హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: ఈ వ్యాపారానికి పెట్టుబడి కేవలం రూ.2 లక్షలే.. కానీ, నెలకు రూ.50 వేల ఆదాయం.. ఓ లుక్కేయండి

Business Idea: ఈ వ్యాపారానికి పెట్టుబడి కేవలం రూ.2 లక్షలే.. కానీ, నెలకు రూ.50 వేల ఆదాయం.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే.. తక్కువ పెట్టుబడితో ప్రారంభించగలిగే ఈ వ్యాపారంపై ఓ లుక్కేయండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

మనలో చాలా మంది కొత్త వ్యాపారాన్ని (New Business) ప్రారంభించాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. కానీ ఎలాంటి వ్యాపారం చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వారి కోసం ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా (Business Idea). ఈ రోజుల్లో వంట నూనెకు విపరీతమైన ధర ఉండడంతో దానిని కొనాలంటేనే భయపడుతున్నారు సామాన్య ప్రజలు. ఈ నేపథ్యంలో వంట నూనె (Oil) తయారు చేయడాన్ని వ్యాపారంగా మార్చుకుంటే మంచి ఆదాయం సాధించవచ్చు. ఈ వ్యాపారాన్ని గ్రామం లేదా నగరం ఎక్కడైనా ప్రారంభించవచ్చు. గతంలో ఆయిల్ మిల్లులు ప్రారంభించాలనుకుంటే.. చాలా డబ్బులు ఖర్చయ్యేవి. అధికంగా ప్లేస్ కూడా అవసరం అయ్యేవి. ఇప్పుడు మార్కెట్లోకి పోర్టబుల్ మెషీన్లు రావడంతో తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అదనంగా, ఈ ఆధునిక యంత్రాలు పనిచేయడానికి ఎక్కువ శ్రమ కూడా అవసరం లేదు. ఆయిల్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి చమురు శుద్ధి కర్మాగారం, కొంచెం పెద్ద ఇల్లు మరియు ఆయిల్ తయారు చేయడానికి అవసరమైన పంట అంటే వేరుశనగ, నువ్వులు లాంటి ధాన్యాలు అవసరం. ఆధునిక యంత్రాల సహాయంతో పై ధాన్యాల నూనెను అతి తక్కువ సమయంలో చాలా సులభంగా తీయవచ్చు.

వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీరు ముందుగా మీడియం సైజు యంత్రాన్ని కొనుగోలు చేయాలి. వ్యాపార లాభాలు పెరిగితే పెద్ద యంత్రాలను తర్వాత కొనుగోలు చేయవచ్చు. ఆయిల్ తయారు చేసే మెషిన్ ధర దాదాపు రూ.2 లక్షలుగా ఉంటుంది. ఆయిల్ మిల్లు వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు లైసెన్స్‌తో సహా కొన్ని ప్రభుత్వ పత్రాలను సేకరించాల్సి ఉంటుంది. మొత్తం మీద మొత్తం 3-4 లక్షల రూపాయల పెట్టుబడి అవసరమవుతుంది. నూనె నాణ్యత బాగుండి, కస్టమర్లను ఆకర్షించగలిగితే వ్యాపారంలో చాలా వేగంగా లాభం పొందవచ్చు.

Business Idea: ఇంటి నుంచే ఈ బిజినెస్ చేయొచ్చు.. నెలకు కనీసం రూ. 20 వేలు పొందే ఛాన్స్.. వివరాలివే

నూనె వ్యాపారంలో అత్యంత ముఖ్యమైన విషయం వినియోగదారులను ఆకట్టుకోవడం. వ్యాపారం యొక్క ఆదాయం మరియు లాభం వినియోగదారులపై ఆధారపడి ఉంటుంది. ఆయిల్ ను అవుట్‌లెట్‌గా లేదా దుకాణదారులతో ఒప్పందం ద్వారా విక్రయించవచ్చు. నూనె తయారీలో మిగిలిన వ్యర్థాలను పశువుల దాణాకు విక్రయించుకోవచ్చు. చమురు వ్యాపార ఆదాయం డిమాండ్ తో పాటు.. ముడి పదార్థాల ధరపై కూడా ఆధారపడి ఉంటుంది. ముడిసరుకు ధర తక్కువగా ఉంటే ఎక్కువ లాభం పొందవచ్చు. మీ వ్యాపారం మంచిగా సాగితే.. నెలకు కనీసం రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు సంపాధించవచ్చు.

First published:

Tags: Business Ideas, Investment Plans

ఉత్తమ కథలు