హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Ideas: తక్కువ పెట్టుబడితే వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అద్భుతమైన ఐడియా

Business Ideas: తక్కువ పెట్టుబడితే వ్యాపారం చేయాలనుకుంటున్నారా? అద్భుతమైన ఐడియా

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Business Ideas: తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఐతే ఈ వ్యాపారం చేయవచ్చు. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందుతారు.

  మీకు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా? ఏళ్ల తరబడి చూస్తున్నా జాబ్ రావడం లేదా? సొంతంగా వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా? ఐతే తక్కువ పెట్టుబడితోనే అధిక ఆదాయం ఇచ్చే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. అందులో ఆయిల్ మిల్లు యూనిట్ ఒకటి. ప్రస్తుతం మార్కెట్‌లో వంట నూనెకు డిమాండ్ ఎక్కువగా ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆయిల్ ఉత్పత్తులను ఎగుమతులను ఇండోనేషియా నిలిపివేడయంతో మన దేశంలో వంట నూనెల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం లీటర్ నూనె ధర రూ.210 వరకు ఉంది. రాబోయే రోజుల్లో ఇది రూ.250 వరకు వెళ్లే అవకాశముంది. వంట నూనెకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మీరు ఉండేది చిన్న గ్రామమైనా.. పట్టణమైనా, నగరమైనా.. ఈ వ్యాపారం విజయవంతమవుతుంది.

  Elon Musk: ఎలాన్ మస్క్ సక్సెస్‌కు కారణాలు ఏంటి..? ట్విట్టర్ కొత్త యజమాని బర్త్‌ చార్ట్‌..

  ఇంతకు ముందు నూనె తీయడానికి పెద్ద పెద్ద మెషీన్లు వాడాల్సి ఉండేది. కానీ ఇప్పుడు పోర్టబుల్ మెషీన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అవి కూడా తక్కువ ధరకే మనకు మార్కెట్‌లో లభిస్తాయి. వీటిని అమర్చడానికి ఎక్కువ స్థలం అవసరం లేదు. నడపడానికి ఎక్కువ శ్రమ అవసరం లేదు. చిన్న స్థలంలోనే చాలా ఈజీగా ఆపరేట్ చేయవచ్చు. ఈ రోజుల్లో ఆవాలు, వేరుశెనగ, నువ్వులు వంటి అనేక పంటల నుండి నూనెను తీయగలిగే యంత్రాలు మార్కెట్‌లో ఉన్నాయి. ఇందుకోసం మీడియం సైజు ఆయిల్ డిస్పెన్సర్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.

  Price Hike Shock: సామాన్యులకు షాకుల మీద షాక్... సబ్బులు, షాంపూ, బిస్కెట్ల ధరల పెంపు

  ఆయిల్ ఎక్స్‌పెల్లర్ మెషిన్ 2 లక్షల రూపాయల్లో వస్తుంది. మీరు ఆయిల్ మిల్లును ఏర్పాటు చేయడానికి కొంత పేపర్ వర్క్ కూడా చేయాల్సి ఉంటుంది. ఆయిల్ మిల్లును పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.3-4 లక్షల వరకు ఖర్చవుతుంది. యూనిట్ ప్రారంభించి తొలినాళ్లలో మీరు కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. నాణ్యమైన ఉత్పత్తులను తీసుకొస్తే.. మీ వ్యాపారం బాగుంటుంది. మీరు ఏ నూనె తీసినా అది క్వాలిటీగా ఉండాలి. అప్పుడే మీకు కస్టమర్లు వస్తారు. గిరాకీ పెరుగుతుంది.

  నూనె తీసిన తర్వాత.. దానిని స్థానికంగానే విక్రయించవచ్చు. రిటైల్‌లో విక్రయించడానికి సొంతంగా కౌంటర్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. కిరాణా దుకాణాలతో ఒప్పందం చేసుకొని.. వారి ద్వారా కూడా అమ్మవచ్చు. లేదంటే.. మీరు ఆన్‌లైన్ మార్కెటింగ్ సాయం కూడా తీసుకోవచ్చు. నూనెతో పాటు పశుపోషకులు ఆవపిండి మొదలైన వాటిని కూడా కొనుగోలు చేసుకోవచ్చు. తద్వారా మీరు మరింత ఆదాయం పొందుతారు. మీ మిల్లు బాగా నడిస్తే.. ఏడాది కాలంలో మీ పెట్టుబడి మొత్తం వెనకి వస్తుంది. ఆ తర్వాతి ఏడాది నుంచి మీకు రాబడి వస్తుంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Business, Business Ideas, Edible Oil, Personal Finance

  ఉత్తమ కథలు