BUSINESS IDEAS EARN 2 LAKHS PER MONTH BY BIOFLAC TECHNOLOGY ON FISH FARMING HERE IS MORE DETAILS SK
Business Ideas: చేపల సాగుతో నెలకు రూ.2 లక్షలు.. కొత్త టెక్నాలజీతో లాభాల పంట
ప్రతీకాత్మక చిత్రం
Biofloc Fish Farming: చేపలను నదులు, సరస్సుల్లో కాకుండా... బయోఫ్లాక్ విధానంలో ట్యాంకుల్లో పెంచుతారు. అంటే కోళ్ల ఫామ్ మాదిరిగానే.. చేపలను కూడా షెడ్లలో పెంచవచ్చు
నదులు, సరస్సులు, సముద్రాల్లోనే చేపలు దొరుకుతాయని మనకు తెలుసు. మత్స్యకారులు వలలతో వాటిని పట్టుకొని మనకు విక్రయిస్తారు. కొందరుతై చేపల చెరువులు తవ్వి.. తమ పొలాల్లోనే చేపల సాగు చేస్తున్నారు. కానీ ఈ సంప్రదాయ పద్దతుల్లో కాకుండా చేపల పెంపకంలోనూ కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. వాటిలో ఒకటి బయో ఫ్లాక్ చేప సాగు విధానం. ఈ పద్దతిలో చేపలను పెంచితే మంచి లాభాలు గడించవచ్చు. ఏటా రూ.25వేలు ఖర్చు చేస్తే.. ప్రతి నెలా సగటున రూ.1.75 లక్షల ఆదాయం వస్తుంది. ఇటీవలి కాలంతో రైతులు కేవలం పంటలను మాత్రమే కాకుండా.. కోళ్లు, గొర్రెలు, కుందేళ్ల పెంపకతో పాటు చేపల సాగు కూడా చేస్తున్నారు. ప్రభుత్వాలు ప్రోత్సాకాలు కూడా ఇస్తుడడంతో ఆ వైపుగా చాలా మంది రైతులు అడుగులు వేస్తున్నారు.
మీకు చేపల పెంపకంపై ఆసక్తి ఉంటే.. బయో ఫ్లాక్ చేప సాగు మంచి ఎంపిక. తక్కువ ఖర్చుతో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా బయోఫ్లాక్ చేపల సాగు విధానం బాగా పాపులర్ అవుతోంది. ఈ టెక్నిక్‌తో చాలా మంది లక్షల్లో సంపాదిస్తున్నారు. చేపలను నదులు, సరస్సుల్లో కాకుండా... బయోఫ్లాక్ విధానంలో ట్యాంకుల్లో పెంచుతారు. అంటే కోళ్ల ఫామ్ మాదిరిగానే.. చేపలను కూడా షెడ్లలో పెంచవచ్చన్న మాట.
ఇంటి వద్ద లేదా పొలంలో కొంత స్థలం ఉంటే చాలు అక్కడ ట్యాంకులు నిర్మించి వాటిలో చేపలను పెంచుకోవచ్చు. ఆర్ఏఎస్ (రీసర్క్యులేటరీ ఆక్వా కల్చర్ సిస్టమ్), బయోఫ్లాక్ పద్దతుల్లో ట్యాంకుల్లోనే చేపలను పెంచుతారు. ఐతే RAS విధానంలో డ్రమ్ ఫిల్టర్, బయో ఫిల్టర్ వంటివి ఉపయోగించడం వల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కానీ బయోఫ్లాక్‌లో తక్కువ ఖర్చే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఏంటీ బయోఫ్లాక్ విధానం?
బయో ఫ్లాక్ అనేది బ్యాక్టీరియా పేరు. ఈ విధానంలో చేప పిల్లలను పెద్ద పెద్ద ట్యాంకుల్లో వేస్తారు. ఒక్కోటి 10 నుంచి 15వేల లీటర్ల సామర్థ్యం ఉంటుంది. వాటిలో చేపలు వేసి పెంచడమే. ఐతే ఇందులో బయోఫ్లాక్ కీలక పాత్ర పోషిస్తుంది. బయోఫ్లాక్ అనే బ్యాక్టీరియా .. చేపల విసర్జితాలను మళ్లీ ప్రొటీన్‌గా మార్చుతుంది. వాటిని చేపలు తిరిగి తింటాయి. తద్వారా చేపల వేసే మేత ఆదా అవుతుంది. మూడింట ఒక వంతు ఆదా కావడంతో ఫీడింగ్ ఖర్చు తగ్గుతుంది. అంతేకాదు చేపల వ్యర్థాలను ప్రొటీన్‌గా మార్చడంతో.. ట్యాంకుల్లోని నీరు మురికిగా ఉండదు. కలుషితం కాదు. తద్వారా చేపలు ఆరోగ్యంగా ఉంటాయి. నీటిని మాటికి మాటికి మార్చాల్సిన అవసరం ఉండదు.
ఐతే బయోఫ్లాక్ ఫిషరీస్ ఫ్లాంట్ ఏర్పాటుకు కాస్త ఎక్కువ ఖర్చే అవుతుంది. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ (NFDB) ప్రకారం.. ఏడు ట్యాంకులతో మీ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే, వాటిని సెటప్ చేయడానికి మీకు దాదాపు 7.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది.
2 లక్షలకు పైగా ఆదాయం
ఒక చిన్న గ్రామానికి చెందిన దుర్గా ప్రసాద్ సింగ్ అనే చిన్న రైతుకు నాలుగు ఎకరాల భూమి ఉంది. అందులో 2 ఎకరాల్లో చేపల పెంపకం ప్రారంభించాడు. తాను 10 సంవత్సరాల క్రితం చేపల పెంపకంపై రేడియో కార్యక్రమాన్ని విన్నానని.. ఆ తర్వాత సంప్రదాయ వ్యవసాయాన్ని విడిచిపెట్టి చేపల సాగు చేస్తున్నానని తెలిపాడు. మోగా (పంజాబ్)నగరంలోని జిల్లా మత్స్యశాఖను సంప్రదించానని.. మత్స్యశాఖ అధికారులు చేపల పెంపకంపై ఐదు రోజుల శిక్షణ ఇచ్చారని పేర్కొన్నాడు.
ప్రస్తుతం దుర్గాప్రసాద్ సింగ్ తన 2 ఎకరాల చేపల చెరువు ద్వారా సంపాదనతో చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు నెలకు రూ.2 లక్షలకు పైగానే సంపాదిస్తున్నారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక ప్రోత్సాహకాలు ఇస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పలువురు రైతులు బయోఫ్లాక్ విధానంలో చేపలను సాగు చేస్తున్నారు. కేంద్రంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా సాయం చేస్తోంది. ఒకవేళ మీరు బయోఫ్లాక్ ఫిషరీష్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకుంటే జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో సంప్రదించవచ్చు. వారు పూర్తి సమాచారాన్ని అందిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.