హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: రూ.3 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారం చేస్తే.. నెలకు రూ.60వేల ఆదాయం గ్యారంటీ..!

Business Idea: రూ.3 లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారం చేస్తే.. నెలకు రూ.60వేల ఆదాయం గ్యారంటీ..!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Business Ideas | Honey Jam Unit: తేనె జామ్ యూనిట్‌తో నెలనెలా భారీగా ఆదాయం వస్తుంది. మరి దీనికి ఎంత ఖర్చవుతుంది? ఎంత ఆదాయం వస్తుందన్నవివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మీరు సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా? భారీగా లాభాలను తీసుకొచ్చే ఓ బిజినెస్ ఐడియా (Business Ideas)ను ఈరోజు తీసుకొచ్చాం. మీరు ఇంటి నుంచే ఈ వ్యాపారాన్ని చేయవచ్చు. పెట్టుబడి కూడా ఎక్కువగా అవసరం లేదు.ఇది హనీ జామ్  (Honey Jam Unit) తయారీ వ్యాపారం. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ఈ వ్యాపారంపై పూర్తి నివేదికను రూపొదించింది. దాని ఆధారంగా మీరు కూడా తేనె జామ్ యూనిట్‌ను ఏర్పాటు చేయవచ్చు. మరి దీనికి ఎంత ఖర్చవుతుంది? ఎంత ఆదాయం వస్తుందన్నవివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

 New Business Idea: తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. రూ.లక్ష కు రెండు రూ.రెండు లక్షల లాభం.. 

తేను  (Honey) ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం. ఇది పోషకాల గని. అందుకే పురాతన కాలం నుంచే ఆహారంతో పాటు వైద్యంలోనూ వినియోగిస్తున్నారు. తేనె గురించి పెరుగుతున్న అవగాహన కారణంగా... మన దేశంలో దీనికి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ క్రమంలో తేనెతో అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తద్వారా తేనె విక్రయాలు పెరగడంతో పాటు తేనెటీగల పెంపకందారులకు కూడా ఆదాయం పెరుగుతోంది. అందువలన తేనె ఆధారిత వాల్యూ యాడెడ్ ఫుడ్ ప్రాడక్ట్స్ ఇండస్ట్రీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని కల్పిస్తోంది. హనీ జామ్ తయారీ పరిశ్రమ కూడా ఈ కోవలోకే వస్తుంది.

 Stock Market: ఈ కంపెనీ షేర్ విలువ రూ.17 నుంచి 2000కు పెరిగింది.. రూ.3వేలు కూడా దాటొచ్చు..!

హనీ జామ్ తయారీ (Honey Jam Making) ప్రక్రియ చాలా ఈజీ. తయారీ విధానాన్ని ఒకసారి చూద్దాం. మూడు మామిడిపండ్లు, ఒక మీడియం సైజ్ బొప్పాయి, ఒక పైనాపిల్, ఐదు జామపండ్లు తీసుకుని వాటిని బాగా శుభ్రం చేసి 10 నిమిషాల పాటు నీళ్లలో మరిగించాలి. అమిక్సర్ గ్రాండర్ సహాయంతో వాటి నుంచి గుజ్జును తీయాలి. పండ్ల గుజ్జును రాగి అడుగు ఉన్న స్టీల్ పాత్రలో ఉంచి.. తగినంత చక్కెర, సిట్రిక్ యాసిడ్ వేసి 5 నిమిషాలు ఉడకబెట్టాలి. ఈ మిశ్రమంలో 25ml పెక్టిన్ వేసి.. కదుపుతూ ఉండాలి. రెండు నిమిషాల పాటు కదిపిన తర్వాత.. 2 గ్రాముల పొటాషియం మెటాబిసల్ఫైట్ ప్రిజర్వేటివ్స్ కలపాలి. ఆ తర్వాత కొద్ది మొత్తంలో నీరు వేయాలి. అనంతరం కంటైనర్ను టైట్‌గా మూసివేయాలి. ఈ మిశ్రమం 65 డిగ్రీల సెల్సియస్‌కు చల్లారినప్పుడు.. తేనె వేసి బాగా కలపాలి. అంతే.. హనీ జామో రెడీ..! దీనిని 500ml గాజు సీసాలలో నింపి.. సీల్ చేయాలి.

ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) రూపొందించిన ప్రాజెక్ట్ ప్రొఫైల్ రిపోర్ట్ ప్రకారం... హనీ జామ్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు సొంత స్థలం ఉండాలి. మీకు స్థలం లేకపోతే అద్దెకు కూడా తీసుకోవచ్చు. యంత్రాలు, పరికరాల కొనుగోలుకు రూ.1.50 లక్షలు ఖర్చవుతాయి. అలాగే రూ.1.65 లక్షల వర్కింగ్ క్యాపిటల్ అవసరం అవుతుంది. మొత్తంగా హనీ జామ్ యూనిట్‌కు రూ.3,15,000 అవసరం. మీరు 100% సామర్థ్యాన్ని ఉపయోగించి ఉత్పత్తి చేస్తే.. ఏటా 17,21,000 ఆదాయం వస్తుంది. ఇందులో 10 లక్షల మేర ఖర్చులు పోతే... మీకు రూ.7,21,000 మిగులుతాయి. అంటే ప్రతి నెలా దాదాపు రూ.60,000 సంపాదించవచ్చు.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

First published:

Tags: Business, Business Ideas, Honey, Personal Finance

ఉత్తమ కథలు