మీరు నిరుద్యోగులైనా, ఉద్యగం చేస్తూనే అదనపు సంపాదన పొందాలనుకున్నా తక్కువ పెట్టుబడితో కూడిన వ్యాపారాలు ఎప్పుడూ ఉత్తమమైనవే. అలాంటి ఓ బిజినెస్ ఐడియానే ఇవాళ మీకు అందిస్తున్నాం. ఈ వ్యాపారాన్ని వివిధ స్థాయిల్లో ప్రారంభించవచ్చు. తక్కువపెట్టుబడితో ఇంట్లోనే పని చేసుకునేలా మొదలుట్టినా, చిన్నపాటి కార్ఖానాగా చేయాలనుకున్నా సాగించవచ్చు. అదే టీ-షర్ట్ ప్రింటింగ్ వ్యాపారం. కనీసం రూ.70వేలతోనూ టీషర్ట్ ప్రింటింగ్ వ్యాపారాన్ని మొదలుపెట్టి నెలకు రూ.30వేల నుంచి రూ.40 వేలు పొందొంచ్చు. లేదా రూ.2లక్షలతో మొదలుపెడితే లాభాలు కూడా లక్షల్లోనే ఉంటాయి. వివరాలివే..
ప్రస్తుత కాలంలో టీషర్టులు వేసుకోనివారంటూ దాదాపు ఉండరు. అన్ని వయసుల వాళ్లూ వాడబట్టే టీషర్ట్స్ మార్కెట్ ఎవర్ గ్రీన్ గా నిలుస్తోంది. గడిచిన రెండేళ్లుగా కరోనా పరిస్థితుల్లో వర్క్ హోం పెరిగిన తర్వాత ఉద్యోగులు చాలా మంది సాధారణ దుస్తులకంటే టీషర్టులనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం టీషర్టుల ప్రింటింగ్ కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుంటే మీరూ నాలుగురాళ్లు సంపాదించుకోవచ్చు.
టీషర్ట్ ప్రింటింగ్ వ్యాపారాన్ని రూ.70వేల పెట్టుబడితోనూ మొదలుపెట్టొచ్చు. దీని ద్వారా మీరు నెలకు రూ. 30,000-40,000 సులభంగా సంపాదించవచ్చు. టీ-షర్టు ప్రింటింగ్‌కు అవసరమైనవాటిలో ప్రింటర్, టీ-ప్రెస్, కంప్యూటర్, పేపర్, టీ-షర్టుల రూపంలో ముడి పదార్థాలు అవసరం. కొంచెం పెద్ద స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించాలనకుంటే రూ.2లక్షల పెట్టుబడితోనూ దిగొచ్చు. లేదా చిన్నపాటి ఫ్యాక్టరీ మాదిరిగా రూ.5 లక్షలతోనూ చేసుకోవచ్చు. చవకగా లభించే యంత్రాలూ నిమిషానికి ఒకటి చొప్పున టీషర్టులపై ప్రింటింగ్స్ వేయగలవు.
ప్రస్తుతం ఆన్‌లైన్ వ్యాపారం బాగా పెరిగింది. టీషర్టుల ప్రింటింగ్ లో మీరు మీ స్వంత బ్రాండ్‌ని సృష్టించడం లేదంటే ఏదైనా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా టీ-షర్టులను విక్రయించవచ్చు. మీ వ్యాపారం వృద్ధి చెందుతున్నాకొద్దీ పరిమాణాన్ని కూడా పెంచుకోవచ్చు. మంచి నాణ్యతతో పెద్ద సంఖ్యలో టీషర్టులను ప్రింట్ చేయడానికి ఖరీదైన యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు.
సాధారణంగా టీషర్ట్ ప్రింటింగ్ మెషిన్ రూ.50,000 నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి. తెలుపు లేదా ఏదైనా ఒకే రంగు ప్లెయిన్ టీషర్టులు టోకున ఒకటి రూ.120కి కూడా లభిస్తుంది. దానిపై ప్రింటింగ్ ఖర్చు ఒక రూపాయ నుంచి 10 రూపాయల దాకా అవుతుంది. ప్రింటింగ్ క్వాలిటీని బట్టి రూ.30 కూడా అవుతుంది. చక్కటి డిజైన్ ప్రింటయిన టీషర్టును మార్కెట్ లో కనీసం రూ.250కి అమ్మొచ్చు. అంటే ఒక టీషర్టుపై కనీసం 50 శాతం లాభం పొందొచ్చు. ఆన్ లైన్ లోనూ మీరు ప్రింట్ చేసిన టీషర్టులను విక్రయించొచ్చు.
(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Business Ideas, Personal Finance