హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: మీరు మాటలు బాగా చెప్పగలరా? అయితే.. ఈ బిజనెస్ ఐడియా మీ కోసమే.. ఓ లుక్కేయండి

Business Idea: మీరు మాటలు బాగా చెప్పగలరా? అయితే.. ఈ బిజనెస్ ఐడియా మీ కోసమే.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీరు బాగా మాట్లాడుతారా? మీ మాటలతో ఇతరులను మెప్పింగలరా? అయితే, మీ కోసం ఈ బెస్ట్ బిజినెస్ ఐడియా.. ఓ లుక్కేయండి.

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయి అనే మాట సాధారణంగా అందరూ అంటూ ఉంటారు. అయితే.. జంటలను కలపడం మాత్రం.. భూమి మీదే జరుగుతూ ఉంటుంది. ఇరు పక్షాల పెద్దలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అయితే.. ఈ మారిన ఉరుకుల పరుగుల జీవన విధానంలో పెళ్లిళ్లను కుదిర్చే పెద్దలు కరువయ్యారు. అయితే.. కార్యక్రమాన్ని నిర్వహించడానికి మ్యారేజ్ బ్యూరోలు అందుబాటులోకి వచ్చాయి. ఆ నాడు మధ్యవర్తులు నిర్వహిస్తున్న విధులను నేడు మ్యారేజ్ బ్యూరోలను నిర్వహిస్తున్నాయి. అయితే.. ఇది కేవలం పెళ్లిళ్లు కుదిరించడం మాత్రమే కాదు.. ఓ వ్యాపారం అనే విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ వ్యాపారంలో మంచి ఆదాయాన్ని సంపాధించవచ్చు. మ్యారేజ్ బ్యూరో అంటే ఆధునిక మధ్యవర్తులు అన్నమాట. ఈ బ్యూరోలు రెండు పార్టీలకు అబ్బాయి లేదా అమ్మాయికి సంబంధించిన మొత్తం డేటాను అందిస్తాయి. వివాహం నిశ్చయమైన తర్వాత.. వారు రెండు పార్టీల నుంచి కమిషన్ తీసుకుంటారు.

ఎలా ప్రారంభించాలి..

మ్యారేజ్ బ్యూరోని ప్రారంభించడానికి మీకు పెద్ద స్థలం అవసరం లేదు. మీరు దీన్ని 1 గది మరియు హాల్‌తో ప్రారంభించవచ్చు. గది మీ కార్యాలయం అవుతుంది మరియు మీరు హాల్‌ను రిసెప్షన్‌గా ఉంచుకోవచ్చు. మీకు కార్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అవసరం. ఒక రిసెప్షనిస్ట్ కాగా.. మరొకరు మీకు సహాయకుడిగా ఉంటారు. మీ గది కనీసం 4-6 మంది సులభంగా కూర్చోగలిగేంత పెద్దదిగా ఉండాలి. మీరు కుదిర్చే సంబంధాల ఆధారంగా మీకు మౌత్ పబ్లిసిటీ లభిస్తుంది. మ్యారేజ్ బ్యూరోని ప్రారంభించాలనునే వారికి మంచి సంభాషణ నైపుణ్యం ఉండాలి. ఇరు వర్గాలను మెప్పించే సామర్థ్యం ఉండాలి. వంద అబద్ధాలు ఆడి అయినా ఓ పెళ్లి చేయాలన్నది సామెత. అయితే.. వంద అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు కానీ.. చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఇరు వర్గాలను కూర్చొబెట్టి నచ్చజెప్పేలా ఉండాలి.

ఖర్చు మరియు ఆదాయం

మ్యారేజ్ బ్యూరోను మీ ఇంట్లో ప్రారంభిస్తే అద్దె ఆదా అవుతుంది. దీని తర్వాత.. మీరు మీ 2 ఉద్యోగుల జీతం మరియు విద్యుత్ బిల్లు వంటి కొన్ని విషయాల నెలవారీ ఖర్చులను చూడాలి. అలాగే, వ్యాపార నమోదు కోసం కొంత మొత్తం వసూలు చేయబడుతుంది. మీరు రూ. 50,000-1,00,000 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆదాయం గురించి మాట్లాడితే.. మీరు బ్యూరో యొక్క రిజిస్ట్రేషన్ ఫీజును ఉంచవచ్చు. ఇది రూ. 500 నుండి రూ. 2500 వరకు ఉంటుంది. దీని తరువాత, వివాహం ఫిక్స్ అయినప్పుడు, రెండు పార్టీల నుంచి కమిషన్ మీకు లభిస్తుంది. ఈ కమిషన్ రూ.5 వేల నుంచి 50,000 రూపాయల వరకు ఉంటుంది.

పబ్లిసిటీ..

మీరు మీ వ్యాపారం కోసం వెబ్‌సైట్‌ని సృష్టించవచ్చు. వార్తాపత్రికలు మరియు ఛానెల్‌లలో ప్రకటనలు ఇవ్వవచ్చు. కరపత్రాలు పంపిణీ చేయవచ్చు. మీరు మీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి మరియు మీ వద్దకు మరింత ఎక్కువ మంది క్లయింట్‌లను ఆకర్షించడానికి అనేక ఇతర మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా మీకు మంచి బెనిఫిట్లు ఉంటాయి.

First published:

Tags: Business Ideas, Investment Plans, Marriage

ఉత్తమ కథలు