హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. వీటి సాగుకు 75శాతం ప్రభుత్వ సబ్సిడీ..

Business Idea: తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. వీటి సాగుకు 75శాతం ప్రభుత్వ సబ్సిడీ..

నిరుద్యోగులైనా, ఉద్యోగం చేసేవారైనా వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించాలనుకుంటే ఈ రోజు మనం అటువంటి నగదు పంట గురించి తెలుసుకుందాం. ఇది చెడిపోయే అవకాశం చాలా తక్కువ.

నిరుద్యోగులైనా, ఉద్యోగం చేసేవారైనా వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించాలనుకుంటే ఈ రోజు మనం అటువంటి నగదు పంట గురించి తెలుసుకుందాం. ఇది చెడిపోయే అవకాశం చాలా తక్కువ.

నిరుద్యోగులైనా, ఉద్యోగం చేసేవారైనా వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించాలనుకుంటే ఈ రోజు మనం అటువంటి నగదు పంట గురించి తెలుసుకుందాం. ఇది చెడిపోయే అవకాశం చాలా తక్కువ.

నిరుద్యోగులైనా, ఉద్యోగం చేసేవారైనా వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించాలనుకుంటే ఈ రోజు మనం అటువంటి నగదు పంట గురించి తెలుసుకుందాం. ఇది చెడిపోయే అవకాశం చాలా తక్కువ. పలు రకాలుగా దీనిని విక్రయించవచ్చు. అవును, మనం చెప్పుకుంటున్నది బొప్పాయి సాగు గురించే. ఉత్తరభారతంలో బొప్పాయిలను మార్చి-ఏప్రిల్ నెలలో ఎక్కువగా పండిస్తారు. పోషకాలు పుష్కలంగా ఉండే పండుతో వ్యాపారంలో లాభాలు కూడా పుష్కలంగానే ఉంటాయి..

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 మిలియన్ టన్నుల బొప్పాయి ఉత్పత్తి అవుతుంది. ఇందులో అంటే, అంటే 3 మిలియన్ టన్నుల బొప్పాయి మన దేశంలోనే ఉత్పత్తి అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా బొప్పాయి ఉత్పత్తిలో భారత్ ముందంజలో ఉంది. భారత్ కాకుండా బ్రెజిల్, మెక్సికో, నైజీరియా, ఇండోనేషియా, చైనా, పెరూ, థాయిలాండ్, ఫిలిప్పీన్స్‌ లాంటి దేశాల్లో బొప్పాయి సాగవుతుంది. దేశీయ ఉత్పత్తిలో 0.8 శాతం మాత్రమే ఎగుమతి అవుతుంది. మిగిలిందంతా దేశంలోనే వినియోగం అవుతుంది.

Petrol Diesel Prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర.. 2 వారాల్లో 12వ సారి బాదుడు..

బొప్పాయి ప్రయోజనాలు

మామిడి తర్వాత బొప్పాయిలో విటమిన్ ఎ ఎక్కువగా లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్, షుగర్, అధిక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. మహిళల్లో పీరియడ్స్ సమయంలో నొప్పిని తగ్గిస్తుంది. బొప్పాయిలో ఉండే ఎంజైమ్ పపైన్‌లో అత్యంత ఔషధ గుణాలు ఉన్నాయి. దీని డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పండును నేరుగా తినడమే కాకుండా, చూయింగ్ గమ్, సౌందర్య సాధనాలు, ఫార్మా పరిశ్రమల్లోనూ వాడుతారు. మన దేశంలో బొప్పాయి విక్రయాలకు ఢిల్లీ, ముంబై అతిపెద్ద మార్కెట్‌లు. అలాగే హైదరాబాద్, జైపూర్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, గౌహతి, అహ్మదాబాద్, లక్నో, పాట్నా, రాయ్‌పూర్, బరౌత్, జమ్మూలోనూ పెద్ద మార్కెట్లున్నాయి.

Gold Silver Price Today: గోల్డ్ రేటు పెరిగింది.. సిల్వర్ తగ్గింది.. బంగారం, వెండి తాజా ధరలు ఇవే..

ఇలా నాటండి

మీరు కూడా బొప్పాయి సాగు చేయాలనుకుంటే, జూలై నుంచి సెప్టెంబర్ లేదా ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య దాని విత్తనాలను నాటాలి. 1.8X1.8 మీటర్ల దూరంలో మొక్కలు నాటే పద్ధతిలో సాగు చేసేందుకు ఒక హెక్టారుకు సుమారు రూ.లక్ష ఖర్చు అవుతుంది. బొప్పాయి మొక్కలకు ఎరువుపై చాలా శ్రద్ధ వహించాలి. మే-జూన్ సీజన్‌లో ప్రతి వారం చెట్లకు నీరందించాలి. తద్వారా ఉత్పత్తి మెరుగ్గా ఉంటుంది.

బొప్పాయి సాగు

Lockdown పెట్టినా ఆగని కరోనా వ్యాప్తి -కొత్త వేరియంట్ దెబ్బకు చైనా విలవిల -2ఏళ్ల తర్వాత భారీగా కొత్త కేసులు

ఎంత సంపాదిస్తారంటే..

బొప్పాయి సాగు కోసం చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు సబ్సిడీ అందిస్తున్నాయి. బీహార్ ప్రభుత్వమైతే ఏకంగా 75 శాతం వరకు సబ్సిడీని అందిస్తుంది. బొప్పాయి సాగు ద్వారా లక్షల రూపాయలు సులభంగా సంపాదించవచ్చు. బొప్పాయి చెట్టును చక్కగా సంరక్షిస్తూ, కాలానుగుణంగా కొయ్యలను కొడుతూ ఉంటే, ఒక్కో చెట్టు నుంచి 50 కిలోల వరకు పండ్లు సులభంగా లభిస్తాయి. మార్కెట్‌లో ఈ పండ్లను విక్రయించడం ద్వారా లక్షల రూపాయల ఆదాయం పొందడం సులభం.

(Disclaimer: ఈ కథనం కేవలం నివేదికలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ఈ వ్యాపారం ప్రారంభించే ముందు లోతైన అధ్యయనం చేయడం, సంబంధిత మార్కెట్ నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం)

First published:

Tags: Business, Business Ideas, Organic Farming, Papaya, Personal Finance

ఉత్తమ కథలు