హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: ఈ సాగుతో 4 నెలల్లోనే రూ.8 లక్షల ఆదాయం.. కోటీశ్వరులను చేసే పంట.. తెలుసుకోండి

Business Idea: ఈ సాగుతో 4 నెలల్లోనే రూ.8 లక్షల ఆదాయం.. కోటీశ్వరులను చేసే పంట.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీరు కూడా కొత్త రకం వ్యవసాయాన్ని చేయాలని భావిస్తూ ఉంటే.. తక్కువ పెట్టుబడితో దోససాగును ప్రారంభించండి. ఈ సాగు ద్వారా లక్షల రూపాయలను సంపాధించవచ్చు.

  ఐదారేళ్ల క్రితం వరకు వ్యవసాయం (agriculture) అంటే.. నష్టంతో కూడుకున్నదన్న అభిప్రాయం బలంగా వ్యక్తం అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. వ్యవసాయ రంగంలో వస్తున్న యువత సాగును కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. కొత్త కొత్త పంటలను సాగుచేస్తూ లక్షల రూపాయలను సంపాధిస్తున్నారు. మీరు కూడా కొత్త రకం వ్యవసాయాన్ని చేయాలని భావిస్తూ ఉంటే.. తక్కువ పెట్టుబడితో దోససాగును ప్రారంభించండి. ఈ సాగు ద్వారా లక్షల రూపాయలను సంపాధించవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైతు తన పొలంలో దోసకాయలను పండించాడు. తద్వారా కేవలం 4 నెలల్లోనే రూ.8 లక్షలు సంపాదించాడు. ఇందుకోసం నెదర్లాండ్స్‌ నుంచి దోసకాయ విత్తనాన్ని తెప్పించి తన చేనులో నాటాడు. ఈ దోసకాయలలో విత్తనాలు అస్సలు ఉండవు. అందువల్ల, రెస్టారెంట్లు మరియు హోటళ్ల నుంచి ఇటువంటి దోసకాయలకు భారీ డిమాండ్ ఉంది. ఇతర దోసకాయల కంటే వీటికి అధిక ధరలు కూడా లభిస్తున్నాయి. ఈ వ్యాపారం కోసం రైతు ప్రభుత్వం నుంచి రూ.18 లక్షలు గ్రాంట్ తీసుకుని పొలంలో షెడ్ నెట్ హౌస్ నిర్మించుకున్నాడు ఆ రైతు.

  ఈ దోసకాయను ఏ రకమైన నేలలోనైనా పండించవచ్చు. కేవలం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే కాదు.. పట్టణ ప్రాంతాల్లోనూ దోసకాయను ఉత్పత్తి చేయడం సాధ్యపడుతుంది. దోసకాయ పంట 60 నుండి 80 రోజులలో చేతికి వస్తుంది. ఈ సాగు కోసం భూమి యొక్క pH 5.5 నుండి 6.8 వరకు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడు భూమి మంచిదిగా పరిగణించబడుతుంది. దోసకాయను నదులు లేదా సరస్సుల ఒడ్డున కూడా పండించవచ్చు. వేసవిలో దోసకాయకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం దోసకాయను ప్రతీ సలాడ్ లో ఉపయోగిస్తారు. దోసకాయను పార్టీల్లోనూ వడ్డించడం ఇటీవల ఎక్కువైంది. దీంతో దోసకాయకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది.

  Business Ideas: రైతులను లక్షాధికారులను చేసే 3 రకాల ఆకులు.. వీటితో ఊహించనంత ఆదాయం

  మీకు తక్కువ డబ్బు ఉన్నప్పటికీ.. మీరు దోసకాయ వ్యవసాయం నుండి మంచి లాభం పొందవచ్చు. అంతే కాకుండా ప్రభుత్వం నుంచి కొంత సబ్సిడీతో ఈ వ్యవసాయం చేసుకోవచ్చు. మార్కెట్‌లో సాధారణ దోసకాయ కిలో రూ.50 వరకు ఉంది. దోసకాయ ఉత్పత్తి రైతులకు ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఈ పొలం నుంచి దోస సాగు ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాధించవచ్చు. వాస్తవానికి, మీ ప్రాంతంలోని మార్కెట్‌పై మంచి అధ్యయనం అనంతరం ఈ సాగును ప్రారంభిస్తే మంచి లాభాలను ఆర్జించవచ్చు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Agriculture, Business Ideas

  ఉత్తమ కథలు