మీరు సొంతంగా వ్యాపారాన్ని (Own Business) ప్రారంభించాలనుకుంటున్నారా? ఇంటి నుంచే వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే.. ఈ బిజినెస్ ఐడియా(Business Idea) మీ కోసమే.. ఈ వ్యాపారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. అన్ని సీజన్లలో ఈ వ్యాపారానికి(Business) డిమాండ్ ఏ మాత్రం తగ్గదు. మంచి మార్కెటింగ్(Marketing) చేసుకుంటే మీ బిజినెస్ కు తిరుగు ఉండదు. ఈ వ్యాపారం మసాలా మేకింగ్ యూనిట్. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా తక్కువ పెట్టుబడి (Investment) అవసరం ఉంటుంది. ఎక్కువ ప్రాఫిట్ పొందే అవకాశం ఉంటుంది. భారతదేశంలోని వంటగది(Kitchen)లో సుగంధ ద్రవ్యాలకు ముఖ్యమైన స్థానం ఉందని మనందరికీ తెలిసిన విషయమే. దేశంలో మిలియన్ల టన్నుల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి నుంచి మసాలాలు తయారు చేసి విక్రయిస్తే మంచి లాభాలు పొందొచ్చు. మీ స్థానికంగా ఉండే ప్రజల ఆహారపు అలవాట్లు, వారి అభిరుచులకు అనుగుణంగా మీరు మసాలాలు తయారు చేస్తే మీరు సక్సెస్ కావొచ్చు. మీకు రుచి, మార్కెట్ పై అవగాహన ఉంటే, మీరు మసాలా తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు.
ఎంత డబ్బు పెట్టుబడి పెట్టాలి
ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) నివేదికలో, సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు పూర్తి బ్లూప్రింట్ తయారు చేయబడింది. ఈ నివేదిక ప్రకారం.. సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో 300 చదరపు అడుగుల బిల్డింగ్ షెడ్డు ఏర్పాటుకు రూ.60,000, పరికరాలు రూ.40,000. ఇది కాకుండా పనులు ప్రారంభించేందుకు అయ్యే ఖర్చుకు రూ.2.50 లక్షలు అవసరం. ఈ మొత్తంలో మీ వ్యాపారం ప్రారంభమవుతుంది.
Business Idea: ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే సర్కార్ సాయం.. లక్షల కొద్దీ సంపాదన.. తెలుసుకోండి
నిధులు ఎలా సమకూర్చుకోవాలి..
మీ వద్ద పెట్టుబడికి అంత మొత్తం లేకపోతే.. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి బ్యాంకు నుంచి రుణం కూడా తీసుకోవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి పథకం కింద ఈ వ్యాపారం కోసం రుణం తీసుకోవచ్చు. ఇది కాకుండా.. ముద్ర లోన్ స్కీమ్ సహాయం కూడా తీసుకోవచ్చు.
Money Tips: అప్పుల్లో మునిగిపోకుండా జాగ్రత్త పడాలనుకుంటున్నారా..అయితే ఈ టిప్స్ పాటించండి..
మీరు ఎంత సంపాదిస్తారంటే?
ప్రాజెక్టు నివేదిక ప్రకారం ఏటా 193 క్వింటాళ్ల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతాయి. ఇందులో క్వింటాకు రూ.5400 చొప్పున ఏడాదిలో మొత్తం రూ.10.42 లక్షలు సంపాధించవచ్చు. ఇందులో ఖర్చులన్నీ తీసివేస్తే ఏటా రూ.2.54 లక్షల లాభం వస్తుంది. అంటే నెలకు రూ.21 వేలకు పైగా సంపాదన ఉంటుంది.
Financial Planning: Home Loan తీర్చేసిన తరువాత డబ్బు ఏం చేస్తారు ? ఇలా ప్లాన్ చేసుకోండి ?
లాభాలను ఎలా పెంచుకోవాలి
మీరు అద్దె స్థలంలో కాకుండా మీ ఇంట్లో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే, మీ లాభం మరింత పెరుగుతుందని నివేదికలో చెప్పబడింది. ఇంట్లో వ్యాపారం ప్రారంభించడం వల్ల మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు తగ్గుతుంది. మరియు లాభం పెరుగుతుంది.
మార్కెటింగ్ ద్వారా అమ్మకాలను పెంచుకోండి
మీ ఉత్పత్తి మీ డిజైనర్ ప్యాకింగ్‌లో విక్రయించబడుతుంది. ప్యాకింగ్ కోసం ప్యాకేజింగ్ నిపుణుడిని సంప్రదించండి. తద్వారా వినియోగదారులను ఆక్షించేలా మీ ప్యాకేజింగ్‌ను మెరుగుపరచండి. మీరు మీ ఉత్పత్తిని స్థానిక మార్కెట్‌లో మార్కెట్ చేస్తారు. దీంతో పాటు దుకాణదారులు మరియు వినియోగదారులతో సంబంధాలు ఏర్పరుచుకోండి. ఇది కాకుండా, సంస్థ యొక్క వెబ్‌సైట్‌ను కూడా తయారు చేసి మీ ఉత్పత్తుల గురించి వివరించండి. సోషల్ మీడియా పేజీలను కూడా తయారు చేసి మీ ప్రొడక్టులను ప్రమోట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ప్రొడక్ట్ కు డిమాండ్ పెరిగి లక్షలు, బాగా క్లిక్ అయితే కోట్లల్లో లాభాలు పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business Ideas, Business plan