BUSINESS IDEA NAMKEEN EDIBLE SNACK START WITH LOW INVESTMENT EARN HIGH PROFITS KNOW HOW TO START MKS
Business Idea: తక్కువ పెట్టుబడితో వెంటనే లాభాలనిచ్చే వ్యాపారం ఇది..
ప్రతీకాత్మక చిత్రం
అలాంటప్పుడు తక్కువ పెట్టుబడితో పక్కాగా లాభాలు పొందే వ్యాపారాలు చేయడమే మేలు. ఇప్పుడు మీరు చదవబోయే వ్యాపారాన్ని గ్రామాల్లోగానీ పట్టణాల్లోగానీ ఎక్కడైనా ప్రారంభించవచ్చు..
కారణాలు వేర్వురుగా ఉన్నా చాలా మంది సొంత వ్యాపారం చేయాలనుకుంటారు. కానీ కొన్ని సార్లు మంచి ఆలోచన తట్టకపోవచ్చు. గొప్ప ఐడియాను వ్యాపారంగా మలచడానికి ఎక్కువ డబ్బు, పెట్టింది తిరిగొస్తుందా? అనే అనుమానం, అవరరోధాలు ఏర్పడవచ్చు. అలాంటప్పుడు తక్కువ పెట్టుబడితో పక్కాగా లాభాలు పొందే వ్యాపారాలు చేయడమే మేలు. ఇప్పుడు మీరు చదవబోయే వ్యాపారాన్ని గ్రామాల్లోగానీ పట్టణాల్లోగానీ ఎక్కడైనా ప్రారంభించవచ్చు.
ఈ రోజు బిజినెస్ ఐడియాలో మనం స్నాక్స్(చిరుతిండి లేదా మిక్షర్) వ్యాపారం గురించి తెలుసుకుందాం. నామ్కీన్గా పిలుచుకునే ఈ స్నాక్ ను మన దేశంలో ఎంతో ఇష్టంగా తింటారు. చాలా మంది ఉదయం పూట టీతో పాటు బిస్కెట్లు కలిపిన స్నాక్స్ ను ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల స్నాక్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ మీరు గనుక ప్రజలకు భిన్నమైన రుచి ఇవ్వగలిగితే, కొద్ది రోజుల్లోనే మార్కెట్ ను విస్తరించి, భారీ లాభాలను ఆర్జించవచ్చు.
ఎలా ప్రారంభించాలి?
స్నాక్స్ నామ్కీన్ తయారీకి సెవ్ మేకింగ్ మెషిన్, ఫ్రైయర్ మెషిన్, మిక్సింగ్ మిషన్, ప్యాకేజింగ్, వెయింగ్ మెషిన్ అవసరం. ఈ వ్యాపారం కోసం చిన్న దుకాణం లేదా ఫ్యాక్టరీని ప్రారంభించడానికి, 300 చదరపు అడుగుల నుంచి 500 చదరపు అడుగుల స్థలం అవసరం. అలాగే, ఫ్యాక్టరీ పాస్ పొందడానికి, అనేక రకాల ప్రభుత్వ అనుమతులు అవసరం. ఫుడ్ లైసెన్స్, MSME రిజిస్ట్రేషన్, GST రిజిస్ట్రేషన్ వంటివి తప్పనిసరి.
మిక్షర్ తయారీకి శెనగలు, నూనె, మైదా, ఉప్పు, మసాలాలు, వేరుశెనగలు, పప్పులు, వెన్నెల పప్పు ఇలా అన్నీ కావాలి. పని చేయడానికి 1-2 మంది కార్మికులు కూడా అవసరం. దీంతో పాటు కనీసం 5-8 కిలోవాట్ల విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఎంత సంపాదిస్తారు?
నామ్కీన్ లేదా మిక్షర్ స్నాక్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి కనీసం 2 లక్షలు గరిష్టంగా 6 లక్షలు ఖర్చవుతుంది. అయితే ప్రాడక్టు రుచిగా ఉండి ప్రజల ఆదరణ లభిస్తే కొద్ది రోజుల్లోనే ఖర్చులో 20 నుంచి 30 శాతం లాభం పొందవచ్చు. ఏ సీజన్ లోనైనా ఈ వ్యాపారాన్ని కొనసాగించవచ్చు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.