Home /News /business /

BUSINESS IDEA NUTRITIOUS FLOUR WITH LOW INVESTMENT BOOST IMMUNITY YOU CAN EARN 50 THOUSAND RUPEES PER MONTH SK

Business Ideas: మార్కెట్లో ఫుల్ డిమాండ్.. తక్కువ పెట్టుబడితో నెలకు రూ.50వేలు పక్కా..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas: పోషకాహార పిండి శరీరంలో రోగ నిరోధక శక్తి (Immunity)ని పెంచుతుంది. ఒంట్లో చెడు కొలెస్టరాల్‌తో పాటు ఊబకాయాన్ని (Obesity) తగ్గించడంతో దోహదపడుతుంది.

    ప్రజల నుంచి అధిక డిమాండ్ ఉండి.. మంచి లాభాలు తెచ్చే వ్యాపారం చేయాలని మీరు భావిస్తున్నారా? మీ కోసమే ఓ అద్భుతమైన బిజినెస్ ఐడియాను (Business Ideas) తీసుకొచ్చాం. దీనికి పల్లె నుంచి పట్టణం వరకు అంతటా డిమాండ్ ఉంటుంది. కరోనా తర్వాత చాలా మంది ఆరోగ్యంపై దృష్టి సారించారు. పోషకాహారం కోసం బాగా ఖర్చు పెడుతున్నారు. అందువల్ల పోషకాహర పిండి వ్యాపారం చేస్తే.. భారీగా లాభాలు వస్తాయి. తక్కువ పెట్టుబడితోనే దీనిని మరు ప్రారంభించవచ్చు. నెలనెలా పెద్ద మొత్తంలో ఆదాయం మీకు వస్తుంది. పోషకాహార పండి (Nutritious flour) ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండితో తయారుచేసిన వంటకాలు తిండే.. ఆరోగ్యం బాగుంటుంది. అందుకే దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

    పోషకాహార పిండి శరీరంలో రోగ నిరోధక శక్తి (Immunity)ని పెంచుతుంది. ఒంట్లో చెడు కొలెస్టరాల్‌తో పాటు ఊబకాయాన్ని (Obesity) తగ్గించడంతో దోహదపడుతుంది. అంతేకాదు గుండె, రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తుతలకు ఇది దివ్యౌషధం. సాధారణ గోధుమ పిండిలో కొన్ని రకాల ఇతర ఆహార పదార్థాలను కలపవడం వల్ల ఇది పోషకాహార పిండిగా మారుతుంది. గోధుమలను మొలకెత్తేలా చేయాలి. అందుకోసం దాదాపు 12 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. కాస్త మొలకెత్తే దశకు చేరుకోగానే.. వాటిని నీటి నుంచి చూసి.. నీడలో ఆరబెట్టాలి. అనంతరం ఎండలో పూర్తిగా ఎండబెట్టి.. పిండిగా గ్రైండ్ చేయాలి. 700 గ్రాముల ఈ పిండిలో 50 గ్రాముల మునగ ఆకుల పిండి, 100 గ్రాముల కంది పిండి, 50 గ్రాముల మెంతి పిండి, 25 గ్రామల అశ్వగంధ పొడి, 25 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలపాలి. గోధుమ పిండికి ఇవన్నీ కలిపితే.. అదే పోషకాహార పిండి.



    పోషకాహర పిండి తయారీ కోసం ముందుగా సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీస్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్-మైసూర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ మేనేజ్‌మెంట్-కుండలి నుంచి అనుమతి తీసుకోవాలి. అంతేకాదు ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రిజిస్ట్రేషన్ అవసరం. అన్నింటికీ మించి.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తైన తర్వాతే వ్యాపారం మొదలు పెట్టాలి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకే చట్ట బద్ధంగా అనుమతులన్నీ తీసుకోవాలి.



    కిలో పోషకాహర పిండి తయారు చేసేందుకు మీకు రూ.30-35 ఖర్చవుతుంది. మార్కెటింగ్ కోసం మరో ఐదు రూపాయలు ఖర్చవుతాయి. ఈ పిండిని హోల్ సేల్ మార్కెట్‌లో రూ.50, రిటైల్ మార్కెట్లో రూ.60కి అమ్ముకోవచ్చు. తద్వారా కిలో పోషకాహార పిండిపై రూ.10 లాభం వస్తుంది. లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే.. నెలకు రూ.40వేల నుంచి 50వేల వరకు ఆదాయం వస్తుంది.

    (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Business, Business Ideas, Health, Personal Finance

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు