Home /News /business /

BUSINESS IDEA RURAL WOMEN DOING WONDERS IN FARMING AND EARNS RS 30 LAKHS PER YEAR HERE DETAILS NS

Business Idea: ఆ మహిళా రైతుల ఆదాయం ఏడాదికి రూ.30 లక్షలు.. వాళ్ల సక్సెస్ సీక్రెట్ ఇదే.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆ ప్రాంతంలోని మహిళలు సాగులో సత్తా చాటుతున్నారు. లక్షల్లో ఆదాాయాన్ని ఆర్జిస్తున్నారు. వారి సక్సెస్ సీక్రెట్ కు సంబంధించిన వివరాలపై మీరూ ఓ లక్కేయండి..

  దేశంలో మహిళా సాధికారత పెరుగుతోంది. వ్యాపారం (Business) తో పాటు సొంతంగా వ్యావసాయం చేయడానికి కూడా అనేక మంది మహిళలు ముందుకు వస్తున్నారు. ఆయా రంగంల్లో పురుషులకు ధీటుగా రాణిస్తూ సత్తా చాటుతున్నారు ఆ మహిళలు. ముఖ్యంగా రాజస్థాన్‌ (Rajasthan) లోని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు తమ తెలివితో వ్యవసాయాన్ని (Agriculture) కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సరికొత్త రికార్డులను నెలకొల్పుతున్నారు. ఈ రాష్ట్రంలోని మహిళలు ప్రస్తుతం ప్రభుత్వ గుర్తింపు పొందిన 20 స్టార్టప్‌లను విజయవంతంగా నడుపుతుండడం విశేషం. ఇందులో ఐదు సేంద్రియ వ్యవసాయం, రెండు డెయిరీ, 13 ఇతర వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఉన్నాయి. ఇలా విజయవంతమైన మహిళల్లో సికర్ జిల్లాలోని జిగర్ బడ్డీ గ్రామానికి చెందిన సంతోష్ పచార్ కూడా ఉన్నారు. సంతోష్ పచార్ కేవలం 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. అయితే క్యారెట్ విత్తనాలను తయారుచేసే కొత్త విధానాన్ని అభివృద్ధి చేసినందుకు రెండుసార్లు (2013 మరియు 2017లో) రాష్ట్రపతి అవార్డును ఆమె గెలుచుకున్నారు. తన ధైర్యం, కృషి, నైపుణ్యంతో సమాజానికి ఆదర్శంగా నిలిచారు పచార్.

  క్యారెట్ సీడ్ యొక్క కొత్త టెక్నిక్
  సంతోష్ పచార్‌కు దాదాపు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇందులో ఆమె 2002లో అధునాతన సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించాడు. వ్యవసాయం ప్రారంభించిన సమయంలో తొలిసారిగా పొడవాటి, సన్నగా మరియు వంకరగా ఉండే క్యారెట్‌లను చూశానని పచర్ చెప్పాడు. దాంతో మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన విత్తనాలు సరిగా ఉండడం లేదని ఆమె గుర్తించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి సొంత ప్రణాళికను రూపొందించారు. పచార్ 1 కిలో క్యారెట్ గింజలను 15 మి.లీ తేనె మరియు 5 మి.లీ నెయ్యితో కలిపి నీడలో ఆరబెట్టడం ద్వారా కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు.
  Business Ideas: మట్టి అవసరం లేని పంట.. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. నెలకు లక్షల్లో ఆదాయం

  ఈ టెక్నిక్ వల్ల విత్తనాలు వేగంగా మొలకెత్తడంతో పాటు క్యారెట్ పొడవు కూడా విపరీతంగా పెరిగింది. దీంతో పచార్ క్యారెట్ తీపిని 5% పెంచడమే కాకుండా ఒకటిన్నర నుంచి రెండు రెట్లు ఉత్పత్తిని రెట్టింపు చేసింది. ఆమె గొప్పతానాన్ని, కృషిని ప్రభుత్వం గుర్తించింది. దీంతో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ఆమె రూ.3 లక్షల బహుమతితోపాటు ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. పచార్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆవు పేడ గ్యాస్ ప్లాంట్‌ను కూడా పచార్ నెలకొల్పారు. ఇది ఆమెతో పాటు అదే గ్రామంలోని 20 కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చింది. వ్యవసాయంలో కొత్త పద్ధతులను తెలియజేస్తూ ఇతర మహిళలకు కూడా సహాయం చేస్తున్నారు పచార్.
  Business Ideas: రైతులకు వరం.. ఈ పంటకు ఫుల్ డిమాండ్.. మార్కెట్లో మంచి రేటు.. లక్షల్లో ఆదాయం

  హార్టికల్చర్‌లో కూడా నైపుణ్యం
  సికార్ జిల్లాకు చెందిన సంతోష్ ఖేదర్ అనే మరో మహిళా రైతు దానిమ్మ సాగులో ప్రత్యేకత సాధించారు. ఆమె భర్త హోంగార్డు. అతనికి దానిమ్మ తోట నాటాలనే ఆలోచన వచ్చింది. దీంతో వారు ఆ సాగును వెంటనే ప్రారంభించారు. దానిమ్మ మొక్కలు నాటిన తర్వాత మొదటి పంట రావడానికి మూడేళ్లు పట్టింది. పంటతో ఎంత డబ్బు సంపాధన ఉంటుందో కూడా ఆమెకు తెలియదు. అయితే చివరికి వారి కష్టానికి తగిన ఫలితం దక్కడంతో వారి ఆదాయం రెట్టింపు అయింది.

  ఖేదార్ దానిమ్మ చెట్ల మధ్య ఖాళీ స్థలంలో నిమ్మ, జామ మొక్కలను కూడా నాటారు. ఈ ప్రయోగం కూడా విజయవంతమై ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం దాటింది. దీంతో నేడు వారు నర్సరీని కూడా నడుపుతున్నారు, దానిమ్మ, నిమ్మ, కిన్ను, నారింజ మరియు మామిడి మొక్కలను ఇతర రైతులకు విక్రయిస్తున్నారు. ప్రస్తుతం హార్టికల్చర్ ద్వారా వారి కుటుంబానికి ఏటా రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల ఆదాయం వస్తుండడం విశేషం.
  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Business Loan, Investment Plans, Rajasthan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు