హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: వ్యాపారం చేయాలనుకుంటున్నవారికి TSRTC గుడ్ న్యూస్.. MGBSలో బిజినెస్ చేసే ఛాన్స్.. పూర్తి వివరాలివే

Business Idea: వ్యాపారం చేయాలనుకుంటున్నవారికి TSRTC గుడ్ న్యూస్.. MGBSలో బిజినెస్ చేసే ఛాన్స్.. పూర్తి వివరాలివే

ఫొటో: ట్విట్టర్

ఫొటో: ట్విట్టర్

తెలంగాణ ఆర్టీసీ (TSRTC) మీరు వ్యాపారాన్ని నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టాండ్ లో మీరు వ్యాపారం చేయొచ్చు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ఈ రోజుల్లో సొంతంగా వ్యాపారం (Business) చేయాలనుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కరోనా వచ్చిన తర్వాత మారిన పరిస్థితులే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం అయితేనే మేలు అని యువకులు అనుకుంటున్నారు. అయితే.. ఏ వ్యాపారం బాగుంటుంది? ఎక్కడ చేయాలి? ఎలా చేయాలి? అనేది తెలియక అనేక మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్. తెలంగాణ ఆర్టీసీ (TSRTC) మీరు వ్యాపారాన్ని నిర్వహించే అవకాశాన్ని కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత రద్దీగా ఉండే హైదరాబాద్ లోని మహాత్మాగాంధీ బస్ స్టాండ్ లో (MGBS) మీరు వ్యాపారం చేయొచ్చు. బస్టాండ్ లోని స్టాల్స్ లో బేకరీ, స్వీట్ షాప్, సూపర్ మార్కెట్, ఫుట్ వేర్, బ్యాగ్స్, టీ, స్నాక్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల విక్రయ కేంద్రం నిర్వహించుకోవచ్చు.

  ఇంకా.. చిన్నపిల్లల బొమమ్ల షాప్ లు, కేఎఫ్సీ, చాట్ బండార్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ, కూల్ డ్రింక్స్, ఫ్యాన్సీ&జనరల్ స్టోర్స్, ఫోర్ వీలర్ పార్కింగ్, గోడౌన్ నిర్వహణకు స్టాల్స్ ను వేలం వేస్తోంది ఆర్టీసీ. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటన విడుదల చేశారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం 4 గంటలలోగా టెండర్ వేసు కోవాల్సి ఉంటుంది.

  TSRTC Tiranga Rally: హైదరాబాద్ రోడ్లపై నిజాం కాలం నాటి బస్సు.. ఆర్టీసీ తిరంగ ర్యాలీలో స్పెషల్ అట్రాక్షన్.. ఇదిగో వీడియో

  ‘‘నగరం నడబొడ్డున, రాష్ట్రంలోని ప్రజలందరూ మీకు వినియోగదారులే అయితే ! వ్యాపారం చేసేందుకు ఇంతకంటే అనువైన స్థలం ఉంటుందా? ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకొండి..’’ అంటూ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు మరిన్ని వివరాలకు https://www.tsrtc.telangana.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.

  ఆసక్తి కలిగిన వారు.. ఈ లింక్ https://www.tsrtc.telangana.gov.in/stallsshopsforrent.php ద్వారా నేరుగా టెండర్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. టెండర్ డాక్యుమెంట్ ఫీజుగా ప్రతీ స్టాల్ కు రూ.1800 డీడీ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఒకటి కన్నా ఎక్కువ స్టాల్స్ కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ప్రతీ స్టాల్ కు ప్రత్యేకమైన దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేసింది తెలంగాణ ఆర్టీసీ.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Business Ideas, Hyderabad, Sajjanar, Tenders, Tsrtc

  ఉత్తమ కథలు