హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: అన్ని సీజన్స్‌లో చేయగలిగే అద్భుతమైన వ్యాపారం.. నెలకు లక్ష రూపాయలు పక్కా

Business Ideas: అన్ని సీజన్స్‌లో చేయగలిగే అద్భుతమైన వ్యాపారం.. నెలకు లక్ష రూపాయలు పక్కా

Business Ideas | Tissue paper unit: ఏడాదిలో దాదాపు రూ.97.50 లక్షల టర్నోవర్ చేయవచ్చు. ఇందులో ఖర్చులన్నీ తీసేస్తే.. ఏటా దాదాపు 10-12 లక్షల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

Business Ideas | Tissue paper unit: ఏడాదిలో దాదాపు రూ.97.50 లక్షల టర్నోవర్ చేయవచ్చు. ఇందులో ఖర్చులన్నీ తీసేస్తే.. ఏటా దాదాపు 10-12 లక్షల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

Business Ideas | Tissue paper unit: ఏడాదిలో దాదాపు రూ.97.50 లక్షల టర్నోవర్ చేయవచ్చు. ఇందులో ఖర్చులన్నీ తీసేస్తే.. ఏటా దాదాపు 10-12 లక్షల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

  మీరు గ్రాడ్యుయేషన్ చేయలేదా? ఒకవేళ డిగ్రీ పట్టా ఉన్నా.. ఉద్యోగం రావడం లేదా? ఉద్యోగ ప్రయత్నాలు మానేసి.. వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా? మీకోసమే ఈ బిజినెస్ ఐడియా. మీరు టిష్యూ పేపర్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అన్ని సీజన్లలో వీటికి డిమాండ్ ఉంటుంది. ఎప్పుడైనా దీనిని ప్రారంభించవచ్చు. పెట్టుబడికి డబ్బులు ఎక్కువగా లేకుంటే.. ప్రభుత్వం లోన్స్ కూడా ఇస్తుంది. టిష్యూ పేపర్ యూనిట్ ద్వారా భారీ మొత్తంలో మీకు లాభాలు వచ్చే అవకాశముంది. మరి ఈ యూనిట్‌కు ఎంత ఖర్చవుతుంది? ఎంత ఆదాయం వస్తుంది? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

  ప్రస్తుతం టిష్యూ పేపర్ వాడకం బాగా పెరిగింది. సాధారణంగా చేతులు, నోటిని శుభ్రం చేయడానికి టిష్యూ పేపర్‌ని ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో రెస్టారెంట్, హోటల్, ధాబా, ఆఫీసు, హాస్పిటల్ ఇలా దాదాపు అన్ని చోట్లా టిష్యూ పేపర్‌ను వాడుతున్నారు. అందుకే వీటికి అన్ని వేళలా డిమాండ్ ఉంటుంది. మీరు నేరుగా హోటల్స్, హాస్పిటల్స్, ఆఫీసులతో మాట్లాడి.. టిష్యూ పేపర్ సరఫరా చేయవచ్చు. లేదంటే సూపర్ మార్కెట్‌ ద్వారా కూడా అమ్ముకోవచ్చు. ఆన్‌లైన్ వేదికగా విక్రయాలు జరపవవచ్చు. మార్కెటింగ్ కోసం ఆరంభంలో కొంత స్టడీ చేస్తే.. ఆ తర్వాత బాగా ఆదాయం వస్తుంది.

  RBI Good News: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్... ఇక ఇలా కూడా డబ్బులు డ్రా చేయొచ్చు

  టిష్యూ పేపర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలంటే దాదాపు రూ.3.50 లక్షలు వరకు మీ వద్ద ఉండాలి. ఇంత డబ్బును సమకూర్చుకున్న తర్వాత .. ఏదైనా బ్యాంకులో ముద్ర పథకం కింద రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ వద్ద ఇప్పటికే రూ. 3.50 లక్షలు ఉన్నందున... బ్యాంకు నుంచి దాదాపు రూ. 3.10 లక్షల టర్మ్ లోన్, రూ. 5.30 లక్షల వరకు వర్కింగ్ క్యాపిటల్ లోన్‌గా పొందువచ్చు. మంత్రాలతో ఏటా 1.50 లక్షల కిలోల పేపర్ నాప్‌కిన్‌లను ఉత్పత్తి చేయవచ్చు. కిలో టిష్యూ పేపర్‌ని రూ.65 చొప్పున మార్కెట్‌లో విక్రయించవచ్చు. ఈ లెక్కన ఏడాదిలో దాదాపు రూ.97.50 లక్షల టర్నోవర్ చేయవచ్చు. ఇందులో ఖర్చులన్నీ తీసేస్తే.. ఏటా దాదాపు 10-12 లక్షల రూపాయలు ఆదా చేసుకోవచ్చు.

  RBI Good News: హోమ్ లోన్ కస్టమర్లకు ఆర్‌బీఐ నుంచి గుడ్ న్యూస్

  టిష్యూ పేపర్ యూనిట్‌కు రుణం కోసం మీరు ప్రధాన మంత్రి ముద్రా యోజన కింద ఏదైనా బ్యాంకులో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఫామ్ నింపాల్సి ఉంటుంది. అందులో అన్ని వివరాలు నమోదు చేయాలి. పేరు, చిరునామా, వ్యాపార చిరునామా, విద్య, ప్రస్తుత ఆదాయం, ఎంత రుణం అవసరం వంటి వివరాలను ఇవ్వాలి. దీనికి ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేదా గ్యారెంటీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రుణ మొత్తాన్ని సులభమైన వాయిదాలలో తిరిగి చెల్లించవచ్చు. వ్యాపారం బాగా జరిగితే.. కొన్ని నెలల్లోనే మీ అప్పు మొత్తం తీరుతుంది. ఆ తర్వాత నుంచి భారీగా ఆదాయం పొందవచ్చు. ఆరంభంలో కాస్త కష్టపడితే పనిచేస్తే.. మీకు నెలకు లక్ష రూపాయల వరకు ఆదాయం ఎక్కడికీ పోదని నిపుణులు చెబుతున్నారు.

  (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

  First published:

  Tags: Business, Business Ideas, Personal Finance

  ఉత్తమ కథలు