ్యాబ్రిక్ డిజైన్ వేస్తే చాలా బావుంటుంది. ప్రస్తుత రోజుల్లో అందరూ పర్యావరణ హితంగా ఉండే వస్తువులు వాడుతున్నారు. కనుక ఈ చిన్న వ్యాపారానికి మంచి సపోర్ట్ దోరుకుతోంది.
జ్యూట్ బ్యాగ్ పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సినవి...
ఫ్యాబ్రిక్ కటింగ్ మిషిన్ - రూ.10 వేలు
హెవీ డ్యూటీ స్యూయింగ్ మిషిన్ - రూ. 35 వేలు
ఆర్డినరీ స్యూయింగ్ మిషిన్ - రూ. 10 వేలు
బ్యాగ్ మీద ప్రింటింగ్ కసం స్టెన్సిల్ ఎక్విప్ మెంట్ - రూ. 10 వేలు
500 స్క్వేర్ ఫీట్ ఒక ఖాళీ ప్రదేశంలో యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు
ముగ్గురు వర్కర్స్ నెలవారీ జీతానికి అవసరం అవుతారు...
ఆదాయం పొందండిలా...
- జ్యూట్ బ్యాగ్ తయారీ కోసం జ్యూట్ ఫ్యాబ్రిక్ రోల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
- ఒక జ్యూట్ ఫ్యాబ్రిక్ రోల్ 1.2 మీటర్ల వెడల్పుతో 200 మీటర్లు వరకూ ఉంటుంది.
- ఒక జ్యూట్ ఫ్యాబ్రిక్ రోల్ తో ఒక రోల్ తో 400 బ్యాగ్స్ తయారుచేయవచ్చు. (19"x15" సైజు)
- ఒక నెలకు 35 రోల్స్ చొప్పున వాడితే 15 వేల బ్యాగ్స్ తయారు చేయవచ్చు.
- ఒక మీటర్ జ్యూట్ ఫ్యాబ్రిక్ ఖరీదు రూ. 30 ఉంటుంది.
- అంటే 35 రోల్స్ x 200 మీటర్లు x రూ.30(మీటర్ ధర) = రూ. 2,10,000
- స్క్రీన్ ప్రింటింగ్ + స్టిచింగ్ రోల్స్ = రూ. 10 వేలు
- 15 వేల బ్యాగులకు మొత్తం పెట్టుబడి రూ. 2,20,000
- బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ధర రూ.15 అవుతుంది.
- మార్కెట్లో ఒక్కో బ్యాగ్ రూ.25 చొప్పున అమ్మితే మనకు ఒక్క బ్యాగ్ మీద రూ.10 లాభం వస్తుంది.
- అంటే 15 వేల బ్యాగులు విక్రయిస్తే రూ.3,75,000 రాబడి వస్తుంది.
- అందులో పెట్టుబడి (రూ.3,75,000-రూ.2,20,000) తీసివేయగా = రూ.1,55,000 నెలకు మిగిలే చాన్స్ ఉంది.
- వచ్చిన లాభంలో వర్కర్స్ జీతాలు, ఇతరత్రా ఖర్చులు పోయినా నెలకు రూ.1 లక్ష దాకా మిగిలే చాన్స్ ఉంది.
మార్కెటింగ్ టిప్...
- క్లాత్ స్టోర్స్, సూపర్ మార్కెట్స్ నుంచి బల్క్ ఆర్డర్స్ తీసుకుంటే...వాటిపై సదరు కంపెనీ బ్రాండింగ్ వేసి విక్రయించవచ్చు. తద్వారా ఆర్డర్లు కూడా నిరంతరాయంగా వస్తుంటాయి.
- అలాగే సూపర్ మార్కెట్స్ లో కూడా ప్లాస్టిక్ బ్యాన్ కారణంగా జ్యూట్ బ్యాగ్స్ డిమాండ్ పెరిగింది.
Disclaimer - The information contained in this article is for general, educational purposes only.
Published by:Krishna Adithya
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.