Business Idea: రూ.1 లక్ష పెట్టుబడితో నెలకు రూ.14 వేల ఆదాయం

మీరు తయారు చేసిన వస్తువుల్ని మార్కెట్ చేయగలిగితే భారీ స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. ఈ వ్యాపారం కోసం రూ.3.30 లక్షలు అవసరమౌతాయి. మీరు రూ.1 లక్ష పెట్టుబడి పెడితే మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి అప్పుగా తీసుకోవచ్చు.

news18-telugu
Updated: February 24, 2019, 7:36 AM IST
Business Idea: రూ.1 లక్ష పెట్టుబడితో నెలకు రూ.14 వేల ఆదాయం
Business Idea: రూ.1 లక్ష పెట్టుబడితో నెలకు రూ.14 వేల ఆదాయం
news18-telugu
Updated: February 24, 2019, 7:36 AM IST
ఉద్యోగం లేదా? ఉద్యోగం కోసం ప్రయత్నించీ ప్రయత్నించీ విసిగిపోయారా? సొంతగా ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుందామనుకుంటున్నారా? తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. మీరు రూ.1 లక్ష పెట్టుబడి పెట్టగలిగితే నెలకు రూ.14 వేలు సంపాదించొచ్చు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ముద్ర పథకం ఇందుకు ఉపయోగపడుతోంది. మీ దగ్గర రూ.1 లక్ష ఉంటే చాలు. సొంతగా వ్యాపారం మొదలుపెట్టొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

Read this: PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి

ఏ వ్యాపారం చేయొచ్చు?



ముద్ర స్కీమ్‌లోని ఓ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం మెటల్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేసే యూనిట్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇందులో చేతి పనిముట్లు, వంట సామాగ్రి, వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు తయారు చేయాల్సి ఉంటుంది. మీరు తయారు చేసిన వస్తువుల్ని మార్కెట్ చేయగలిగితే భారీ స్థాయిలో వ్యాపారాన్ని విస్తరించుకోవచ్చు. ఈ వ్యాపారం కోసం రూ.3.30 లక్షలు అవసరమౌతాయి. మీరు రూ.1 లక్ష పెట్టుబడి పెడితే మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి అప్పుగా తీసుకోవచ్చు.



Read this: LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చు

small business idea, new business idea, investment ideas, business ideas, mudra scheme projects, mudra loans, ముద్ర లోన్లు, బిజినెస్ ఐడియాలు, బిజినెస్ ప్రాజెక్ట్స్


వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలి?

Loading...
యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ.1.80 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో మెషినరీ, వెల్డింగ్ సెట్, బఫింగ్ మోటార్, డ్రిల్లింగ్ మెషీన్, బెంచ్ గ్రైండర్, హ్యాండ్ డ్రిల్లింగ్, హ్యాండ్ గ్రైండర్, బెంచ్, ప్యానెల్ బోర్డ్, ఇతర పరికరాలు వస్తాయి.

రా మెటీరియల్‌కు రూ.1.20 లక్షలు ఖర్చవుతుంది. రెండు నెలలకు సరిపోయే రా మెటీరియల్ వస్తుంది. వాటితో ప్రతీ నెల రూ.40 వేల విలువైన వంట సామాగ్రి, రూ.20 వేల విలువైన హ్యాండ్ టూల్స్, రూ.20 వేల విలువైన వ్యవసాయ పనిముట్లు తయారు చేయొచ్చు.

జీతభత్యాలు, ఇతర ఖర్చులు నెలకు రూ.30 వేలు. మొత్తం ఖర్చు రూ.3.30 లక్షలు.

Read this: IRCTC APP: ఐఆర్‌సీటీసీ మొబైల్ యాప్‌‌తో ఉపయోగాలు ఇవే...

small business idea, new business idea, investment ideas, business ideas, mudra scheme projects, mudra loans, ముద్ర లోన్లు, బిజినెస్ ఐడియాలు, బిజినెస్ ప్రాజెక్ట్స్


లాభం ఎలా వస్తుంది?


ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారం సేల్స్ టర్నోవర్ నెలకు రూ.1.10 లక్షలు ఉంటుందని అంచనా. ఉత్పత్తి ఖర్చు రూ.91,833 అవుతుంది. అంటే లాభం రూ.18,167. తీసుకున్న లోన్‌పై 13% బ్యాంకు వడ్డీ రూ.2,340. ప్రోత్సాహకం 1% ఇస్తే రూ.1,100 కలిసొస్తుంది. ఈ లెక్కన నెలకు రూ.14,427 లాభం వస్తుంది.

ముద్ర స్కీమ్‌కు ఎలా అప్లై చేయాలి?


మీరు ఏ బ్యాంకులో అయినా ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద లోన్‌కు దరఖాస్తుచేసుకోవచ్చు. మీ పేరు, అడ్రస్, చేయాలనుకునే వ్యాపారం, విద్యార్హతలు, ప్రస్తుత ఆదాయం, రుణం ఎంత కావాలి అన్న వివరాలు వెల్లడించాలి. లోన్ కోసం ఎలాంటి గ్యారెంటీ, ప్రాసెసింగ్ ఫీజు అవసరం లేదు.

ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా పెళ్లి శుభలేఖ


ఇవి కూడా చదవండి:

SBI Card: మీ ఎస్‌బీఐ కార్డు పోయిందా? వెంటనే ఇలా బ్లాక్ చేయొచ్చు

WhatsApp Bug: మీ వాట్సప్‌లో బగ్ ఉందా? మీ ప్రైవసీకి ముప్పేనా?
First published: February 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...