Home /News /business /

BUSINESS IDEAS CLOUD KITCHEN MODEL IT REQUIRES LOW EXPENDITURE AND IS THE HIGH PROFIT MARGIN BUSINESS MK

Business Ideas: ఈ బిజినెస్ గురించి తెలుసుకుంటే...నెలకు కనీసం రూ.3 లక్షల ఆదాయం మీ సొంతం...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Business Ideas: ప్రస్తుతం మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న బిజినెస్ లకు భిన్నంగా ఆలోచిస్తే మాత్రం కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ మూడు పూవులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. (cloud kitchen)

ఇంకా చదవండి ...
  Business Ideas:  ఫుడ్ బిజినెస్ లో కాస్త వినూత్నంగా ట్రై చేస్తే మనకు చక్కటి ఆదాయం లభిస్తుంది. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ లో కొత్త ఐటమ్స్ పరిచయం చేస్తే మనకు కచ్చితంగా లాభాలు పండుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్న బిజినెస్ లకు భిన్నంగా ఆలోచిస్తే మాత్రం కచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ బిజినెస్ మూడు పూవులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. అటు రెస్టారెంట్లకు, ఫుడ్ డెలివరీ బాయ్స్, కస్టమర్లకు మధ్య ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. అయితే ఫుడ్ డెలివరీ ఇండస్ట్రీకి ఎంత డిమాండ్ ఉన్నప్పటికీ ఇందులో మరిన్ని అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగమే వినూత్నమైన క్లౌడ్ కిచెన్ మోడల్ (cloud kitchen). ఒక రెస్టారెంట్ లేదా, హోటల్ ఏర్పాటు చేయాలంటే మంచి సెంటర్ లో ఎక్కువ అద్దె చెల్లించి స్పేస్ ఎంపిక చేసుకోవాలి. అందులో యాంబియన్స్ కోసం పెట్టుబడి పెట్టాలి. అలాగే రెస్టారెంట్ స్టాఫ్, ఇలా సవాలక్ష అంశాలు ముడిపడి ఉంటాయి. అయితే క్లౌడ్ కిచెన్స్ అలా కాదు. ఒక మంచి హెల్తీ, హైజీన్ రెస్టారెంట్ స్టైల్ కిచెన్ ఏర్పాటు చేసుకుంటే, ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా మీ ఫుడ్ ను కస్టమర్లకు అందించే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారంలో మీకు కస్టమర్లను ఆకర్షించేలా కమర్షియల్ సెంటర్ లో స్పేస్ తీసుకోవాల్సిన పని ఉండదు. ఆన్ లైన్ ఆర్డర్లకు తగ్గట్టుగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటే చాలు, లాభాలు దక్కుతాయి. (cloud kitchen)

  క్లౌడ్ కిచెన్ (cloud kitchen) ఏర్పాటు చేయండిలా...
  - షాప్ లేదా ప్రాపర్టీ...విశాలమైన వెంటిలేషన్ ఉన్న గది అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. కమర్షియల్ స్పేస్ కాకుండా, తక్కువ అద్దె చెల్లించేలా, నీటి సరఫరా పుష్కలంగా ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవాలి. నివాస ప్రాంతాలకు కాస్త దూరంగా ఉంటే మేలు. ఎలాగో ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారానే వ్యాపారం కాబట్టి కమర్షియల్ స్పేస్ కోసం పోటీ పడాల్సిన అవసరం లేదు.
  - అలాగే కిచెన్ ఏర్పాటుకు కమర్షియల్ కిచెన్ సామాగ్రి, ప్యాకేజింగ్ సామాగ్రి కొనుగోలు చేయాలి. దీని ఖర్చు సుమారు..రూ. 2 నుంచి 3 లక్షలు
  - పీవోఎస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయాలి...దీని ధర రూ.25 వేలు
  - లైసెన్స్ కోసం FSSAI license, GST Registration, Municipal health trade licenses, fire license సహా స్థానిక అనుమతులు పొందాల్సి ఉంటుంది. FSSAI license ప్రతీ సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
  - కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
  - స్టాఫ్ కోసం యూనిఫార్మ్ మెయిన్ టెయిన్ చేయాల్సి. అలాగే శుభ్రత పాటించాలి.
  - మొత్తం ఖర్చు. రూ. 5 లక్షల వరకూ అయ్యే చాన్స్ ఉంది. (అంచనా మాత్రమే)

  లాభం పొందండిలా...
  - క్లౌడ్ కిచెన్  (cloud kitchen) సక్సెస్ కావాలంటే మార్కెటింగ్ అనేది చాలా ముఖ్యమైనది.
  - ఇందుకోసం సోషల్ మీడియాను వాడుకుంటే ఎక్కువ మందికి చేరుకునే అవకాశం ఉంది.
  - అలాగే మార్కెట్లోని స్విగ్గీ, జొమాటో, ఫుడ్ పాండా వంటి ఫుడ్ అగ్రిగేటర్స్ తో ఒప్పందం కుదుర్చుకుంటే మరింత మంచిది. సదరు కంపెనీలు ఒక్కో ఆర్డరుపై మీ రెవెన్యూలో 10-25 శాతం వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒక ప్లేట్ బిర్యానీ రూ.150 నిర్ణయిస్తే, అందులో రూ.15 నుంచి రూ.30 చార్జీ చేస్తారు.
  - అంతేకాదు ఫోన్ కాల్స్ ద్వారా డైరక్టుగా 5 కిలోమీటర్ల లోపు నివాస ప్రాంతాలకు ఫ్రీ డోర్ డెలివరీ సౌకర్యం కల్పిస్తే మీకు ఫుల్ మార్జిన్ మిగిలే అవకాశం ఉంది.
  - డెలివరీ బాయ్స్ కు కనీస సౌకర్యాలు కల్పించడంతో పాటు, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంచుకోవాలి.

  ఆదాయం ఎంతంటే...
  -సాధారణంగా ఒక రెస్టారెంట్ లో ఫుడ్ మీద లాభం మార్జిన్ 3 నుంచి 5 శాతం ఉంటే, క్లౌడ్ కిచెన్స్ లో మాత్రం 10 శాతం మేర లాభం దక్కే చాన్స్ ఉంది.
  - ఒక కేస్ స్టడీలో తేలిన విషయం ఏంటంటే...ఒక్కో క్లౌడ్ కిచెన్ పై, కనీసం నెలకు రూ. 10 లక్షలు అమ్మకాలు జరిగితే అన్ని ఖర్చులు పోను నెలకు రూ.2 నుంచి 3 లక్షల దాకా లాభం పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. (అంచనా మాత్రమే)

  - రెస్టారెంట్స్ నిర్ణీత సమయంలోనే ఫుడ్ అందుబాటులోకి తెస్తాయి. క్లౌడ్ కిచెన్స్ మాత్రం రౌండ్ ది క్లాక్ సేవలు అందిస్తే మరింత లాభాలు పొందవచ్చు. రుచి, శుభ్రత, మార్కెటింగ్ క్లౌడ్ కిచెన్ విజయ సూత్రం.

  Disclaimer - The information contained in this article is for general, educational purposes only.
  Published by:Krishna Adithya
  First published:

  Tags: Business, Business Ideas, BUSINESS NEWS, Money, Money making, Online business, Save Money, Small business

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు