హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం మొదలెట్టండి.. సుదీర్ఘకాలంపాటు ఎక్కువ లాభాలు..

Business Idea: తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారం మొదలెట్టండి.. సుదీర్ఘకాలంపాటు ఎక్కువ లాభాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తక్కువ పెట్టుబడితో నూనె మిల్లును గ్రామాల నుంచి నగరాల దాకా ఎక్కడైనా ప్రారంభించవచ్చు. ఎలా మొదలుపెట్టాలి, లాభాలు ఏమేరకు ఉంటాయంటే..

మంచి నూనె లేని వంట గది ఎడారితో సమానం అంటారు. నూనె లేని వంటకాలు మనకు అసలే రుచించవు. అయితే ఇప్పుడు యుద్దం ఇతరత్రా కారణాల వల్ల వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాబోయే రోజుల్లో నూనెల ధరలు పెరిగినా, తగ్గినా చాలా కాలంపాటు లాభాలు పొందడానికి చక్కనైన బిజినెస్ ఐడియా నూనె మిల్లు ఏర్పాటు. అవును, తక్కువ పెట్టుబడితో నూనె మిల్లును గ్రామాల నుంచి నగరాల దాకా ఎక్కడైనా ప్రారంభించవచ్చు. ఎలా మొదలుపెట్టాలి, లాభాలు ఏమేరకు ఉంటాయంటే..

వంట నూనెలు విరివిగా వాడే మన దేశంలో ఆయిల్ మిల్లుల ఎన్ని పెట్టినా డిమాండ్ తగ్గదు. ఆవాల నుంచి వేరు శనగదాకా, కొబ్బరి నుంచి పొద్దుతిరుగుడు దాకా పలు వివిధ రకాల నూనెల ఉత్పత్తిని చిన్న స్థాయి నుంచి కూడా మొదలుపెట్టొచ్చు. ఈ వ్యాపారానికి ప్రధానంగా ఆయిల్ ఎక్స్‌పెల్లర్ మెషిన్ అవసరం. వన్ టైమ్ ఇన్వెస్ట్ మెంట్, అంటే ఒక్కసారి పెట్టుబడి పెడితే సుదీర్ఘకాలం పాటు లాభాలు పొందొచ్చీ వ్యాపారంలో.

Petrol Diesel: షాకింగ్ లెక్కలు -మూడేళ్ల గరిష్టానికి ఇంధన డిమాండ్ -పెట్రోల్ అమ్మకాల రికార్డు


ఆయిల్ మిల్లు వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే ముందుగా ఏకరమైన నూనె ఉత్పత్తి చేయాలనుకుంటున్నారో దానికి అనువైన ఆయిల్ ఎక్స్‌పెల్లర్ యంత్రాన్ని కొనుగోలు చేయాలి. ఆవాల నూనె మిల్లయితే ఖరీదు రూ.2 లక్షలు. ఆయిల్ మిల్లును ఏర్పాటు చేయడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా

(FSSAI) నుంచి లైసెన్స్ పొందడం తప్పనిసరి. లైనెన్స్ తోపాటు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాలి.

Business Idea: వేసవిలో వీటి సాగుతో లక్షాధికారి కావొచ్చు.. సర్కారు నుంచీ సబ్సిడీ కూడా..


ఒక వేళ మీరు లైసెన్స్ పొందకుండా, అవసరమైన అనుమతులు తీసుకోకుండా నూనె మిల్లు ఏర్పాటు చేస్తే అది చట్టవిరుద్ధ చర్యే అవుతంది. పూర్తిస్థాయిలో ఆయిల్ మిల్ ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.3-4 లక్షలు ఖర్చవుతుంది. మిల్లును భారీ పరిమాణంలో ఏర్పాటు చేయాలనుకుంటే ఖర్చు కూడా పెరుగుతుంది. ఆయిల్ ఎక్స్‌పెల్లర్ యంత్రంలో గింజల నుంచి నూనె తీస్తారు. నూనెతోపాటు కేకుల రూపంలో మిగిలే పిప్పిని అమ్మడం ద్వారానూ డబ్బు సంపాదించవచ్చు. వాటిని జంతువులకు ఆహారంగా తినిపిస్తారని తెలిసిందే.

ఆయిల్ ఎక్స్‌పెల్లర్ యంత్రం (నమూనా)

బూట్లు నాకి అధ్యక్షుడయ్యావ్.. వరికి గోధుమకు తేడా తెలీని వెధవ్వి: బండిపై ఎమ్మెల్సీ పిడుగులు


మీ మిల్లులో తయారైన నూనెను నేరుగా లేదంటే ఆన్‌లైన్ మార్కెటింగ్ ద్వారానూ అమ్ముకోవచ్చు. డబ్బాలు లేదా సీసాలలో ప్యాక్ చేసి కస్టమర్లకు అందించవచ్చు. ఈ వ్యాపారంలో వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ సరిపోతుంది. తరువాత, మీరు చాలా సంవత్సరాలు డబ్బు సంపాదించవచ్చు. పెట్టిన పెట్టుబడి కొద్ది నెల్లోనే తిరిగొస్తుంది. ఆయిల్ మిల్లు వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ.

Published by:Madhu Kota
First published:

Tags: Business, Business Ideas, Cooking oil, Personal Finance

ఉత్తమ కథలు