Home /News /business /

BUSINESS IDEA WE CAN EARN RS 50 THOUSAND WITH THESE WEDDING PLANNING BUSINESS HERE BUSINESS IDEA FULL DETAILS NS

Business Idea: ఈ వ్యాపారానికి పెట్టుబడే ఉండదు.. కానీ, నెలకు రూ.50 వేలకు పైగా ఆదాయం.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సొంతంగా వ్యాపారాన్ని (Own Business) ప్రారంభించాలని మీరు అనుకుంటున్నారా? అయితే రూపాయి కూడా పెట్టుబడి పెట్టే పని లేని ఈ వ్యాపారంపై మీరు ఓ లుక్కేయండి.

  నేటి హడావిడి జీవితంలో ఎవరికీ ఎక్కువ సమయం ఉండడం లేదు. ఒకప్పుడు పెళ్లంటే (Marriage) బంధుమిత్రుల సందడి మధ్య పది రోజుల పాటు పండగ తీరుగా జరిగేది. అయితే ఇప్పుడు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో, కరోనా (Corona) లాంటి పరిస్థితుల్లో ఎంత దగ్గరి వారైనా పెళ్లి సమయానికి వచ్చి పోవడమే కష్టంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వెడ్డింగ్ ప్లానర్స్ (Wedding Planners) సంస్కృతి వచ్చింది. అలంకరణ, వేధిక, భోజనాలు ఇలా అన్నింటినీ వారే చూసుకుంటున్నారు. ఇందుకు సరిపడా డబ్బులను ముందే మాట్లాడుకుని తీసుకుంటారు వెడ్డింగ్ ప్లానర్స్. వెడ్డింగ్ ప్లానర్లలో చాలా రకాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వారు ఆహారం, వెయిటర్లు, టెంట్లు మొదలైన ప్రాథమిక వివాహ సౌకర్యాలను అందిస్తారు. మరి కొంతమంది వెడ్డింగ్ ప్లానర్లు మొత్తం పెళ్లిని ప్లాన్ చేస్తారు. పెళ్లికి సంబంధించిన ప్రతి చిన్న పని వారే చేస్తారు.

  దీంతో ఇప్పుడు వెడ్డింగ్ ప్లానర్ అనేది కెరీర్ ఆప్షన్‌గా కూడా మారింది. దానికి రోజు రోజుకూ డిమాండ్ పెరగడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. మీరు ఈ వ్యాపారం చేయాలనుకుంటే మీరు వెడ్డింగ్ ప్లానింగ్ కు సంబంధించి ఏదైనా కోర్సు లేదా డిప్లొమా చేయాలి. చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్నాయి. వెడ్డింగ్ ప్లానర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కాకుండా, మీరు వెడ్డింగ్ ప్లానర్ కంపెనీలో ఉద్యోగం చేయడం ద్వారా అనుభవం పొందినా ఈ వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు.
  Business Idea - Farming: ఈ పండును సాగు చేస్తే ఎకరానికి అరకోటికి పైగా ఆదాయం.. ఎలానో తెలుసుకోండి

  వెడ్డింగ్ ప్లానర్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీకు తప్పనిసరిగా కార్యాలయం ఉండాలి. ప్రారంభంలో, మీరు ఇంటి వద్ద కూడా కార్యాలయాన్ని తయారు చేసుకోవచ్చు. దీని తర్వాత, మీరు భోజనాలు(క్యాటరింగ్), టెంట్ హౌస్‌లు, వివాహ అలంకరణ, బ్యాండ్‌లు మరియు DJ సౌండ్‌ను అందించే వ్యక్తులతో మాట్లాడుకుని అగ్రిమెంట్ చేసుకోవాలి. మీరు ఈ వ్యక్తులను మీ ఉద్యోగంలో ఉంచకుండా కమీషన్ ప్రాతిపదికన కూడా నియమించుకోవచ్చు.
  Business Idea: ఈ బిజినెస్ కు పెట్టుబడి కేవలం రూ. 50 వేలే.. లక్షల్లో ఆదాయం పొందే ఛాన్స్.. వివరాలివే

  మీరు వివాహంలో మీకు సేవ చేసే వ్యక్తులను జోడించినప్పుడు... మీరు మీ క్లయింట్‌లను కనుగొనవలసి ఉంటుంది. క్లయింట్ యొక్క బడ్జెట్ ప్రకారం మీరు అతనికి మీ సేవను అందించవచ్చు. మీ వ్యాపారం బాగా సాగిన తర్వాత.. భోజనాలు (క్యాటరింగ్), డెకరేటర్లు తయారు చేసే వ్యక్తులను జీతంపై మీతో ఉంచుకోవచ్చు. మీరు DJ సౌండ్ సిస్టమ్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ, వీటిలో ఖర్చులు ఎక్కువ కాబట్టి వీటన్నింటిని వ్యాపారం బాగా సాగిన తర్వాతనే ఏర్పాటు చేసుకోవాలి.

  పెట్టుబడి ఎంత?
  వెడ్డింగ్ ప్లానర్ వర్క్ కూడా చిన్న స్థాయిలో ప్రారంభించవచ్చు. ఈ పని చేయడానికి అనుభవం అవసరం. క్లయింట్‌లను రప్పించుకుని పెళ్లిళ్లను చక్కగా నిర్వహించగలమని మీరు భావిస్తే, మీరు పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రారంభంలో 0-లక్ష రూపాయలు ఉంటే మీరు ఈ పనిని ప్రారంభించవచ్చు. ఈవెంట్ ఆర్డర్ ద్వారా మీరు తీసుకున్న అడ్వాన్స్ నే పెట్టుబడిగా కూడా మార్చుకుని వ్యాపారం ప్రారంభించుకోవచ్చు కూడా. ఆ డబ్బులనే డెకరేషన్, భోజనాలకు మీరు అడ్వాన్స్డ్ గా ఇచ్చుకోవచ్చు.

  మీరు ఎంత సంపాదించవచ్చు?
  భారతదేశంలో సంవత్సరానికి 2-3 సార్లు వివాహ సీజన్ వస్తుంది. మీకు మంచి పరిచయాలు ఉంటే, మీరు నాణ్యమైన సేవను అందించడం ద్వారా ప్రారంభంలో సంవత్సరంలో ఐదు-ఆరు మంచి వివాహాల కోసం ఆర్డర్‌లను పొందినట్లయితే, మీరు ఒక వివాహానికి 1 లక్ష రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. అంటే నెలకు 50 వేలు పొందొచ్చన్నమాట. పెళ్లిళ్లే కాకుండా ఈ రోజుల్లో బర్త్‌డే పార్టీ, ఫేర్‌వెల్ పార్టీ లాంటి ఈవెంట్ ల నిర్వహణ కూడా ప్రొఫెషనల్ వ్యక్తులకే ఇస్తున్నారు. ఇలాంటి ఈవెంట్స్ ఆర్డర్లను పొంది డబ్బు సంపాదించవచ్చు.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Business Ideas, Investment Plans

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు