మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఆన్‌లైన్‌లో డీజిల్ అమ్మే వ్యాపారం మొదలు పెట్టొచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-IOC, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-BPCL, పెట్రోలియం ప్రాసెస్ ఇంజనీరింగ్ సర్వీస్ కంపెనీ-PESCO లాంటి ఆయిల్ కంపెనీల సాయంతో బిజినెస్ ప్రారంభించొచ్చు. ఇందుకోసం ప్రభుత్వం నుంచీ సాయం పొందొచ్చు. Pepfuels స్టార్టప్ ఇలా పుట్టుకొచ్చిందే. మరి ఈ వ్యాపారం ఎలా చేయాలి? ఆన్‌లైన్‌లో డీజిల్ ఎలా అమ్మాలి? పెట్టుబడి ఎంత? లాభం ఎంత? పూర్తి వివరాలు తెలుసుకోండి.
పెప్‌ఫ్యూయెల్స్ ప్రభుత్వం గుర్తించిన స్టార్టప్. ఇండియన్ ఆయిల్‌తో థర్డ్ పార్టీ అగ్రీమెంట్ ఉంది. ఆన్‌లైన్‌లో డీజిల్ డెలివరీ చేసే స్టార్టప్ ఇది. ఎవరైనా ఆన్‌లైన్‌లో డీజిల్ ఆర్డర్ చేస్తే ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. నోయిడాకు చెందిన టికేంద్ర, ప్రతీక్, సందీప్ ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. కేవలం రూ.12 లక్షల పెట్టుబడితో మొదలుపెట్టిన బిజినెస్ ఇది. కొన్నేళ్లలో ఈ వ్యాపారం బాగా పుంజుకుంది. ప్రస్తుతం ఏటా రూ.100 కోట్ల టర్నోవర్‌తో బిజినెస్ చేస్తోంది ఈ స్టార్టప్.
Business Idea: పెట్టుబడి లేకుండా వ్యాపారం... నెలకు రూ.30,000 ఆదాయం... బిజినెస్ ఐడియా ఇదే
Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఉద్యోగావకాశాలు... ఏడాదికి రూ.26.57 లక్షల వేతనం... రిజిస్టర్ చేయండి ఇలా
Taking forward Government of India’s initiative on customer convenience, #IndianOil takes yet another step; commences one of the first Door to Door Delivery Services through Start Up from our Visakhapatnam Terminal, Andhra Pradesh pic.twitter.com/EQzbfDo2W3
— Indian Oil Corp Ltd (@IndianOilcl) April 2, 2021
ఈ వ్యాపారం మొదలుపెట్టేముందు స్టార్టప్ వ్యవస్థాపకులైన టికేంద్ర చాలా పరిశోధన చేశారు. ఇంటింటికీ వెళ్లి అందరితో ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో ఫీడ్‌బ్యాక్ కూడా తీసుకున్నారు. పెట్రోల్, డీజిల్ లాంటి వాటికి ఆన్‌లైన్ యాప్ ఉండాలని చాలామంది ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. కానీ పెట్రోల్, డీజిల్ ఆన్‌లైన్ డెలివరీ చేయడం రిస్కుతో కూడిన వ్యాపారం. 2016వరకు పెట్రోల్ డెలివరీకి అనుమతి లేదని టికేంద్ర వివరిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అంతకుముందు కేవలం డీజిల్ మాత్రమే డెలివరీ చేసే ఆప్షన్ ఉండేదని, తాము డీజిల్ డెలివరీ గతంలోనే ప్రారంభించామని టికేంద్ర చెబుతున్నారు.
SBI Mobile Number Change: ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? మొబైల్ నెంబర్ అప్‌డేట్ చేయండి ఇలా
EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉందా? ఇటీవల తీసుకున్న 5 కీలక నిర్ణయాలు తెలుసుకోండి
తమ ఐడియా గురించి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-IOC, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-BPCL, పెట్రోలియం ప్రాసెస్ ఇంజనీరింగ్ సర్వీస్ కంపెనీ-PESCO కంపెనీలకు, స్టార్టప్ గురించి పీఎంఓకు తెలిపామని మరో ఫౌండర్ అయిన సందీప్ చెబుతున్నారు. కొన్ని రోజుల తర్వాత పీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. మరోవైపు ఫరీదాబాజ్‌లో ఇండియన్ ఆయిల్‌కు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అందించారు. అప్రూవల్ రాగానే బిజినెస్ మొదలుపెట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Business Ideas, BUSINESS NEWS, Good business, Online business, Personal Finance, Small business, Start-Up, Startups