హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: త్వరలో సమ్మర్.. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మస్త్ లాభాలు.. ఓ లుక్కేయండి

Business Idea: త్వరలో సమ్మర్.. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మస్త్ లాభాలు.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సొంతంగా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. మీరు బిజినెస్ చేయాలనుకుంటే.. సీజన్‌కు అనుగుణంగా వ్యాపారం చేయడం మంచిది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సొంతంగా వ్యాపారం (Business Idea) చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. మీరు బిజినెస్ (Business) చేయాలనుకుంటే.. సీజన్‌కు అనుగుణంగా వ్యాపారం చేయడం మంచిది. ఇందులో నష్టాలు కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే, లాభం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు చాలా తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అదే.. ఐస్ క్రీమ్ పార్లర్ బిజినెస్. ముఖ్యంగా వేసవి రోజులలో ఈ వ్యపారానికి డిమాండ్ చాలా పెరుగుతుందని తెలుసుకోవాలి. దీన్ని ప్రారంభించడానికి అవసరమైన పెట్టుబడి విషయానికొస్తే, మీరు 10-20 వేల రూపాయల సాధారణ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

వ్యాపారం పెరిగే కొద్దీ ఎక్కువ పెట్టుబడి పెట్టవచ్చు. దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ ఈ వ్యాపారం సాగుతోంది. అయినప్పటికీ.. ఈ వ్యాపారాన్ని ఎక్కడైనా ప్రారంభించడానికి అవకాశం ఉంది. మీరు 300-400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐస్ క్రీమ్ పార్లర్‌ను ప్రారంభింవచవచ్చు. ఇందులో 5-10 మందికి సీటింగ్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) నివేదిక ప్రకారం.. దేశంలో ఐస్ క్రీం వ్యాపారం ఈ ఏడాది చివరి నాటికి $1 బిలియన్ దాటుతుంది.

Business Idea: ఇంటి నుంచే చేసే బిజినెస్.. నెలకు కనీసం రూ. 20 వేల ఆదాయం.. తెలుసుకోండి

15 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్

ఐస్ క్రీమ్ పార్లర్ కోసం.. మీరు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుండి లైసెన్స్ తీసుకోవాలి. ఇది 15 అంకెల రిజిస్ట్రేషన్ నంబర్. మీ స్థలంలో తయారుచేసిన ఆహార పదార్థాలు దాని నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని ఇది నిర్ధారిస్తుంది. మీరు అమూల్ ఐస్ క్రీమ్ పార్లర్‌ను ఫ్రాంఛైజింగ్ చేసే అవకాశం కూడా ఉంది. ఇందుకోసం కనీసం 300 చదరపు అడుగుల స్థలం కావాలి. ఐస్ క్రీం వ్యాపారంలో లాభాలు మీరు తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలను ఉపయోగిస్తున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

First published:

Tags: Business Ideas, Investment Plans