హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: వ్యవసాయంలో లక్షలు సంపాధించాలనుకుంటున్నారా? అయితే.. ఈ చెట్లు పెంచితే రూ. 50 లక్షలు మీవే.. ఓ లుక్కేయండి

Business Idea: వ్యవసాయంలో లక్షలు సంపాధించాలనుకుంటున్నారా? అయితే.. ఈ చెట్లు పెంచితే రూ. 50 లక్షలు మీవే.. ఓ లుక్కేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేటి కాలంలో మంచి లాభాలను ఆశించి చాలా మంది వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే వ్యవసాయానికి సంబంధించిన బిజినెస్ ఐడియాని (Business Idea) మీ ముందుకు తీసుకొచ్చాం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  అతి తక్కువ సమయంలో కోటీశ్వరులు కావాలని ఎవరు కోరుకోరూ? ఈ రోజుల్లో అంతా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాధించాలని కలలు కంటున్నవారే అధికం. అయితే కాస్తే తెలివి ఉపయోగించి కష్టపడితే ఇది సాధ్యమేనని చెబుతున్నారు నిపుణులు. నేటి కాలంలో మంచి లాభాలను ఆశించి చాలా మంది వ్యవసాయం (Agriculture) వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే వ్యవసాయానికి సంబంధించిన బిజినెస్ ఐడియాని (Business Idea) మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ నేపథ్యంలో మలబార్ వేప సాగు గురించి తెలుసుకుందాం. ఇది చాలా వేగంగా పెరుగుతున్న చెట్టు మరియు మీరు మీ పొలాల్లో ఇతర పంటల మధ్య కూడా దీనిని నాటవచ్చు. దీనితో, మీ సారవంతమైన నేల కూడా సురక్షితంగా ఉంటుంది. ఇంకా కోటీశ్వరులు కావాలనే మీ కల కూడా నెరవేరుతుంది. అయితే, మీరు ఈ చెట్లను ఎంత ఎక్కువ భూమిలో పెంచుతున్నారనే దానిపై లాభం ఆధారపడి ఉంటుంది. మలబార్ వేపను దుబియా చెట్టు అని కూడా అంటారు. ఈ చెట్టు మెలియాసి వృక్ష కుటుంబం నుండి వచ్చింది. దక్షిణ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రైతులు దీనిని పెద్ద ఎత్తున పండిస్తున్నారు.

  ఈ చెట్టును ఎలా పెంచాలి?

  ఈ చెట్టు సాధారణ వేప చెట్టు కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇది అన్ని రకాల నేలల్లో పెరుగుతుంది. మరియు ఈ చెట్టు పెంపకానికి అధిక నీరు అవసరం లేదు. మార్చి-ఏప్రిల్‌లో ఈ మొక్కను నాటడం ఉత్తమం. మీరు 4 ఎకరాల పొలంలో 5000 మలబార్ వేప చెట్లను నాటవచ్చు. ఈ చెట్టు యొక్క చెక్కను నిర్మాణ పనులలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ చెట్టుకు చెదపురుగుల బెడద ఉండకపోవడంతో ప్లైవుడ్ పరిశ్రమలో ఈ చెక్కను ఫేవరెట్‌గా పరిగణిస్తారు. అయితే ఈ చెట్టు నుంచి లాభాలు రావాలంటే నాటిన తర్వాత 8 ఏళ్లు ఆగాల్సిందే. ఈ చెట్టు పెరగడానికి మరియు అమ్మకానికి విలువైనదిగా మారడానికి దాదాపు చాలా సమయం పడుతుంది.

  Business Idea: తక్కువ పెట్టుబడి.. రూ.లక్ష ఆదాయం.. ఈ బెస్ట్ బిజినెస్ వివరాలివే

  ఎంత ఆదాయం వస్తుందంటే..

  ఈ చెట్టు కలపను క్వింటాల్‌ రూ.500కి విక్రయిస్తున్నారు. ఒక చెట్టు సుమారు 1.5 టన్నుల బరువు ఉంటుంది. అంటే, మీరు ఒక చెట్టు నుండి రూ.6,000-7000 వరకు సంపాదించవచ్చు. 4 ఎకరాల్లో 5,000 చెట్లు నాటితే, మీరు ఖర్చులు పోనూ సులభంగా రూ. 50 లక్షల వరకు సంపాదించవచ్చు. పొలం విస్తీర్ణం పెంచి అందులో రెట్టింపు పంట వేస్తే.. చెట్లను అమ్మి కోటీశ్వరులుకూడా కావొచ్చు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Agriculture, Business Ideas, Farming, Investment Plans

  ఉత్తమ కథలు