Home /News /business /

BUSINESS IDEA MASALA MAKING UNIT KNOW HOW TO START MASALA MAKING UNIT WITH LOW INVESTMENT SK

Business Idea: ప్రతి ఇంట్లో ఉండేదే.. ఏడాది పొడవునా డిమాండ్.. ఈ వ్యాపారంతో లాభాలే లాభాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Business Ideas: మసాల తయారీ యూనిట్‌ నుంచి.. ఏడాదిలో 200 క్వింటాళ్ల మసాలా ఉత్పత్తి అవుతాయి. క్వింటాల్‌కు రూ.5,400 చొప్పున విక్రయిస్తే.. ఏడాదిలో రూ.10.80  లక్షల వరకు అమ్మకాలు జరిగే అవకాశం ఉంది.

    భారతీయ వంటకాల్లో మసాలాలు తప్పనిసరిగా వాడతారు. వంటకాలకు అద్భుతమైన రుచి రావాలంటే మసాలాలదే ప్రధానమైన పాత్ర. అందుకే దాదాపు ప్రతి వంటింట్లోనూ మసాలాలు ఉంటాయి. సుగంధ ద్రవ్యాలకు ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. దేశంలో మిలియన్ల టన్నుల వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు ఉత్పత్తి అవుతున్నాయి. మీరు ఏదైనా వ్యాపారం (Business Ideas) చేయాలని ఆలోచిస్తున్నట్లయితే.. మసాలా తయారీ యూనిట్‌కు ప్రారంభించవచ్చు. దీనిని తక్కువ పెట్టుబడితోనే స్టార్ట్ చేయవచ్చు. ప్రత్యేకమైన యూనిట్ కాకుండా.. మీ ఇంట్లోనే మసాలా (Masala Making)ను తయారు చేస్తే... మీకు మరింత ఆదాయం వస్తుంది. మార్కెట్‌పై అవగాహన ఉండి.. మంచి నాణ్యతతో కూడిన మసాలాను తయారు చేస్తే.. బాగా లాభాలు వస్తాయి.

    EPFO: త్వరలోనే ఉద్యోగుల ఖాతాల్లోకి పీఎఫ్ వడ్డీ డబ్బులు.. లక్ష ఉంటే ఎంత వడ్డీ వస్తుందంటే..

    సుగంధ ద్రవ్యాల యూనిట్ల ఏర్పాటు ఖర్చులు, ఆదాయాలపై ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (KVIC) ఒక నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదిక ప్రకారం.. సుగంధ ద్రవ్యాల తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు ఖర్చవుతుంది. 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో షెడ్డుకు రూ.60 వేలు, యంత్రాల ధర రూ.40 వేలు. ఇవి కాకుండా ముడి సరుకులు, ఇతర అవసరాల కోసం మరో రూ.2.50 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. మిరపకాయలు, పసుపు, కొత్తిమీరను రుబ్బుకోవడానికి గ్రైండర్ అవసరం. అవి అంత పెద్ద యంత్రాలేమీ కావు. రేటు కూడా తక్కువే ఉంటుంది. మీరు వాటిని ఆన్‌లైన్‌లో కూడా ఆర్డర్ చేయవచ్చు. మసాలా తయారీలో పసుపు, ఎండుమిర్చి, ఎండు మిరపకాయ, జీలకర్ర, కొత్తిమీరను ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు. వీటిని గ్రైండ్ చేసి ప్యాకింగ్ చేసిన తర్వాత మార్కెట్లో విక్రయిస్తారు.

     IRCTC QR Code: ప్రయాణికులకు శుభవార్త... ఐఆర్‌సీటీసీ క్యూఆర్ కోడ్ పేమెంట్ సేవలు

    మసాల తయారీ యూనిట్‌ నుంచి.. ఏడాదిలో 200 క్వింటాళ్ల మసాలా ఉత్పత్తి అవుతాయి. క్వింటాల్‌కు రూ.5,400 చొప్పున విక్రయిస్తే.. ఏడాదిలో రూ.10.80  లక్షల వరకు అమ్మకాలు జరిగే అవకాశం ఉంది. ఇందులో ఖర్చులన్నీ తీసివేస్తే ఏటా రూ.3 లక్షల లాభం వస్తుంది. అంటే నెలలో రూ.25 వేలకు పైగా ఆదాయం వస్తుంది. అద్దె భవనంలో కాకుండా... సొంత ఇంట్లో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మరింత లాభం మరింత పెరుగుతుంది. ఇంట్లోనే యూనిట్ ఏర్పాటు చేసుకుంటే.. మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు తగ్గుతుంది. లాభం మరింత పెరుగుతుంది.



    మీ సంపాదన ఉత్పత్తి అమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువగా అమ్మితే.. అంత ఎక్కువ లాభం వస్తుంది. అందుకే అమ్మకాలు పెంచుకోవడంపైనే మీ దృష్టి పెట్టాలి. మీరు తయారు చేసిన మసాలా దినుసులను బాగా ప్యాక్ చేయాలి. మంచి నాణ్యత ఉండేలా చూసుకోవాలి. హోల్‌సేల్‌లో కాకుండా రిటైల్‌గా విక్రయిస్తే మరింత లాభం ఉంటుంది. కాబట్టి స్థానికంగానే అమ్మకాలు జరిగేలా చూడండి. లేదంటే ఆన్‌లైన్‌లో కూడా విక్రయాలు జరపవచ్చు.

    (Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Business

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు