హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: వేసవిలో వీటి సాగుతో లక్షాధికారి కావొచ్చు.. సర్కారు నుంచీ సబ్సిడీ కూడా..

Business Idea: వేసవిలో వీటి సాగుతో లక్షాధికారి కావొచ్చు.. సర్కారు నుంచీ సబ్సిడీ కూడా..

వేసవిలో భారీ డిమాండ్ కలిగిన ఈ పంట సాగుతో ఓ రైతు 4నెలల్లోనే రూ.8లక్షలు సంపాదించాడు. నిజానికి ఏడాది అంతా వీటికి డిమాండ్ ఉటుంది. ఇవాళ్టి బిజినెస్ ఐడియా ఇదే..

వేసవిలో భారీ డిమాండ్ కలిగిన ఈ పంట సాగుతో ఓ రైతు 4నెలల్లోనే రూ.8లక్షలు సంపాదించాడు. నిజానికి ఏడాది అంతా వీటికి డిమాండ్ ఉటుంది. ఇవాళ్టి బిజినెస్ ఐడియా ఇదే..

వేసవిలో భారీ డిమాండ్ కలిగిన ఈ పంట సాగుతో ఓ రైతు 4నెలల్లోనే రూ.8లక్షలు సంపాదించాడు. నిజానికి ఏడాది అంతా వీటికి డిమాండ్ ఉటుంది. ఇవాళ్టి బిజినెస్ ఐడియా ఇదే..

    తక్కువ పెట్టుబడి ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలనే ఆలోచన మీ మనస్సులో ఉన్నట్లయితే, ఈ ఐడియా కచ్చితంగా పనికొస్తుంది. ఈ వ్యాపారంలో మీరు కొన్ని నెలల్లోనే లక్షల రూపాయలు సంపాదించవచ్చు. కీరా దోసకాయ సాగును వ్యాపారం తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించిపెడుతుంది.

    కీరా దోసకాయ ప్రత్యేకత ఏంటంటే ఏ రకమైన మట్టిలోనైనా దీనిని పండించవచ్చు. ఇసుక నేల, బంకమట్టి నేల, లోమీ నేల, నల్ల నేల, సిల్ట్ నేలలో ఎక్కడైనా సాగు చేసుకోవచ్చు. సొంత భూమిలో లేదా లీజుకు తీసుకునైనా ఎక్కడైనా వీటి సాగు చేయవచ్చు. వేసవిలో కీరాకు మంచి గిరాకీ ఉంది.ఇది సలాడ్ కూడా అసంపూర్ణంగా ఉంటుంది. ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది.

    Vastu Tips: పడక గదిలో సుఖ సౌఖ్యానికి ఇవి పాటించాలి.. లేదంటే దాపత్యంపై ప్రభావం..

    కీరా దోసకాయ పంట 60 నుంచి 80 రోజులలో కాపునకు సిద్ధంగా ఉంటుంది. వేసవిని దోసకాయకు సీజన్ లా పరిగణిస్తారు. ఈ సీజన్‌లో దోసకాయకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. నేల పీహెచ్ 5.5 నుంచి 6.8 వరకు దోసకాయ సాగుకు ఉత్తమంగా పరిగణించబడుతుంది. నదులు, చెరువుల ఒడ్డున కూడా దోసను పండించవచ్చు.

    Covid Big News: కొవిడ్ వ్యాక్సిన్ల ధరలు భారీగా తగ్గింపు.. ఆ రెండు టీకాలు ఇప్పుడు రూ.225కే.. వివరాలివే..

    ప్రభుత్వం నుంచి సబ్సిడీలు..

    కీరా దోసకాయల సాగుకు చాలా రాష్ట్రాల ప్రభుత్వాలు సబ్సిడీలు అందిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో రైతు దుర్గా ప్రసాద్ అనే రైతు దోసకాయ సాగు ద్వారా కేవలం 4 నెలల్లోనే రూ.8 లక్షలు సంపాదించాడు. దోసకాయ సాగు కోసం, అతను నెదర్లాండ్స్ నుండి దోసకాయలను విత్తాడు. పెద్ద పెద్ద రెస్టారెంట్లు, హోటళ్లలో సీడ్ లెస్ కీరాలకు మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వం నుంచి రూ.18 లక్షలు సబ్సిడీ తీసుకుని రైతు పొలంలోనే సెడ్ నెట్ హౌస్ నిర్మించుకున్నాడు.

    కీరా దోసకాయల సాగు

    Uber | Ola : ఏసీకి అదనపు చార్జీ.. క్యాబ్ డ్రైవర్లకు ఉబెర్ షాక్.. త్వరలో రేట్ల పెంపు బాదుడు!

    దేశీయ కీరా దోసకాయ ధర కిలో రూ. 20గా ఉండగా, నెదర్లాండ్స్ రకమైన విత్తనాలు లేని కీరా దోస దర కిలోకు రూ. 40 నుంచి 45 వరకు అమ్ముడవుతుంది. సోషల్ మీడియాను మార్కెటింగ్ కోసం కూడా ఉపయోగించవచ్చు. ఏడాది పొడవునా అన్ని రకాల కీరాలకు డిమాండ్ ఉంటుంది. వీటిని సలాడ్ రూపంలో ఎక్కువగా ఉపయోగిస్తారు.

    First published:

    Tags: Business, Business Ideas, Organic Farming, Personal Finance, Summer

    ఉత్తమ కథలు