BUSINESS IDEA MALABAR NEEM FARMING WITH LOW INVESTMENT YOU CAN EARN LAKHS RUPEES WITHIN 5 YEARS MKS
Business Idea: తక్కువ పెట్టుబడితో ఇంట్లో కూర్చొనే లక్షాధికారి కావొచ్చు.. ఇలా చేయండి..
ప్రతీకాత్మక చిత్రం
తక్కువ సమయంలో కోటీశ్వరులు అవ్వాలనుకుంటే, ఇవాళ్టి బిజినెస్ ఐడియాను ఫాలో అయితే సరి. ఇది కేవలం 5 సంవత్సరాలలో మిమ్మల్ని లక్షాధికారిగా మార్చుతుంది. మలబార్ వేప సాగు ద్వారా మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.
నేటి ఆర్థిక యుగంలో చాలా మంది విద్యావంతులు వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. మీరు కూడా చాలా తక్కువ సమయంలో కోటీశ్వరులు అవ్వాలనుకుంటే, ఇవాళ్టి బిజినెస్ ఐడియాను ఫాలో అయితే సరి. ఇది కేవలం 5 సంవత్సరాలలో మిమ్మల్ని లక్షాధికారిగా మార్చుతుంది. మలబార్ వేప సాగు ద్వారా మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఈ చెట్లను పంటలతో కూడా నాటవచ్చు. కాబట్టి అదనపు భూమి కూడా అవసరం ఉండదు. ఉన్నదాంట్లోనే లేదా లీజుకు తీసుకునైనా సాగు చేసుకోవచ్చు.
మలబార్ వేప లేదా మెలియా దుబియా అని పిలిచే చెట్టు మెలియాసి బొటానికల్ కుటుంబం నుంచి ఉద్భవించింది. మలబార్ వేప యూకలిప్టస్ లాగా వేగంగా పెరుగుతుంది. దాని మొక్కలు నాటిన రెండేళ్లలోనే 40 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల రైతులు ఈ చెట్లను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు.
చెట్లను ఎలా నాటాలి?
మలబార్ వేప చెట్టు సాధారణ వేప చెట్టుకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. దీన్ని అన్ని రకాల నేలల్లో సులభంగా సాగు చేయవచ్చు. దీని కోసం, ఎక్కువ నీరు అవసరం లేదు, తక్కువ నీటిలో బాగా పెరుగుతాయి. మార్చి లేదా ఏప్రిల్ నెలలలో దాని విత్తనాలను విత్తడం ఉత్తమ ఫలితాలనిస్తుంది. ఇది అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. 4 ఎకరాల భూమిలో కనీసం 5000 మలబార్ వేప మొక్కలను నాటవచ్చు. పొలం బయట ఉన్న గట్టుపై 2000 చెట్లను, పొలం లోపల 3000 చెట్లను నాటవచ్చు.
మలబార్ వేప మొక్కలు
ఐదు సంవత్సరాల వ్యవధిలోనే మలబార్ వేప చెట్లు పెరిగిపెద్దయి విలువైన కలపగా మారుతుంది. ఈ చెట్లకు చెదపురుగులు పీడ ఉండదు. గిరాకీ ఎక్కువ. దీని కలప ప్లైవుడ్ పరిశ్రమలో విరివిగా వాడుతుంటారు.
ఎంత సంపాదించవచ్చంటే?
మలబార్ మొక్కలు నాటిన 5 నుంచి 8 ఏళ్లలో కలపను అమ్మవచ్చు. 4 ఎకరాల్లో సాగు చేయడం ద్వారా రూ.50 లక్షల వరకు సులభంగా సంపాదించవచ్చు. ఒక చెట్టు ఒకటిన్నర నుంచి రెండు టన్నుల బరువు ఉంటుంది. మార్కెట్లో ఈ కలప క్వింటాలుకు కనీసం రూ.500 దక్కుతుంది. అంటే ఒక మొక్కను రూ.6000-7000కి విక్రయించినా.. రైతులు సులువుగా లక్షల రూపాయలను ఆర్జించవచ్చు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.