Amul Franchise: సొంత వ్యాపారం ద్వారా రాణించాలనే వారికి బోలేడు అవకాశాలను పలు సంస్థలు అందిస్తున్నాయి. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్(business ideas) ద్వారా స్థిరమైన ఆదాయం లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పలు ఆర్థిక సహకార స్కీముల ద్వారా యువత సొంత వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ సారి మనం అందరికీ తెలిసిన, రిస్క్ లేని బిజినెస్ గురించి తెలుసుకుందాం. కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల పెట్టుబడి పెట్టే స్థోమత ఉంటే చాలు దేశంలోనే ప్రఖ్యాత డెయిరీ ఉత్పత్తుల సంస్థ అమూల్ అద్భుతమైన ఫ్రాంచైజీ (Amul Franchise) బిజినెస్ లో భాగస్వాములను చేస్తోంది. రిటైల్ స్టోర్ల ద్వారా చిరువ్యాపారులను అమూల్ ప్రోత్సహిస్తోంది. ఈ వ్యాపారం ద్వారా అమూల్ (Amul Franchise) ప్రస్తుతం దేశమంతా విస్తరించే పనిలో ఉంది.అమూల్ ఫ్రాంచైజీ (Amul Franchise) ద్వారా ప్రతీనెల కనీస ఆదాయం పొందే వీలు ఉంది. ఎందుకంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పాల ఉత్పత్తుల డిమాండ్ అధికంగా ఉంది. ఈ రంగంలోకి అటు విదేశీ సంస్థలు సైతం పెట్టుబడులు పెడుతున్నాయి. మిగితా వ్యాపారాలకు సీజన్ తో పని ఉంటుంది. కానీ పాలు నిత్యావసరం కనుక ఈ రంగంలో మార్కెట్ లో ఎంత పోటీ ఉన్నప్పటికీ, అందరికీ సమాన అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే అమూల్ ఫ్రాంచైజీ (Amul Franchise) ప్రత్యేకత ఏంటంటే..దీనికి సంబంధించి ఎలాంటి రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఫ్రాంచైజీ లాభాల్లో సంస్థకు వాటా ఇవ్వక్కర్లేదు. ఫ్రాంచైజీ ఏర్పాటుకు మొదట డబ్బు చెల్లించి, షాపు ఇంటిరీయర్, అవసరమయ్యే సామాగ్రి, స్థలానికి అయ్యే ఖర్చు కంపెనీయే భరిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఎలాంటి స్టోర్ అని చెప్పి, దానికి తగ్గ డబ్బు చెల్లించడమే.
అమూల్ వారు రెండు రకాల ఫ్రాంచైజీ కాన్సెప్ట్‌లను ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మొదటిది టైప్-1 అమూల్ ప్రిఫర్డ్ ఔట్ లెట్స్ అంటారు. వీటిని కార్యాలయాలు, ఆఫీసు క్యాంటీన్లు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లు, ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మోడల్ ఫ్రాంచైజీకి 100 నుంచి 150 చదరపు మీటర్ల స్థలం అందుబాటు ఉండాలి. దీని రూ.25వేలు రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. అలాగే రినోవేషన్ చార్జీలు రూ.80 వేలు ఖర్చు అవుతుంది. ఎక్విప్ మెంట్ ఖర్చు రూ.80 వేలు ఖర్చు అవుతుంది.

Amul Franchise (Image: amul)

Amul Franchise (Image: amul)
ఒక టైప్-2 అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్ కోసం 300 చ.మీ స్థలం అవసరం అవుతుంది. మంచి వ్యాపారం జరిగే ఏరియాలో అద్దె లేదా సొంత స్థలం లేదా దుకాణం ఉండాలి. టైప్-2 అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్ కోసం రూ.50 వేల రీఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి. ఇది కాకుండా ఇంటిరీయర్, ఎక్విప్మెంట్ వంటి వాటికన్నింటికీ అయ్యే ఖర్చు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక రూ.1 లక్ష రెనొవేషన్ కోసం, రూ.75 వేలు ఇంటిరీయర్, ఎక్విప్మెంట్ కోసం వెచ్చించాల్సి ఉంటుంది. అమూల్ వారి ఐస్ క్రీం ఫ్రాంచైజీ కోసం రూ. 5 లక్షల దాకా చెల్లించాలి. ఇందులో బ్రాండ్ సెక్యూరిటీ కోసం రూ.50 వేలు, రెనోవేషన్ కోసం రూ.4 లక్షలు పోతుంది. పరికరాల కోసం రూ.1.50 లక్ష వరకూ ఖర్చవుతుంది.

Amul Franchise (Image: amul)

Amul Franchise (Image: amul)
అమూల్ రైల్వే పార్లర్స్ ఏర్పాటు కోసం రూ.1 లక్ష రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ పెట్టాలి. పార్లర్ ఏర్పాటు చేసేందుకై వ్యాపారులు రూ.2.5 లక్షల నుంచి రూ. 4 లక్షల దాకా పెట్టుబడి పెట్టాలి. ఇందుకోసం మీరు సంబంధిత సంస్థల నుంచి ఎలాట్ మెంట్ అనుమతి పొందాల్సి ఉంటుంది.
ఇక నాలుగో రకం పార్లర్లు ఏర్పాటును సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అంటారు. దీనికి రూ.50 వేలు రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ పెట్టాలి. అలాగే రూ.2.5 లక్షల నుంచి రూ. 4 లక్షల స్టాల్ ఏర్పాటుకు ఖర్చు అవుతుంది.
కంపెనీ పేర్కొన్న అంచనా ప్రకారం కనీసం రూ. 5 లక్షల నుంచి గరిష్టంగా రూ.10 లక్షల వరకూ ఒక్కో నెల సంపాదన ఉంటుంది. మీకు సంస్థ ఉత్పత్తుల ఎంఆర్పీ మీద ఉండే రిటైల్ మార్జిన్ ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఉత్పత్తిని బట్టి ఈ మార్జిన్ మారుతుంది. పాల ప్యాకెట్ పైన 2.5 శాతం, పాల ఉత్పత్తులపైన 10శాతం, ఐస్‌క్రీమ్‌లపైన 20 శాతం వరకూ కమీషన్ వస్తుంది. ఇంకా ఐస్ క్రీమ్, షేక్స్, పిజ్జా, షాండ్ విచ్, హాట్ చాకొలేట్ డ్రింక్ వంటి ఉప ఉత్పత్తులు, ఐస్‌క్రీమ్ పార్లర్ ద్వారా ఆదాయం 50% పెరుగుతుంది. అప్పుడు ప్రీ ప్యాక్డ్ ఐస్‌క్రీమ్ ఐటమ్స్ పైన 20శాతం, అమూల్ ఉత్పత్తుల పైన 10 శాతం కమీషన్ వస్తుంది.