హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: రూ.50వేలతో ఎల్ఈడీ బల్బుల తయారీ యూనిట్.. నెలకు రూ.1.5 లక్షల సంపాదన..

Business Idea: రూ.50వేలతో ఎల్ఈడీ బల్బుల తయారీ యూనిట్.. నెలకు రూ.1.5 లక్షల సంపాదన..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మన దేశంలోనూ ఎల్‌ఈడీ బల్బులకు డిమాండ్ బాగా పెరిగింది. తయారీ ఫ్యాక్టరీ లేదా యూనిట్ పెట్టాలనుకునేవారికి ప్రభుత్వాలు శిక్షణ కూడా ఇస్తున్నాయి. రూ.50వేల పెట్టుబడితో నెలకు రూ.1.5లక్షలు సంపాదించవచ్చు..

తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని పొందే వీలున్న స్టార్టప్ కంపెనీలను కేంద్రంతోపాటు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. పకడ్బందీ మార్కెటింగ్ చేసుకోగలిగితే కొన్ని వ్యాపారాల్లో అద్బుతమైన ప్రగతి సాధించవచ్చు. అలాంటి వాటిలో ఒకటే ఎల్‌ఈడీ బల్బుల తయారీ వ్యాపారం. సాంప్రదాయ ఇంధన వినియోగం తగ్గింపు చర్యల్లో భాగంగా తక్కువ కరెంటుతో నడిచే ఎల్ఈడీ బల్బులను ప్రపంచ దేశాలన్నీ ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలోనూ ఎల్‌ఈడీ బల్బులకు డిమాండ్ బాగా పెరిగింది. ఈ బల్బులు వచ్చిన తర్వాత వెలుతురు బాగా పెరగడంతో పాటు కరెంటు బిల్లులు కూడా అదుపులోకి వచ్చాయి. LED బల్బుల తయారీ ఫ్యాక్టరీ లేదా యూనిట్ పెట్టాలనుకునేవారికి ప్రభుత్వాలు శిక్షణ కూడా ఇస్తున్నాయి.

ఎల్ఈడీ బల్బ్ మన్నికైనది, చాలా కాలం పాటు ఉంటుంది. ప్లాస్టిక్‌గా ఉండడం వల్ల సాధారణ గాజు బల్బుల్లా సులువుగా విరిగిపోతాయనే భయం కూడా ఉండదు. LED అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అని తెలిసిందే. సాధారణ సీఎఫ్ఎల్ బల్బు జీవితకాలం 8000 గంటలుకాగా, ఎల్ఈడీ బల్బు మాత్రం 50,000 గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలమే పనిచేస్తుంది. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఎల్‌ఈడీ బల్బులను రీసైకిల్ కూడా చేయవచ్చు. CFL బల్బుల మాదిరిగా ఎల్ఈడీలో పాదరం ఉండదు. సీసం, నికెల్ వంటి పదార్థాలతో తయారవుతుంది.

Business Idea: తక్కువ పెట్టుబడితో వెంటనే లాభాలనిచ్చే వ్యాపారం ఇది..

మీరు చాలా తక్కువ పెట్టుబడితో LED బల్బుల వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. తక్కువ పెట్టుబడితో ఉత్తమ వ్యాపారంగా దీనిని పరిగణిస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యస్థ మంత్రిత్వ శాఖ (ఎంఎస్ఎంఈ) ఎంటర్‌ప్రైజెస్ కింద చాలా ఇనిస్టిట్యూట్లు ఎల్‌ఈడీ బల్బుల తయారీకి శిక్షణ ఇస్తున్నాయి. ప్రతిచోటా స్వయం ఉపాధి పథకం కింద ఎల్‌ఈడీ బల్బుల తయారీకి శిక్షణ ఇస్తున్నారు. కంపెనీల ఎల్ఈడీ బల్పుల తయారీ కాంట్రాక్టులు కూడా పొందొచ్చు.

Telangana Congress : రేవంత్‌కు దిమ్మతిరిగే షాక్.. KCR-PK దోస్తీపై డైలమాలో టీకాంగ్రెస్


LED బల్బుల తయారీ శిక్షణ సమయంలో, ప్రభుత్వ సబ్సిడీ పథకంతోపాటు ఎల్ఈడీ డ్రైవర్, ఫిట్టింగ్-టెస్టింగ్, మెటీరియల్ కొనుగోలు, మార్కెటింగ్ మెళకువలనూ నేర్పుతారు. ఎల్ఈడీ బల్బుల తయారీని మీరు చిన్న స్థాయి నుంచి కూడా మొదలు పెట్టొచ్చు. కేవలం రూ. 50,000తోనూ యూనిట్ ప్రారంభించవచ్చు. దానికి అనుగుణంగా బల్బుల దుకాణం పెట్టుకోవచ్చు లేదా ఇంట్లో నుంచే అమ్మకాలు కొనసాగించవచ్చు.

Vastu Tips: ఈ ఐదూ ఇంట్లో పెట్టుకుంటే మీరు ధనవంతులు అవుతారు..


ఒక LED బల్బును తయారు చేయడానికి దాదాపు 50 రూపాయలు ఖర్చవుతుండగా, మార్కెట్‌లో దానిని 100 రూపాయలకు సులభంగా విక్రయిస్తున్నారు. అంటే ఒక బల్బుపై రెట్టింపు లాభం. మీరు ఒక రోజులో ఉంటే మీరు 100 బల్బులను తయారు చేసినా, మీ జేబులో నేరుగా రూ. 5000 ఆదాయం వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో నెలకు రూ.1.50 లక్షల వరకు ఈజీగా సంపాదించవచ్చు.

First published:

Tags: Business, Business Ideas, Personal Finance, Smart bulbs