• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • BUSINESS IDEA WHAT IS THE SPECIALITY OF GIR COWS HOW THEY ARE BEST FOR DOING DAIRY BUSINESS NK

Business Idea: ఈ ఆవులతో పాల వ్యాపారం ప్రారంభిస్తే... కోటీశ్వరులు అవ్వడం ఖాయం

Business Idea: ఈ ఆవులతో పాల వ్యాపారం ప్రారంభిస్తే... కోటీశ్వరులు అవ్వడం ఖాయం

గిర్ జాతి ఆవులు (image credit - wikipedia)

Business Idea: అవి ఏ జాతి ఆవులు... వాటికీ మామూలు ఆవులకూ ఏంటి తేడా... వాటిని ఎక్కడ కొనాలి? వాటితో వ్యాపారం ఎలా ప్రారంభించాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    Business Idea: ప్రపంచం మారుతోంది. గేదె పాల కంటే ఆవు పాల (cow's milk)కు ఇప్పుడు ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నారు. దీన్ని గమనించిన పాల ఉత్పత్తి కంపెనీలు (dairy companies) కూడా... ఆవు పాలతో వ్యాపారం చేస్తూ... చక్కటి లాభాలు సాధిస్తున్నాయి. ఒకప్పుడు గేదె పాలతో మాత్రమే ఈ వ్యాపారం జరిగేది. ఇప్పుడు కూడా గేదె పాలనే ఎక్కువగా వాడుతున్నారు. అదే సమయంలో... ఆవు పాలను కొనడాన్ని ప్రజలు ప్రత్యేకంగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే... ఆవులను గోమాత అంటారు. ఈ సెంటిమెంట్ బలంగా ఉంది. ఆవుపాలు ఎంతో శ్రేష్టమైనవి అనే విషయాన్ని గుర్తించి... వాటిని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మీరు పాల వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే... ఆవుపాల వ్యాపారం సరైనది.

    ఇలా ప్రారంభించండి:
    ఏ వ్యాపారం ప్రారంభించాలో ఆలోచించుకున్నాక... ఎలా అనే ప్రశ్న వస్తుంది. ఆవుల్లో ఒక జాతి ఆవులుంటాయి. అవి ఎక్కువ పాలు ఇస్తాయి. ఫలితంగా ఎక్కువ లాభాలు సాధించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.

    ఏ జాతి ఆవులు అవి?:
    ఈ ఆవులను గిర్ జాతి ఆవులు (Gir cow breed) అంటారు. వీటిని పెంచడానికి ఖర్చు చాలా తక్కువే అవుతుంది. పాల ఉత్పత్తి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఫలితంగా లాభాలు బాగా వస్తాయి.

    గిర్ జాతి ఆవు (image credit - wikipedia)


    గిర్ జాతి ఆవు ప్రత్యేకత ఏంటి?
    ఈ ఆవులు మన దేశ వాతావరణానికి బాగా సెట్ అవుతాయి. పైగా ఈ ఆవుల్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. అందువల్ల త్వరగా వ్యాధుల బారిన పడవు. ఫలితంగా వీటిని పెంచేవారికి మందుల ఖర్చులు చాలా వరకూ తగ్గుతాయి. పైగా ఈ ఆవు పాలు, నెయ్యి, మూత్రం ధరలు చాలా ఎక్కువ.

    విదేశాల్లో డిమాండ్:
    మన దేశంలోని గిర్ జాతి ఆవుల గురించి మనకంటే ఎక్కువగా తెలుసుకుంటున్నారు బ్రెజిల్ ప్రజలు. చాలా మంది సైలెంట్‌గా వాటిని కొనేస్తూ... కోట్లు సంపాదిస్తున్నారు. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో ఈ ఆవులకు విపరీతమైన డిమాండ్ ఉంది. అక్కడి రైతులు పండగ చేసుకుంటున్నారు. గిర్ జాతి ఆవుల్లో... రెండు రకాలున్నాయి. అవి స్వర్ణ కపిల (Swarna Kapila), దేవమణి (Devamani).

    ఎక్కడ లభిస్తాయి?
    గిర్ జాతి ఆవులు... గుజరాత్‌కి చెందినవి. కానీ ఇప్పుడు వీటిని ఎక్కువగా రాజస్థాన్‌లోని అజ్మీర్, హర్యానాలో పెంచుతున్నారు. ప్రజలకు వీటి గురించి తెలుస్తున్న కొద్దీ... వీటి పాపులార్టీ పెరిగిపోతోంది. ఒక్కో గిర్ ఆవూ... 12 నుంచి 15 ఏళ్లు బతుకుతుంది. అలాగే... 6 నుంచి 12 పిల్లలు పెడుతుంది.

    ఎన్ని పాలు ఇస్తుంది?
    రిపోర్ట్ ప్రకారం... గిర్ జాతి ఆవు రోజుకు 12 నుంచి 20 లీటర్ల పాలు ఇస్తాయని చెబుతున్నారు. పెంపకాన్ని బట్టే ఏదైనా ఉంటుంది అనుకోవచ్చేమో. పాల ఉత్పత్తిని పెంచేందుకు ఈ ఆవులకు సరైన దాణా పెట్టాల్సి ఉంటుంది. అలాగే... వీటి గొడ్ల చావిడి కూడా చక్కగా మెయింటేన్ చెయ్యాలి. వీటి ఆరోగ్యంపై అప్పుడప్పుడూ వెటెర్నరీ డాక్టర్లతో పరీక్షలు చేయించడం మంచిదే.

    ఇది కూడా చదవండి: Flax Seeds Health Benefits: అవిసె గింజలు తినండి... అద్భుత ప్రయోజనాలు పొందండి

    ఒక్కో ఆవు ధర ఎంత?
    ఇచ్చే పాలను బట్టీ, వయసును బట్టీ, లొకేషన్, ప్రెగ్నెన్సీని బట్టీ ఆవు ధర ఉంటుంది. ఒక్కో ఆవు ధర రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల దాకా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఉన్న ఆవుల ధర ఎక్కువగా ఉంటుంది.
    Published by:Krishna Kumar N
    First published: