Home /News /business /

BUSINESS IDEA START TOMATO KETCHUP PLANT WITH HELP OF MUDRA LOAN SCHEME YOU CAN EARN 50000 PER MONTH SK

Business Ideas: రూ.5కే కిలో టమోటా.. ఇలా చేస్తే సొంతూరిలోనే నెలకు రూ.50వేల ఆదాయం

కన్నీరు పెట్టిస్తున్న టమాటా

కన్నీరు పెట్టిస్తున్న టమాటా

Business Ideas | Tomato Sause unit: ప్రధాన మంత్రి ముద్ర నివేదిక ప్రకారం.. రూ.7.82 లక్షల పెట్టుబడితో ఏర్పాటు చేసిన టమోటా సాస్ యూనిట్ వార్షిక టర్నోవర్ రూ.28.80 లక్షలు. ఇందులో వార్షిక వ్యయం రూ.22.80 లక్షలు తీసివేస్తే.. మీకు రూ.6 లక్షలు మిగులుతాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఏదైనా మంచి వ్యాపారం చేయాలని భావిస్తున్నారా? ఏ వ్యాపారం చేస్తే బాగుటుందని ఆలోచిస్తున్నారా? మీకోసమే ఈ బిజినెస్ ఐడియా (Business Ideas) తీసుకొచ్చాం. ప్రస్తుతం మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పడిపోయాయి. పంట బాగా పండినా.. వాటికి సరైన ధర లభించడం లేదు. అందుకే చాలా మంది రైతులు వాటిని పారబోస్తున్నారు. టమోటా ధరలు (Tomato Price) ఒక్కో సీజన్లో ఒక్కోలా ఉంటాయి. ఒకసారి కేజీ వంద రూపాయల వరకు వెళ్తే.. ఒక్కోసారి రూపాయికి పడిపోతుంది. ఇప్పుడు కూడా ధరలు బాగా తగ్గాయి.  రూ.5కే కిలో టమోటా లభిస్తోంది.  ఇలా ధర తక్కువగా ఉన్నప్పుడు టమోటాలను సేకరించి.. వాటితో సాస్‌లు తయారు చేసి విక్రయిస్తే.. మంచి లాభాలు ఉంటాయి. మీరు ఉన్న ప్రాంతంలోనే టమోటా సాస్ (Tomato Sause Unit) తయారీ యూనిట్‌ ప్రారంభిస్తే.. ఆదాయం బాగా వస్తుంది.

    SBI Loan: గుడ్ న్యూస్... ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా ఎస్‌బీఐ నుంచి రుణాలు

    టమోటాను దాదాపు అన్ని ఆహార పదార్థాల్లో వాడుతారు. పిజ్జాలు, బర్గర్‌లు, నూడుల్స్, ఫ్రైడ్ రైస్ వంటి వంటకాల్లో టమోటా సాస్ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అందుకే ఏడాదిలో 12 నెలలూ దీనికి డిమాండ్ ఉంటుంది. అనేక రకాల ఫాస్ట్ ఫుడ్స్‌లో వినియోగించడం వల్ల ఏటేటా టమోసా సాస్, కెచప్‌కు డిమాండ్ పెరుగుతోంది. పెద్ద నగరాలే కాదు.. చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. అందువల్ల టమోటాలతో సాస్ వ్యాపారం చేస్తే మంచి లాభాలు సంపాదించవచ్చు.

    Business Ideas: ఇంట్లో ఉంటూనే వ్యాపారం.. తక్కువ పెట్టుబడితో లక్షల్లో ఆదాయం

    టమోటా సాస్ తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.7.82 లక్షల మేర ఖర్చవుతుంది. ఇందులో 1.95 లక్షలు మీరు పెట్టుబడిగా పెట్టాలి. మిగిలిన డబ్బులను ముద్రలోన్ కింద ప్రభుత్వం నుంచి రుణం తీసుకోవచ్చు. సాస్ తయారీ యూనిట్‌కు అవసరమైన యంత్రాలు, పరికరాలకు రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. టమోటాలు, ఇతర ముడి సరుకు, పనివారి జీతం, ప్యాకింగ్, అద్దె వంటి వాటికి రూ.5.82 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. టమోటా సాస్ యూనిట్ ఏర్పాటుకు స్థలం కూడా పెద్దగా అవసరం లేదు. చిన్న స్థలంలోనే ఏర్పాటు చేయవచ్చు.



    సాస్ తయారు చేసేందుకు..ముందుగా బాగా పండిన టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. వాటిని అధిక ఉష్ణోగ్రత వద్ద ఆవిరి కేటిల్‌లో ఉడకబెట్టాలి. అనంతరం గుజ్జు నుంచి తొక్క, విత్తనాలను వేరు చేయాలి. ఆ గుజ్జుకు అల్లం వెల్లుల్లి, లవంగాలు, ఎండు మిర్చి, ఉప్పు, పంచదాన, వెనిగర్ కలిపి సాస్ తయారుచేస్తారు. ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ప్రధాన మంత్రి ముద్ర నివేదిక ప్రకారం.. రూ.7.82 లక్షల పెట్టుబడితో ఏర్పాటు చేసిన టమోటా సాస్ యూనిట్ వార్షిక టర్నోవర్ రూ.28.80 లక్షలు. ఇందులో వార్షిక వ్యయం రూ.22.80 లక్షలు తీసివేస్తే.. మీకు రూ.6 లక్షలు మిగులుతాయి. అంటే.. ప్రతి నెలా మీ ఆదాయం రూ.50వేలన్నమాట.

    (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Agriculture, Business, Business Ideas, Tomato Price

    తదుపరి వార్తలు