హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: తక్కువ పెట్టుబడి, కొంచెం శ్రమ.. ఈ సాగుతో అధిక లాభాలు..

Business Idea: తక్కువ పెట్టుబడి, కొంచెం శ్రమ.. ఈ సాగుతో అధిక లాభాలు..

ధన జ్యోతిష్యం (ప్రతీకాత్మక చిత్రం)

ధన జ్యోతిష్యం (ప్రతీకాత్మక చిత్రం)

డబ్బులు సంపాదించగల వ్యాపార అవకాశం కోసం మీరు ఎదురుచూస్తున్నారా? ఈ రోజుల్లో విద్యావంతులు కూడా మంచి జీతాలొచ్చే ఉద్యోగాలను వదిలి వ్యవసాయం వైపు మళ్లుతున్నారని తెలుసుకదా?

పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించగల వ్యాపార అవకాశం కోసం మీరు ఎదురుచూస్తున్నారా? ఈ రోజుల్లో విద్యావంతులు కూడా మంచి జీతాలొచ్చే ఉద్యోగాలను వదిలి వ్యవసాయం వైపు మళ్లుతున్నారని తెలుసుకదా? మంచి డిమాండ్ ఉండే వాణిజ్య పంటలను పండించడం ద్వారా లక్షలు సంపాదించవచ్చుమరి. తక్కువ పెట్టుబడి, కొంచెం శ్రమతో అదిక లాభాలను ఆర్జించగలిగే ఉపాయమిది..

మనకు బాగా తెలిసిన బెండకాయలను పండించడం ద్వారా బంపర్ లాభాలను ఆర్జించవచ్చు. ఈ కూరగాయల సాగు ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. సొంత భూమైనా, లీజుకు తీసుకున్నా వాణిజ్య పంటలు దాదాపు నష్టం కలిగించవు. తక్కువ విస్తీర్ణంలోనైతే పంట సంరక్షణ సులభం కూడా.

Sunil Kanugolu: డైలమాలో ప్రశాంత్ కిషోర్.. శిష్యుడు సునీల్ కనుగోలు దూకుడు.. కాంగ్రెస్‌లో చేరిక

ఎలా నాటాలి?

బెండకాయను విత్తే ముందు ఆ పని సరైన పద్దతిలో చేస్తున్నామా, గింజలు మేలురకానివేనా అని తెలుసుకోవాలి. వరుసలో 40 నుంచి 45 సెం.మీ. దూరంలో విత్తనాలు వేయాలి. 3 సెంటీమీటర్ల కంటే లోతుగా నాటకూడదు. మొత్తం ఫీల్డ్‌ను తగిన పరిమాణంలో స్ట్రిప్స్‌గా విభజించాలి. తద్వారా నీటిపారుదల సౌకర్యంగా సమర్థవంతంగా చేయొచ్చు. ఒక హెక్టారుకు 15 నుంచి 20 టన్నుల ఆవు పేడ అవసరమవతుంది. ఎప్పటికప్పుడు కలుపు తీసుకుంటూ, గరిష్ట దిగుబడి సాధించవచ్చు.

Business Idea: తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. వీటి సాగుకు 75శాతం ప్రభుత్వ సబ్సిడీ..

బెండతో ఆరోగ్యానికి మేలు..

బెండకాయ కూరగాయ ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. దీని వల్ల క్యాన్సర్ వ్యాధి దూరం అవుతుంది. అదే సమయంలో గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా బెండకాయ తింటే మంచిది. రక్తహీనత వ్యాధి నివారణలో బెండ ఉపయోగకారిగా ఉంటుంది.

బెండ సాగు

Business Ideas: ఉద్యోగంతో పాటు ఈ బిజినెస్ చేయొచ్చు.. రూ.10వేల పెట్టుబడి.. లక్షల్లో ఆదాయం

ఎంత సంపాదించవచ్చు?

బెండ సాగు చేస్తే ఒక ఎకరానికి రూ.5 లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇందులో ఖర్చులను తీసేస్తే కనీసం రూ.3.5 లక్షల వరకు ఆదా అవుతుంది. ప్రతి మార్కెట్‌లో బెండకు డిమాండ్ ఉంటుంది. సీజన్ లో ధరలు బాగుంటాయి. బెండకాయ ప్రధానంగా జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, మహారాష్ట్ర , హర్యానా, రాజస్థాన్‌లలో సాగవుతుంది.

Published by:Madhu Kota
First published:

Tags: Business, Business Ideas, Organic Farming, Personal Finance, Vegetables

ఉత్తమ కథలు