Business Ideas: ఈ పద్ధతిలో చేపల సాగు చేస్తే...నెలకు 4 లక్షల ఆదాయం పక్కా..

ప్రతీకాత్మక చిత్రం

ఆధునిక వ్యవసాయం పద్ధతుల ద్వారా యువరైతులు సిరులు కురిపిస్తున్నారు. తక్కువ నీటితో అతి తక్కువ మంది కూలీలతో , సేంద్రియ విధానంలో లాభాదాయకమైన చేపల సాగు RAS, Recycling Aqua Culture System చేపట్టి మంచి ఆదాయం సాధిస్తున్నారు. కేవలం పావు ఎకరంలో సంవత్సరానికి 70 టన్నుల దిగుబడిని సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.

 • Share this:
  ఆధునిక వ్యవసాయం పద్ధతుల ద్వారా యువరైతులు సిరులు కురిపిస్తున్నారు. తక్కువ నీటితో అతి తక్కువ మంది కూలీలతో , సేంద్రియ విధానంలో లాభాదాయకమైన చేపల సాగు RAS, Recycling Aqua Culture System చేపట్టి మంచి ఆదాయం సాధిస్తున్నారు. కేవలం పావు ఎకరంలో సంవత్సరానికి 70 టన్నుల దిగుబడిని సాధిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. చుట్టు పక్కల నదులు కానీ, వరదనీటి కాలువలు గానీ లేకుండానే. కేవలం బోర్లతో ఆధునిక పద్ధతులను అవలంభిస్తూ చేపల పెంపకాన్ని విజయవంతంగా చేసి చూపుతున్నారు. రీసర్కులేటింగ్‌ ఆక్వా కల్చర్‌ సిస్టంను వ్యవసాయ క్షేత్రంలో నిర్మించి చేపల పెంపకాన్ని చేపట్టడం ద్వారా ఆదాయం మంచి ఆదాయం సాధిస్తున్నారు. అల్ట్రా హైడెన్సిటీ పద్ధతిలో చేపల పెంపకం ద్వారా చేపల వ్యర్థాలతో కూరగాయలు పెంచుకుకోవచ్చు. ఈ కల్టివేషన్ స్ట్రక్చర్‌ను నిర్మించేందుకు ఎక్కువగా ఖర్చు అవుతున్నప్పటికీ ఆదాయం కూడా స్థిరంగా వస్తుంది. ఆర్‌ఏఎస్ పద్ధతిలో చేపల పెంపకాన్ని విదేశాల్లో 30, 40 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మన భరత దేశానికి ఇది పూర్తిగా కొత్త టెక్నాలజీ. అయితే తక్కువ నీటితో, అతి తక్కువ విస్తీర్ణంలో, ఎక్కడైతే నీటి లభ్యత సరిగా ఉండదో అలాంటి చోట కూడా సునాయాసంగా అంగుళం నీరు వచ్చే బోరు ఉంటే ఎకరంలో చేపలను పెంచుకోవచ్చు. ఈ పద్ధతిని అనుసరిస్తూ పావు ఎకరం విస్తీర్ణంలో 70 టన్నుల చేపల దిగుబడిని సాధిస్తున్నారు.

  సంప్రదాయ పద్ధతుల్లో చెరువుల్లో పెరిగే చేపలకు, RAS పద్ధతిలో పెరిగే చేపలకు చాలా వ్యత్సాసం ఉంది. ఈ నూతన పద్ధతిలో చేపలకు కావాల్సిన ఆహారం టైం టు టైం అందుతుంది. చేపల పెరుగుదలకు అనుగుణంగా ఉష్ణోగ్రతలను మెయిన్‌టేన్ చేయవచ్చు. అంతే కాదు చేపల వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు ప్రత్యేక పద్ధతులను అవలంభించవచ్చు. చేపలు ఎలాంటి వ్యాధుల భారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సురక్షితమైన వాతావరణంలో వాటిని పెంచుతున్నారు. చెరువులో చేపల పెంపకం చేపడితే చేపల వ్యర్థాలు చెరువుల్లోనే ఉండిపోతున్నాయి. అవి అలా డీకంపోజ్ అవ్వడం వల్ల వాటి నుంచి రకరకాల హానికారక గ్యాస్‌లు విడుదలై , అమోనియా శాతం పెరిగిపోయి చేపలకు నష్టం వాటిల్లుతోంది. దీని వల్ల రైతులు చేపల పంటను కోల్పోతున్నారు. ఈ RAS పద్ధతిలో మాత్రం ఎప్పటికప్పుడు నీటిని శుభ్రం చేస్తూ చేపల పెంపకాన్ని చేవయచ్చు.

  ప్రతీకాత్మకచిత్రం


  నీటిలో చేపల వ్యర్థాలను శుభ్రం చేయడం అంత తేలికైన విషయం కాదు. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రమ్ ఫిల్టర్‌ ఏర్పాటుచేసుకోవచ్చు. ఇందులో నీటిలో ఉన్న వ్యర్థాలతో పాటు చేప తినగా మిగిలిన పదార్ధాలు డ్రమ్ ఫిల్టర్‌లోకి వెళ్లిపోతాయి. అమోనియాను బయోఫిల్టర్ ద్వారా పంపించి నీటిని శుభ్రపరచవచ్చు. చెరువుల్లో చలికాలంలో చేపల ఎదుగుదల ఆగిపోతుంది. , వేసవిలో చేపలు చనిపోవడం జరుగుతుంటుంది. ఆ కారణం ఉష్ణోగ్రతల్లో మార్పులు అందుకే RAS విధానంలో ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పడు కంట్రోల్ చేసుకోవచ్చు. RAS పద్ధతిలో ఎదుగుదలలో ఎలాంటి తేడా ఉండదు. సంప్రదాయ పద్ధతిలో కంటే 25 నుంచి 30 శాతం త్వరగా ఎదుగుతాయని గుర్తించినట్లు రైతు చెబుతున్నారు.

  సంప్రదాయ విధానంలో కోటి లీటర్ల నీటిలో 3000 చేపలను పెంచితే అవే 3 వేల చేపలను 50 వేల లీటర్ల నీటిలో ఈ విధానాన్ని ఉపయోగించి పెంచవచ్చు. చేపకు సమయానికి అనుగుణంగా ఆహారాన్ని అందించేందుకు ఆటో పీడర్స్‌ను డెవలప్ చేసుకుంటే...చెప్పిన సమయానికి, చెప్పినంత ఫీడ్‌ను ఆటోఫీడర్స్ చేపలకు అందిస్తాయి. ఎదుగుదలలో మంచి ఫలితం ఉంటుంది. మార్కెట్‌లో కేజీ చేప ధర 120 రూపాయలు ఉంటే RAS పద్ధతిలో పెంచిన చేప ధర 250 రూపాయలు పలుకుతోంది. దీనికి కారణం ఏంటి అంటే ? ఇవి కెమికల్‌ ఫ్రి చేపలు కావడమే. ఈ చేపను ఒకసారి రుచి చూసిన వారు మళ్లీ మళ్లీ కావాలంటారని రైతులు చెబుతున్నారు. RAS విధానంలో పెంచే చేపలకు ఎలాంటి కెమికల్ వాడాల్సిన అవసరం లేదు, మందులు ఉపయోగించాల్సిన పనే లేదు. అంతా సహజసిద్ధంగా పెరుగుతాయి కాబట్టే వీటికి ఇంత టేస్ట్ వచ్చిందని. ఈ చేపలను తిన్న వారికి ఆరోగ్యం దక్కుతుందని రైతులు చెబుతున్నారు.

  గతంలో బోరునీటితో చేపలను పెంచడం నేరం. కానీ ప్రస్తుతం బోరు నీటితో ఆర్‌ఏఎస్‌ విధానంలో చేపలను పెంచుకోవచ్చని జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. కాబట్టి ఎవ్వరైనా బోరు పద్ధతిలో చేపలను పెంచుకోవచ్చు. ఇందులో అన్ని రకాల చేపనలను సాగు చేసుకోవచ్చు. తిలాపియా, ఫంగీషియస్‌, పండుగప్ప, మార్పులు, ఇదే విధానంలో రొయ్యలను, పీతలను పెంచుకోవచ్చు. ఆర్ ఏ ఎస్ టెక్నాలజీ చేపల పెంపకానికి చాల వరకు ఉపయోగపడుతుందని, తక్కువ స్థలంలో ఎక్కువ చేపలను సాగు చేసే పద్ధతి చాల బాగుందన్నారు. వందెకరాల్లో చేసే చేపల పెంపకాన్ని ఒక ఎకరం విస్తీర్ణంలో చేయవచ్చు. ఇదిలా ఉంటే అటు ప్రభుత్వం ఈ RAS, Recycling Aqua Culture System పద్ధతిలో చేపల సాగుకోసం సబ్సిడీలు అందిస్తోంది. మత్స్యకారులకు అయితే 75 శాతం, మిగితా వారికి 40 శాతం మేర సబ్సిడీ అందిస్తున్నారు. అయితే ఈ విధానంలో ఏర్పాటు చేసుకున్న యూనిట్ ను బట్టి ఆదాయం ఉంటుంది.

  ప్రతీకాత్మకచిత్రం


  ప్రస్తుతం చికెన్, మటన్ కన్నా చేప మాంసం తింటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో చేప మాంసం డిమాండ్ పెరుగుతోంది. అంతేకాదు గుండె సమస్యలకు చేపలు చాలా మంచివి. అందుకోసం కూడా చేపలను తినేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ఈ విధానం ద్వారా సాలీనా రూ.40 లక్షల నుంచి రూ.80 లక్షల దాకా ఆదాయం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
  Published by:Krishna Adithya
  First published: