Home /News /business /

BUSINESS IDEA YOU CAN START BLACK RICE FARMING WITH LOW INVESTMENT YOU WILL GET PROFIT IN LAKHS SK

Business Ideas: కిలో బియ్యం రూ.500.. ఈ పంట పండిస్తే.. రైతులకు డబ్బే డబ్బు.. లక్షల్లో ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Black Rice: సంప్రదాయ బియ్యం కంటే.. నల్ల బియ్యంతో 5 రెట్లు అధిక ఆదాయం పొందవచ్చు. సాధారణ బియ్యం ధర మార్కెట్లో కిలోకు 50-100 వరకు ఉంటుంది. అదే నల్ల బియ్యం రేటు రూ.250-500 వరకు పలుకుతుంది.

  'బతకలేక రైతు' అని గతంలో అనేవారు. చదువు రాని వారే వ్యవసాయం చేస్తారనే మాటలు ఒకప్పుడు వినిపించేవి. పాత కాలంలో కేవలం కడుపు నింపు కునేందుకే పంటలు పండించే వారు. తమ పొలంలో పండిన పంటతోనే ఆకలి తీర్చుకునే వారు. కానీ కాలాం మారింది. ఇప్పుడలా కాదు. ఐటీ ఎంప్లాయి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల వరకు అందరూ వ్యవసాయం బాటపడుతున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలకు కూడా రాజీనామా చేసి పొలంలోకి దిగుతున్నారు. సంప్రదాయ పంటలు కాకుండా.. వాణిజ్య పంటలు పండించి.. లక్షలు సంపాదిస్తున్నారు. మరి మీకు కూడా ఉద్యోగం చేసి బోర్ కొట్టిందా? సొంతూరికి వెళ్లి వ్యవసాయం చేయాలనుకుంటున్నారా? మీ కోసమే అద్భుతమైన బిజినెస్ ఐడియా (Business Ideas)ను తీసుకొచ్చాం. ఈ రోజుల్లో బ్లాక్ రైస్‌ (Black Rice)కు డిమాండ్ పెరుగుతోంది.మార్కెట్లో మంచి రేటు పలుకుతోంది. ఈ పంటను పండిస్తే.. మీకు భారీగా లాభాలు వచ్చే అవకాశముంది.

  Share Market: స్టాక్ మార్కెట్‌లో ఈ ఫార్మా షేర్లే ఇప్పుడు హాట్ టాపిక్.. ఊహించనంత లాభాలు..

  మనం తినే సాధారణ బియ్యంతో పోల్చితే నల్ల బియ్యంలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అందుకే డయాబెటిస్, బీపీ వ్యాధులపై ప్రభావంతంగా పనిచేస్తోంది. ఈ బియ్యం తింటే షుగర్, బీపీ వంటి రోగాలు అదుపులో ఉంటున్నాయి. అందుకే కాస్త ధర ఎక్కువైనా.. చాలా మంది బ్లాక్ రైస్ తినేందుకు ఇష్టపడుతున్నారు. మొదట చైనాలో ఈ రకం బియ్యాన్ని ఎక్కువగా పండించారు. ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉండడంతో ఇతర ప్రాంతాలకు విస్తరించింది. మనదేశంలో నల్ల బియ్యం సాగు ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మణిపూర్, అసోంలో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే ఇతర రాష్ట్రాల్లో కూడా సాగు చేస్తున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా కొందరు రైతులు బ్లాక్ రైస్ (Black Farming) పండిస్తున్నారు. బియ్యంగా ఉన్నప్పుడు ఇవి నల్లగా కనిపించినా.. వండిన తర్వాత అన్నం నీలం, ఉదా రంగులోకి మారుతుంది. అందుకే ఉత్తరాదిన నీలా భాట్ అని కూడా పిలుస్తారు.  బ్లాక్ రైస్ పంట కాలం దాదాపు 4 నెలలు. వరి నారుపోసినప్పటి నుంచి.. పంట చేతికి వచ్చేందుకు.. దాదాపు 100-120 రోజుల సమయం పడుతుంది. సాధారణ వరి మొక్క కంటే నల్ల వరి మొక్కలు కాస్త పొడవుగా ఉంటాయి. వరి కంకులు కూడా పెద్దగా ఉంటాయి. సంప్రదాయ బియ్యం కంటే.. నల్ల బియ్యంతో 5 రెట్లు అధిక ఆదాయం పొందవచ్చు. సాధారణ బియ్యం ధర మార్కెట్లో కిలోకు 50-100 వరకు ఉంటుంది. అదే నల్ల బియ్యం రేటు రూ.250-500 వరకు పలుకుతుంది. నాణ్యతను బట్టి రేటు ఉంటుంది. సేంద్రీయ పద్దతిలో నల్ల వరి పంటను సాగు చేస్తే.. అధికంగా రేటు వస్తుంది. SMAM యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు కూడా అందుతాయి. ఈ పథకం కింద 50 నుంచి 80 శాతం సబ్సిడీతో వ్యవసాయ పరికరాలు, యంత్రాలను పొందవచ్చు. మీరు పండించి నల్ల వరి ధాన్యాన్ని.. మీరే ప్రాసెస్ చేసి.. మార్కెట్లో విక్రయిస్తే.. లక్షల్లో ఆదాయం వస్తుంది.  నల్లబియ్యం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు:
  నల్ల బియ్యం తినడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు, క్యాన్సర్ ముప్పుతగ్గుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. ఇందులో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. 10 గ్రాముల నల్ల బియ్యం నుంచి 9 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. ఫైబర్, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. మధుమేహవ్యాధిగ్రస్తులు, బీపీ రోగులకు కూడా ఎంతో మేలు చేస్తుంది. అందువల్లే బ్లాక్ రైస్‌కు మార్కెట్లో డిమాండ్ బాగా ఉంది.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Agriculture, Business, Business Ideas, Farmers

  తదుపరి వార్తలు