Business Ideas: కేవలం రూ. 10 వేల పెట్టుబడితో నెలకు రూ. 50 వేల సంపాదన...ఎలాగంటే...

ఈ మధ్య పలు రకాల సర్వీసులు కూడా డోర్ డెలివరీ అవుతున్నాయి. అలాంటి ఒక నూతన వ్యాపారమే బైక్ సర్వీసింగ్ ఎట్ హోమ్. వినడానికి కొంచెం కొత్తగా ఉన్న మహానగరాల్లో ఈ బిజినెస్ ప్రస్తుతం ఎంతో విజయవంతంగా సాగుతోంది. ఆ స్వయం ఉపాధి ఎలాగో తెలుసుకుందాం.

news18-telugu
Updated: June 7, 2020, 8:38 AM IST
Business Ideas: కేవలం రూ. 10 వేల పెట్టుబడితో నెలకు రూ. 50 వేల సంపాదన...ఎలాగంటే...
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
ఈ కాలంలో డోర్ డెలివరీ సర్వీసెస్ అనేవి సర్వసాధారణం అయిపోయాయి. మనం ఆర్డర్ చేసే కాఫీ దగ్గరనుంచి బిర్యానీ, కిరాణా వస్తువులు, బట్టలు, చెప్పులు ఇలా ఒకటేమిటి మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు డోర్ డెలివరీ అవుతుంది. వస్తువుల డోర్ డెలివరీనే కాకుండా ఈ మధ్య పలు రకాల సర్వీసులు కూడా డోర్ డెలివరీ అవుతున్నాయి. అలాంటి ఒక నూతన వ్యాపారమే బైక్ సర్వీసింగ్ ఎట్ హోమ్. వినడానికి కొంచెం కొత్తగా ఉన్న మహానగరాల్లో ఈ బిజినెస్ ప్రస్తుతం ఎంతో విజయవంతంగా సాగుతోంది. ఆ స్వయం ఉపాధి ఎలాగో తెలుసుకుందాం.

సాధారణంగా బైక్ సర్విసింగ్ కోసం మనం ఏదో ఒక మెకానిక్ షాపును ఆశ్రయిస్తుంటాం. అయితే ఇంటివద్దనే సర్విసింగ్ చేస్తే దాన్నే బైక్ సర్విసింగ్ ఎట్ హోం అంటున్నారు. విదేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఈ బిజినెస్, ఇప్పుడిప్పుడే మన దేశంలోనే వృద్ధి చెందుతోంది. సాధారణంగా ఒక మెకానిక్ బైక్ సర్విసింగ్ సెంటర్ పెట్టాలంటే, మెయిన్ రోడ్డు మీద షాపు అద్దెకు తీసుకోవాలి. అద్దె ఎంత తక్కువ అనుకున్న మినిమం 10 వేలు ఉండే చాన్స్ ఉంది. అలాగే స్థానిక పన్నులు అదనం. అయితే బైక్ సర్వీసింగ్ ఎట్ హోం సర్వీసుకు మాత్రం ప్రారంభంలో పెట్టుబడి తప్ప మిగితా ఖర్చులు ఏమీ ఉండవు. షాపు రెంటు కూడా ఉండదు. అందువల్ల ఇదొక చక్కటి స్వయం ఉపాధి అయ్యే అవకాశం ఉంది. ఈ బిజినెస్ ను స్వయంగానూ, లేదంటే జాయింట్ గా కూడా ప్రారంభించవచ్చు.

ఈ బిజినెస్ కు కావాల్సినవి ఏంటో చూద్దాం...పట్టణాల్లో బైక్ లు, అలాగే కార్లను శుభ్రం చేసేందుకు వాటర్ సర్వీసింగ్ డిమాండ్ బాగా ఉంది. ఈ నేపథ్యంలో వాటర్ సర్విసింగ్ మెషిన్ కొనుగోలు చేసుకోవాలి. వాటర్ సర్విసింగ్ మెషిన్ కేవలం రూ.10 వేలకే మార్కెట్లో లభిస్తోంది. ఇక టూల్ బాక్స్ ఒకటి పెట్టుకోవాలి. అలాగే ఇంజన్ ఆయిల్, ఇతర స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే డోర్ సర్విసింగ్ కోసం కోసం ఒక బైక్ కలిగి ఉండాలి. అయితే బైక్ రిపేరింగ్ తో పాటు, వాటర్ సర్విసింగ్ మీద అనుభవం కలిగి ఉంటే మీ వ్యాపారం సులభం అవుతుంది. సహజంగా ఒక బైక్ సర్విస్ చేసేందుకు 500 రూపాయల వరకూ చార్జ్ చేస్తారు. రోజుకు రెండు బైకులు సర్వీసు చేసినా నెలకు 25 రోజుల పాటు 25 వేల వరకూ చార్జ్ చేయవచ్చు. ఇక వాటర్ సర్వీసింగ్ విషయానికి వస్తే.. ఒక బైక్ వాటర్ సర్వీస్ కోసం 70 రూపాయల దాకా చార్జ్ చేస్తున్నారు. డోర్ డెలివరీ సర్వీసింగ్ కాబట్టి రూ.100 వరకూ చార్జ్ చేయవచ్చు. రోజుకు 10 ఆర్డర్లు అందుకున్నా 700 నుంచి 1000 రూపాయలు సంపాదించవచ్చు. ఇలా నెలకు 20 నుంచి 30 వేల వరకూ సంపాదించవచ్చు. అంటే బైక్ సర్వీసింగ్, అలాగే వాటర్ సర్వీసింగ్ కలిపి నెలకు రూ. 50 నుంచి రూ. 60 వేల వరకూ సంపాదించే చాన్స్ ఉంది.
First published: June 7, 2020, 8:38 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading