హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: ఆర్థిక మాంద్యంలోనూ లాభాలు తెచ్చే బిజినెస్ ఐడియాలు ఇవి.. ప్రతి నెలా లక్షల్లో ఆదాయం

Business Ideas: ఆర్థిక మాంద్యంలోనూ లాభాలు తెచ్చే బిజినెస్ ఐడియాలు ఇవి.. ప్రతి నెలా లక్షల్లో ఆదాయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas: తక్కువ పెట్టుబడితోనే మంచి వ్యాపారం మొదలు పెట్టాలని భావిస్తుంటే.. మీకోసమే మూడు అద్భుతమైన ఐడియాలను తీసుకొచ్చాం. వీటిని ఇంట్లో కూర్చునే నిర్వహించవచ్చు. అవేంటో చూద్దాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం (Economic Recession) భయం వెంటాడుతోంది. దిగ్గజ సంస్థలైన ట్విటర్ (Twitter), మెటా (Meta), అమెజాన్‌(Amazon)లో కూడా ఉద్యోగుల తొలగింపు భారీ స్థాయిలో జరుగుతోంది. ఇతర కంపెనీలు కూడా అదే బాటలో వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఉద్యోగుల్లో భయం నెలకొంది. తమ ఉద్యోగం కూడా ఉంటుందా? ఊడుతుందా? అనే టెన్షన్ మొదలయింది. మీలో కూడా ఇలాంటి ఆలోచన ఉంటే అస్సలు ఆందోళన చెందకండి. కాస్త కొత్తగా ఆలోచిస్తే.. ఆర్థిక మాంద్యంలోనూ అదరగొట్టవచ్చు. ప్రతి నెలా భారీగా ఆదాయం పొందవచ్చు. తక్కువ పెట్టుబడితోనే మంచి వ్యాపారం మొదలు పెట్టాలని భావిస్తుంటే.. మీకోసమే మూడు అద్భుతమైన ఐడియాలను తీసుకొచ్చాం. వీటిని ఇంట్లో కూర్చునే నిర్వహించవచ్చు. అవేంటో చూద్దాం.

ఆన్‌లైన్ క్లాస్‌లు (Online Classes):

కరోనా తర్వాత ఆన్‌లైన్ క్లాస్‌లు పెరిగాయి. మీలో కూడా ఏదైనా సబ్జెక్టుపై పట్టుఉంటే.. ఆ ప్రతిభతోనే భారీగా ఆదాయం పొందవచ్చు. కరోనా సమయంలో ఈ ట్రెండ్ భారీగా పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఆన్ లైన్ క్లాస్‌లు క్రమంగా విస్తరిస్తాయి. మీరు కూడా ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించి ప్రతి నెలా సంపాదించవచ్చు. మీరు సొంతంగానైనా క్లాస్‌లు చెప్పవచ్చు. లేదంటే అనేక ఫ్లాట్‌ఫారమ్‌లు ఫ్రీలాన్సర్‌గా అవకాశం ఇస్తున్నాయి. పిల్లలకు పాఠాలు భోదించేందుకు గంటల ప్రకారం డబ్బును చెల్లిస్తాయి.

యూట్యూబ్ వీడియోలు (Youtube videos):

మనదేశంలో జియో వచ్చిన తర్వాత డేటా చార్జీలు తగ్గడంతో ఇంటర్నెట్ వాడకం బాగా పెరిగిపోయింది. ఇంటర్నెట్ యూజర్లు భారీగా పెరగడంతో.. దాని కేంద్రంగా చాలా మంది ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. యూట్యూబ్‌లో వీడియోలు చేసి బాగా సంపాదిస్తున్నారు. ఫుడ్, ట్రావెలింగ్, లైఫ్ స్టైల్, హెల్త్, సినిమాలు, న్యూస్, టెక్నాలజీ, బిజినెస్ వంటి విభాగాల్లో వీడియోలు చేస్తూ.. ఆదాయం పొందుతున్నారు. వీటిలో దేనిలోనైనా మీకు ఆసక్తి ఉంటే.. యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభింవచ్చు. ప్రారంభంలో కొంత కష్టపడి.. సబ్‌స్క్రైబర్స్‌ను పెంచుకుంటే.. ఆ తర్వాత మీకు ఆదాయం బాగా వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో మంది యూట్యూబర్స్ నెలకు పది లక్షలకు పైగా సంపాదిస్తున్నారు.

బ్లాగ్ రైటింగ్ (Blog writing):

మీకు కథలు..కవితలు.. వార్తలు రాయడంపై పట్టు ఉంటే.. బ్లాగ్ లేదా వెబ్ సైట్ ప్రారంభించవచ్చు. పెద్ద స్థాయిలో బ్లాగింగ్ చేయాలనుకుంటే సొంత వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసుకోవడం బెటర్. వాటిలో గూగుల్ యాడ్స్ ద్వారా డబ్బు సంపాదించవచ్చు. పాఠకుల సంఖ్య పెరిగేకొద్దీ.. నేరుగా కంపెనీల నుంచే ప్రకటనలు వస్తాయి. ఇక్కడ ప్రకటనల ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

First published:

Tags: Business, Business Ideas, Youtube

ఉత్తమ కథలు