• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • BUSINESS IDEA JUST INVEST RUPEES 70000 INSTALL SOLAR PANEL AT ROOFTOP AND EARN MONEY FOR 25 YEARS NK

Business Idea: రూ.70వేల పెట్టుబడి... 25 సంవత్సరాలు ఆదాయం... ఇలా చెయ్యండి

Business Idea: రూ.70వేల పెట్టుబడి... 25 సంవత్సరాలు ఆదాయం... ఇలా చెయ్యండి

Business Idea: రూ.70వేల పెట్టుబడి... 25 సంవత్సరాలు ఆదాయం... (ప్రతీకాత్మక చిత్రం)

Business Idea: ఇలాంటి వ్యాపార ఐడియా ఉందని చాలా మందికి తెలియదు. తెలిస్తే వెంటనే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే నెల నెలా లాస్ అన్నదే లేకుండా డబ్బు వస్తూనే ఉంటుంది. ఎలాగో తెలుసుకుందాం.

  • Share this:
    Business Idea: చాలా మంది కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే... నష్టం వస్తుందేమో అని టెన్షన్ పడతారు. నిజమేమరి... లాభం సంగతేమోగానీ పెట్టిన పెట్టుబడైనా వెనక్కి రావాలి లేదంటే అడ్డంగా నష్టపోతాం. అందువల్ల ఏ వ్యాపారం చేయాలనుకున్నా... ముందు సరైనది ఎంచుకొని... దాని గురించి బాగా తెలుసుకొని అప్పుడు అందులోకి దిగాలి. కొన్ని వ్యాపారాలకు పెద్దగా పెట్టుబడి అవసరం ఉండదు. పైగా వాటిలో లాభాలు భారీగా ఉంటాయి. అలాంటివి ఉంటాయంటే వెంటనే నమ్మలేం. అలాంటిది ఒకటి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వ్యాపారాన్ని తక్కువలో తక్కువ రూ.70,000 ప్రారంభించవచ్చు. ఓ పాతికేళ్ల వరకూ ఇంట్లోనే ఉండి హాయిగా సంపాదించుకోవచ్చు.

    డాబాపైన సోలార్ ప్యానెళ్లు:
    ఈ వ్యాపారానికి ఇంటిపై కప్పు కావాలి. డాబా ఉంటే మంచిది. అక్కడ సోలార్ ప్యానెళ్లు అమర్చుకోవాలి. వాటి ద్వారా నెల నెలా ఆదాయం వస్తుంది. మీరు ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెళ్ల ద్వారా వచ్చే కరెంటును మీరు గ్రిడ్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేసుకుంటే... మీకు గ్యారెంటీగా మంచి ఆదాయం వస్తుంది. ఇందుకోసం మీరు రూ.1 లక్ష ఖర్చు పెట్టి... డాబాపై లేదా ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలి. మీ పెట్టుబడికి 30 శాతం సబ్సిడీ ఉంటుంది. అందువల్ల అయ్యే ఖర్చు రూ.70వేలే.

    ప్రభుత్వ సబ్సిడీ:
    కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేవారికి ఈ సబ్సిడీ ఇస్తోంది. కేంద్రంలోని పునరుత్పాదక ఇంధన శాఖ... ఈ 30 శాతం సబ్సిడీ ఇస్తోంది. అందువల్ల మీరు రూ.లక్ష పెట్టి సోలార్ ప్యానెళ్లు కొన్నా... వాటికి రూ.30 వేలు డిస్కౌంట్ పొందగలరు.


    సేవింగ్ అవకాశం:
    నిజానికి చాలా రాష్ట్రాల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు రూ.లక్ష కంటే తక్కువ ఖర్చే అవుతోంది. కేంద్రంతోపాటూ... కొన్ని రాష్ట్రాలు కూడా ఇలాంటి సబ్సిడీని అదనంగా ఇస్తున్నాయి. అందువల్ల మీరు 1కిలో వాట్ (KW) సోలార్ పవర్ ప్యానెల్స్ ఏర్పాటుచేసుకోవచ్చు. రాష్ట్రాలు సబ్సిడీ ఇస్తే మీకు రూ.60,000కే పనైపోతుంది.

    డబ్బు లేకపోతే లోన్ సదుపాయం:
    మీ దగ్గర డబ్బు లేకపోతే... మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవచ్చు. మీకు ఆదాయం వస్తుంది కాబట్టి... లోన్ ఈజీగా తీర్చవచ్చు. రూ.70వేలు అనేది బ్యాంకులకు పెద్ద మ్యాటర్ కాదు. ఈజీగానే ఇస్తాయి. లోన్ చెల్లించడం కూడా కొద్దికొద్దిగా చెల్లించేయవచ్చు.

    25 ఏళ్లు ఆదాయం ఎలా?
    సోలార్ ప్యానెళ్లు 25 ఏళ్లపాటూ మన్నుతాయి. అవి పాడవకుండా చూసుకోవాలి. వాటిని డాబాపై ఏర్పాటు చేసుకున్నాక... మీరు ఇంటికి కావల్సిన కరెంటును వాటి ద్వారా ఉత్పత్తి చేసుకొని వాడుకోవచ్చు. అందువల్ల మీకు కరెంటు బిల్లు సమస్య పోతుంది. ఆ డబ్బు మిగులుతుంది. అలాగే... అదనపు కరెంటును అమ్ముకోవచ్చు. ప్రభుత్వానికీ లేదా ప్రైవేట్ కంపెనీకి అమ్ముకోవచ్చు. మీరు మరింత ఎక్కువ ఖర్చు పెడితే... 5 నుంచి 6 KW ఉత్పత్తి చేస్తే... మీకు మరింత ఆదాయం వస్తుంది.

    సోలార్ ప్యానెల్ ఎలా పొందాలి?
    మీకు చాలా డౌట్లు వస్తూ ఉండొచ్చు. సింపుల్‌గా కేంద్ర ప్రభుత్వానికి చెందిన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి విభాగాన్ని కలవాలి. వాళ్లను సోలార్ ప్యానెల్ అడగాలి. వాళ్లకు రాష్ట్రంలోని వేర్వేరు నగరాల్లో ఆఫీసులు ఉంటాయి. వాళ్లు ప్యానెల్స్ ఇస్తారు. లేదా... ప్రైవేట్ డీలర్ల ద్వారా కూడా వాటిని పొందవచ్చు.

    ఇది కూడా చదవండి: Business Idea: కరోనా కాలంలో ఇది సరైన వ్యాపారం... నెలకు రూ.50,000 లాభం

    సబ్సిడీ ఎలా పొందాలి?
    సబ్సిడీ పొందేందుకు పైన చెప్పుకున్న ఆఫీసుకు వెళ్లి... ఓ ఫామ్ నింపాల్సి ఉంటుంది. తద్వారా సబ్సిడీ వస్తుంది. లోన్ ద్వారా ఏర్పాటు చేసుకోవాలన్నా... సంబంధిత అధికారులు వివరాలు చెబుతారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు