హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: జాబ్ గురించి టెన్షన్ వద్దు.. ఉన్న ఊళ్లోనే వ్యాపారం.. నెలకు రూ.లక్ష ఆదాయం

Business Ideas: జాబ్ గురించి టెన్షన్ వద్దు.. ఉన్న ఊళ్లోనే వ్యాపారం.. నెలకు రూ.లక్ష ఆదాయం

Business Ideas: సొంతూళ్లో ఉంటూనే.. ఈ వ్యాపారం చేయవచ్చు. నెలనెలా ఆదాయం వస్తుంది. అవసరమైతే ప్రతి రోజూ డబ్బు సంపాదించవచ్చు.

Business Ideas: సొంతూళ్లో ఉంటూనే.. ఈ వ్యాపారం చేయవచ్చు. నెలనెలా ఆదాయం వస్తుంది. అవసరమైతే ప్రతి రోజూ డబ్బు సంపాదించవచ్చు.

Business Ideas: సొంతూళ్లో ఉంటూనే.. ఈ వ్యాపారం చేయవచ్చు. నెలనెలా ఆదాయం వస్తుంది. అవసరమైతే ప్రతి రోజూ డబ్బు సంపాదించవచ్చు.

  కరోనా మహమ్మారి (Coronavirus) కాలంలో దేశవ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. లక్షలాది మంది ప్రజలు తమ ఉద్యోగాలను కోల్పోయి రోడ్డున పడ్డారు. సొంతూళ్లకు వెళ్లి చిన్నా చితక పనులు చేసుకుంటున్నారు. కానీ బాగా డబ్బు సంపాదించి.. ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలని.. అందరూ అనుకుంటారు. ఉద్యోగం లేకుంటే.. సొంతంగా వ్యాపారమైనా ప్రారంభించాలనుకుంటారు. అలాంటి వారి కోసమే ఇది. సొంతూళ్లో ఉంటూనే.. ఈ వ్యాపారం చేయవచ్చు. నెలనెలా ఆదాయం వస్తుంది. అవసరమైతే ప్రతి రోజూ డబ్బు సంపాదించవచ్చు. అదే.. లేయర్ కోళ్ల పెంపకం (Layer Chicken Farming)..!

  లేయర్ కోళ్లను పెంచుకోవాలంటే ముందు షెడ్ కావాలి. దానికి బాగా ఖర్చవుతుంది. ఐతే ఇప్పుడిప్పుడే వ్యాపారం ప్రారంభించే వారు.. భారీగా కాకుండా చిన్న షెడ్ నిర్మించుకోవాలి. తద్వారా పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవచ్చు. అంటే 1500 కోళ్లతో షెడ్ ఏర్పాటు చేసుకోవచ్చు.  కోళ్ల పెంపకానికి షెడ్, ఇతరత్రా సామాగ్రి కావాలి. అందుకు 5-6 లక్షల వరకు ఖర్చవుతుంది. షెడ్‌తో పాటు సామాగ్రి మొత్తాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత లేయర్ కోడి పిల్లలు కొనుగోలు చేయాలి. ఒక్కో కోడి పిల్లకు రూ.30-35 ఖర్చవుతుంది. కోళ్ల కోసం రూ.50వేలు కేటాయిస్తే చాలు. దీనితోపాటు కోళ్లకు దాణాతో పాటు మందుల కోసం ఇంకొంత డబ్బు అవసరం అవుతుంది. మొత్తంగా రూ.8 లక్షలతో ఈ వ్యాపారం చేయవచ్చు.

  Gold Price Today: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. భారీగా పడిపోయిన బంగారం ధరలు

  1500 కోళ్ల లక్ష్యంతో వ్యాపారం ప్రారంభించాలంటే.. 10శాతం ఎక్కువ కొనుగోళ్లు చేయాలి. మోర్టాలిటీ వచ్చినా ఇబ్బంది ఉండదు.  వీటిని 20 వారాల పాటు పెంచితే అప్పుడు గుడ్లు పెట్టే స్థాయికి కోళ్లు ఎదుగుతాయి. 20 వారాల వరకు మేత, ఇతర ఖర్చులు కలుపుకుంటే... లక్ష నుంచి లక్షన్నర వరకు అవుతుంది. 10 శాతం ఎక్కువ పిల్లలు కొన్నారు కాబట్టి.. ఒకవేళ కొన్నిచనిపోయినా.. 1500 వరకు బతుకుతాయి. ఆ కోళ్లు సంవత్సరానికి 290 చొప్పున గుడ్లు పెడతాయి. అలా ఒక ఏడాదిలో 4,35,00 గుడ్లు వస్తాయి. అందులో కొన్ని గుడ్లు వృథా అయినా.. 4 లక్షల వరకు మిగులుతాయి. ప్రస్తుతం మార్కెట్లో ఒక్క గుడ్డు 5 రూపాయలకు లభిస్తుంది. వ్యాపారులకు హోల్‌సేల్‌గా రూ.3 చొప్పున అమ్మినా.. ఏటా 12 లక్షలు వస్తాయి.

  రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ కరోనా నిబంధనలు ఎత్తివేత.. వివరాలివే

  ఏ రోజు ఆ రోజు గుడ్లను అమ్ముతూ డబ్బులు సంపాదించవచ్చు. గుడ్ల పెట్టే దశకు కోళ్లు వస్తే.. అప్పుడు చేతి నిండా డబ్బు ఉంటుంది. ఆ డబ్బుల నుంచే కొత్త మొత్తాన్ని మేత, మందులు, మెయింటెనెన్స్ ఖర్చులకు కేటాయించవచ్చు. షెడ్ ప్రారంభ సమయంలో మాత్రమే రూ.8 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత గుడ్లను అమ్ముకుంటూ రొటేషన్ చేసుకోవచ్చు. ఇలా గుడ్లను అమ్ముతూ.. నెలా నెలా రూ.70 వేలకు సంపాదించవచ్చు. క్రమంగా కోళ్ల సంఖ్యను పెంచుకుంటూ పోతే.. రూ.లక్ష వరకు కూడా రాబడి వస్తుంది. పౌల్ట్రీ ఫామ్ వ్యాపారం కోసం ప్రభుత్వాలు సబ్సిడీ కూడా ఇస్తున్నాయి. రుణాల్లో దాదాపు 25 శాతం సబ్సిడీ వస్తుంది. SC-ST వర్గాలకు 35శాతం వరకు ఉంటుంది.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

  First published:

  Tags: Business, Business Ideas, Personal Finance

  ఉత్తమ కథలు