హోమ్ /వార్తలు /బిజినెస్ /

Snacks Business Idea: ఈ బిజినెస్ తో మంచి లాభాలు.. లక్షల్లో ఆదాయం ఉండే ఛాన్స్.. ఓ లుక్కేయండి

Snacks Business Idea: ఈ బిజినెస్ తో మంచి లాభాలు.. లక్షల్లో ఆదాయం ఉండే ఛాన్స్.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సొంతంగా బిజినెస్ (Business) చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ స్నాక్స్ తయారీ బిజినెస్ పై ఓ లుక్కేయండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఈ రోజుల్లో సొంతంగా వ్యాపారం (Business) ప్రారంభించాలనుకునే వారి సంఖ్య అధికంగా ఉంటోంది. కరోనా (Corona) ప్రభావం మొదలైన నాటి నుంచి ప్రైవేటు ఉద్యోగాలు (Private Jobs) చేస్తున్న అనేక మంది సొంతంగా బిజినెస్ చేయడం వైపే ఆలోచిస్తున్నారు. అయితే.. మీరు కూడా సొంతంగా వ్యాపారం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఈ బిజినెస్ ను ఎంచుకోవచ్చు. అదే స్నాక్స్ తయారు చేసే బిజినెస్. స్నాక్స్ అనగానే.. సింపుల్ గా తీసేయకండి. స్నాక్స్ తయారు చేసి లక్షల్లో సంపాధించవచ్చు. ఎంత క్వాలిటీ, రుచి మెయింటేన్ చేస్తే మీకు అన్ని డబ్బులు రావడం గ్యారెంటీ. ఈ బిజినెస్ ను తక్కువ పెట్టుబడి, తక్కువ మ్యాన్ పవర్, తక్కువ స్థలంలోనూ ప్రారంభించగలగడం మరో విశేషంగా చెప్పొచ్చు. ఈ వ్యాపారాన్ని గ్రామం, నగరం లాంటి తేడా లేకుండా ఎక్కడైనా ప్రారంభించగలగొచ్చు. అయితే.. మార్కెటింగ్ చేయడంపై మీకు వచ్చే ఆర్డర్లు, లాభాలు ఆధారపడి ఉంటాయి.

ఇలా ప్రారంభించండి

మీ ఇంట్లో వారికి ఎవరికైనా పిండి వంటలు తయారు చేయడం వచ్చి.. మీకు సహకరించడానికి ఆసక్తి ఉంటే ఈ వ్యాపారం నిర్వహించడం మీకు చాలా సులువు అవుతుంది. లేకపోతే పిండి వంటలు చేయగలిగిన వారిని నియమించుకోవచ్చు. వారికి జీతం ఇవ్వొచ్చు లేదా వాటా ఇచ్చేలా కూడా ఒప్పందం చేసుకోవచ్చు. అయితే కొంచెం పెద్దగా ఈ బిజినెస్ ను ప్రారంభించాలనుకుంటే మాత్రం వివిధ రకాల ప్రభుత్వ అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. వీటిలో ఫుడ్ లైసెన్స్, MSME రిజిస్ట్రేషన్ మరియు GST రిజిస్ట్రేషన్ మొదలైనవి ఉన్నాయి.

Business Idea: రూ.10 వేల పెట్టుబడితో బిజినెస్.. నెలకు రూ.లక్ష వరకు ఆదాయం.. తెలుసుకోండి

ఇంకా ఈ వ్యాపారం ప్రాంభించడానికి ముందు అన్ని రకాల పిండి, నూనె, శనగపిండి, ఉప్పు, నూనె, మసాలాలు, వేరుశెనగలు, పప్పులు మీకు అవసరం. వంట మిషనరీ తో పాటు ప్యాకేజింగ్ మరియు వెయింగ్ మెషిన్ మొదలైన కొన్ని యంత్రాలు అవసరం. దీనితో పాటు, మీకు 1-2 మంది ఉద్యోగులు కూడా అవసరం.

Business Idea: ఈ వ్యాపారానికి పెట్టుబడే అవసరం లేదు.. కానీ, నెలకు రూ.50 వేలకు పైగా ఇన్‌కమ్.. ఎలా అంటే?

ఖర్చులు మరియు సంపాదన

ఈ వ్యాపారాన్ని ఓ ఐదు వేలతో కూడా ప్రారంభివచ్చు. కొంచెం పెద్ద స్థాయిలో కూడా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అలా అనుకుంటే కనీసం 2 నుండి 6 లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టాలి. మీ వ్యాపారం సక్సెస్ అయితే.. మీకు 20 నుండి 30 శాతం వరకు లాభాలు వస్తాయి.

First published:

Tags: Business Ideas, Investment Plans

ఉత్తమ కథలు