Home /News /business /

BUSINESS IDEAS DAIRY FARMING BUSINESS HOW TO START DAIRY FARMING YOU CAN EARN 60000 PER MONTH BY SELLING MILK SK

Business Ideas: ఏడాదంతా డిమాండ్ ఉండే అద్భుతమైన బిజినెస్.. నెలకు రూ.60వేలు గ్యారంటీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Idea: ఈ రోజుల్లో చాలా మంది విద్యావంతులైన యువకులు కూడా డైరీ ఫామ్‌ బిజినెస్ చేస్తున్నారు. బాగా సంపాదిస్తున్నారు.

    మీరు పట్టణాలు, నగరాల్లో ఉంటున్నారా? జాబ్ చేసి బోర్ కొట్టిందా? ఐతే మీ కోసమే మంచి బిజినెస్ ఐడియా (Business Idea) తీసుకొచ్చాం. మన దేశంలో పాల వినియోగం చాలా ఎక్కువ. పాలకు డిమాండ్ లేని ప్రాంతమే ఉండదు. అందుకే డైరీ ఫామ్ (Dairy Farm) పెట్టి పాల వ్యాపారం చేస్తే అద్భుతమైన లాభాలు వస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది విద్యావంతులైన యువకులు కూడా డైరీ ఫామ్‌ బిజినెస్ చేస్తున్నారు. బాగా సంపాదిస్తున్నారు. పాలకు (Milk Business) ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. దాదాపు ప్రతి ఇళ్లలో వినియోగిస్తారు. అందువల్ల మార్కెటింగ్‌కు గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు.

    డెయిరీ ఫార్మింగ్ చేయడానికి ప్రభుత్వం కూడా సహాయం అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు పాడి రైతులకు రాయితీలు అందిస్తాయి. హర్యానా వంటి రాష్ట్రాల్లో పాడి పరిశ్రమ కోసం ఎవరైనా ఆవు లేదా గేదెను కొనుగోలు చేస్తే..  ప్రభుత్వం ఒక్కో గేదెకు రూ.50 వేలు, ఆవుకు రూ.30 వేలు రుణం ఇస్తుంది. ఈ రుణం వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంది. ఆ వడ్డీని కూడా సంవత్సరానికి ఒకసారి మాత్రమే చెల్లించాలి.



    పాడిపరిశ్రమలో  బాగా లాభాలు పొందాలంటే.. పాలకు డిమాండ్‌తో పాటు రేట్లు బాగా ఉండే ప్రాంతాల్లో డైరీ ఫామ్‌ని ప్రారంభించాలి. గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా.. ఏదైనా పెద్ద నగరానికి సమీపంలో డెయిరీని ప్రారంభిస్తే మీకు ఎక్కువ లాభం వస్తుంది. ఆరంభంలో మీరు తక్కువ పశువులతోనే దీన్ని ప్రారంభించవచ్చు. మీరు డెయిరీని ఎక్కడ ఏర్పాటు చేయలనుకుంటున్నారో.. ముందుగా ఆ ప్రాంతంలో సర్వే చేయాలి. ఆవు, గేదె పాలలో ఏది ఎక్కువగా వినియోగిస్తున్నారో తెలుసుకోవాలి.

    Stock Market: ఇన్వెస్టర్లపై డబ్బుల వర్షం..ఈ స్టాక్‌తో ఏడాదిలోనే 640శాతం రాబడి

    మీ డైరీ ఫామ్‌లో ఆవు, గేదె రెండింటిని ఉంచుకుంటే ఇంకా మంచిది. ముర్రా జాతి గేదెలు పాలు ఎక్కువగా ఇస్తాయి. ఆవుల్లో జెర్సీ, అమెరికన్ జాతుల ఆవులను కొనుగోలు చేయాలి. ఈ రెండు రకాలు ఎక్కువ కాలం పాటు.. అధిక మొత్తంలో పాలు ఇస్తాయి. ఈ పశువులను కట్టేసేందుకు తగినంత స్థలం ఉండాలి. అక్కడ షెడ్డును నిర్మించి.. పశువుల బాగోగులను చూసుకోవాలి. మార్కెట్లో మంచి మేలురకం గేదె 70 వేల రూపాయలకు వస్తుంది. మంచి పాలు ఇచ్చే ఆవు ఖరీదు రూ.35వేల వరకు ఉంటుంది. మూడు గేదెలు, రెండు ఆవులను కొనుగోలు చేసి.. డైరీ ఫామ్‌ని ప్రారంభించవచ్చు. వీటి కోసం పచ్చి, ఎండుగడ్డి ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. డైరీ ఫామ్‌ని చూసుకునేందుకు ఒక సేవకుడిని నియమించుకోచ్చు. అతడు పాలు పితికే పని నుంచి... మిగతా పనులన్నీ చేస్తాడు. ఇలా చిన్న స్థాయిలో డైరీ ఫామ్‌ను ఏర్పాటు చేసేందుకు మీరు 3.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

    తక్కువ పెట్టుబడితో రూ.లక్ష ఆదాయం.. ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే.. ఓ లుక్కేయండి

    సాధారణంగా ఒక గేదె రోజుకు 12 లీటర్ల పాలు ఇస్తుంది. అదే ఆవు 18 లీటర్ల వరకు ఇస్తుంది. మొత్తం ఐదు పశువుల నుంచి రోజుకు 90 లీటర్ల పాలు పొందుతారు. మీరు ఈ పాలను నేరుగా వినియోగదారుడికి లీటరు రూ.60కి విక్రయించవచ్చు. తద్వారా రోజుకు 5,400 వస్తాయి. కనీసం 4 వేలు వచ్చాయనుకున్నా.. నెలకు లక్షా 20వేల రూపాయలు వస్తాయి. ఇందులో పనివాళ్ల జీతం, పశుగ్రాసం, ఇతర ఖర్చుల కింద 60 వేల వరకు ఉన్నా.. మీకు రూ.60వేలు సులభంగా మిగులుతాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Business, Business Ideas, MILK

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు