హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: రూ.10వేల పెట్టుబడితో చేయగలిగే వ్యాపారాలు... మీ జీవితాన్నే మార్చవచ్చు..!

Business Ideas: రూ.10వేల పెట్టుబడితో చేయగలిగే వ్యాపారాలు... మీ జీవితాన్నే మార్చవచ్చు..!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Business Ideas: తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయలని అనుకుంటున్నారా? మీ కోసమే ఈ ఐడియాలు. కేవలం రూ.10వేలతోనే వ్యాపారం మొదలు పెట్టి.. ప్రతి నెలా వేలల్లో సంపాదించవచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగం చేస్తూనే వ్యాపారం (Business Ideas) చేసుకుంటున్నారు. వచ్చిన జీతం సరిపోవడం లేదని సైడ్ బిజినెస్‌ వైపు అడుగులు వేస్తున్నారు. సమయానుగుణంగా వ్యాపారం చేస్తూ తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. మీరు కూడా ఉద్యోగంతో పాటు కొంత అదనపు ఆదాయాన్ని పొందాలని ఆలోచిస్తున్నారా? మీలాంటి వారి కోసమే ఈ ఐడియాలు. ఇంట్లో కూర్చొనే.. తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు కొన్ని ఉన్నాయి. అంతేకాదు వాటికి ఏడాదంతా డిమాండ్ ఉంటుంది. ఈజీగా మార్కెటింగ్ (Marketing) చేయవచ్చు. వ్యాపారం బాగా జరిగితే నెల నెలా లక్షలు కూడా సంపాదించుకోవచ్చు. ఉద్యోగం కన్నా ఎక్కువ ఆదాయం పొందవచ్చు. చాక్ పీస్, బిందీ, ఎన్వెలప్స్, కొవ్వొత్తుల తయారీ వంటి చిన్న చిన్న వ్యాపారాలు (Low Investment Business) చేసి.. ఆ ఉత్పత్తులను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కూడా విక్రయించవచ్చు.


  సుద్ద (చాక్‌పీస్):
  సుద్ద తయారీని చాలా తక్కువ పెట్టుబడతో ప్రారంభించవచ్చు. ఇంటో కూర్చొని సులభంగా నిర్వహించవచ్చు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో చాక్ పీస్‌లు ఉపయోగిస్తారు. చాక్ పీస్ తయారు చేయడానికి మెటిరీయల్ ఎక్కువగా అవసరం ఉండదు. సుద్దలు ప్రధానంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుండి తయారవుతాయి. ఇది తెలుపు రంగులో ఉండే పొడి. జిప్సం అనే రాయితో తయారు చేసిన ఒక రకమైన మట్టి. దీనికి రంగులు కలిపి.. కలర్ చాక్‌పీస్‌లు తయారు చేస్తారు. కేవలం రూ.10,000తో ప్రారంభించవచ్చు.
   LPG Price: భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ ధర.. సెప్టెంబర్ మొదటి రోజే అదిరిపోయే శుభవార్త
  బిందీలు (ఫేస్ స్టిక్కర్):
  ఈ రోజుల్లో మార్కెట్‌లో బిందీకి డిమాండ్ బాగా పెరిగింది. ఇంతకుముందు పెళ్లయిన ఆడవాళ్ళు మాత్రమే స్టిక్కర్స్ ధరించే వారు. ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు కూడా సంప్రదాయాలను పాటిస్తూ.. ఫేస్ స్టిక్కర్స్ వాడుతున్నారు. అంతే కాదు విదేశాల్లోని మహిళలు కూడా వీటిని ధరించడం మొదలుపెట్టారు. అందువల్ల వీటికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కేవలం రూ.12,000 పెట్టుబడితో ఇంట్లో కూర్చొని బిందీ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
  ఎన్వలప్:
  ఎన్వలప్స్‌ని తయారీ చాలా సులభమైన, చౌకైన వ్యాపారం. ఇది కాగితం, కార్డ్ బోర్డ్ వంటి వాటితో తయారు చేస్తారు. ఎక్కువగా ప్యాకేజింగ్ కోసం ఉపయోగిస్తారు. పేపర్లు, గ్రీటింగ్ కార్డ్‌లు మొదలైన వాటిని ప్యాకేజింగ్ చేయడానికి వాడుతారు. ఇందులో ప్రతి నెలా సంపాదన ఉంటుంది. ఇంటి నుంచే ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఇందుకు 10,000 నుంచి 30,000 వరకు ఖర్చవుతుంది. క యంత్రంతో ఎన్వలప్‌లను తయారు చేయాలనుకుంటే.. దాని కోసం రూ. 2,00,000 నుండి 5,00,000 వరకు పెట్టుబడి పెట్టవలసి ఉంటుంది.


  కొవ్వొత్తులు:
  కొవ్వొత్తుల వ్యాపారం కాలక్రమేణా చాలా మారిపోయింది. ఒకప్పుడు ఇంట్లో కరెంట్ పోతే.. కొవ్వొత్తి వెలిగించేవారు. కానీ ఇప్పుడు పవర్ కట్స్ తక్కువగా ఉన్నాయి. ఒకవేళ పవర్ పోయినా.. చార్జింగ్ లైట్స్ ఉన్నాయి. అందుకే వీటిని వినియోగం అక్కడ తగ్గిపోయిది. కానీ అదే సమయంలో పుట్టిన రోజు వేడుకలు, ఇళ్లు, హోటళ్ల అలంకారానికి బాగా వాడుతున్నారు. అందువల్ల కొవ్వొత్తులకు మళ్లీ డిమాండ్ పెరిగాయి. ఈ వ్యాపారాన్ని ఇంటి నుంచే ప్రారంభించవచ్చు. రూ. 10,000 నుండి 20,000 వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత నిపుణుల సంప్రదించడం శ్రేయస్కరం)

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, Business Ideas

  ఉత్తమ కథలు